Satyabhama Today Episode February 25th: నిన్నటి ఎపిసోడ్లో.. క్రిష్ సత్యపై చెయ్యేసినందుకు సంజయ్ ని చితగ్గొట్టేస్తాడు. రక్తం వచ్చేలా కొడతాడు ఎవరు ఆపినా కూడా ఆగడు. సంజయ్ ని నా సత్య మీద చేయిస్తావని చంపబోతాడు. ముందు మీద కాలు పెట్టి నీకు ఇక భూమి మీద నూకలు చెల్లాయి ఇన్ని రోజులు సంధ్య మొహం చూస్తే నిన్ను వదిలాను ఇక నువ్వు చేసే మోసం గురించి అందరికీ తెలిస్తే అందరు నిన్నే ఛీ అంటారు అంటూ సంజయ్ ని చంపబోతాడు.. అప్పుడే మహదేవయ్య వచ్చి రేయ్ చిన్న అంటూ క్రిష్ ను కాలుతో తన్నెస్తాడు.. ఎందుకురా నువ్వు నా కొడుకుని చెప్పాలి అనుకుంటున్నావు నీకేం అధికారం ఉందని నువ్వు చంపుతావు అనేసి మహాదేవయ్యా క్రిష్ ను అంటాడు. నువ్వు అస్సలు నా కొడుకువే కాదు అని అంటాడు. ఇక భైరవి పెళ్లాంతో కుమ్మక్కయ్ సంజయ్ ప్రాణం తీయాలి అనుకున్నావ్ కదరా. తప్పు కదరా పాపం ఎట్లా గిల గిలా కొట్టుకుంటున్నాడో చూడండి అంటూ అంటుంది. మహదేవయ్య ఛీ నీ ముఖం చూడాలి అంటే అసహ్యాంగా ఉందిరా ఇంక మాటలేంటి.. సంజయ్ నటిస్తూ వీళ్లిద్దరూ నా నుంచి బయటకు గెంటేయాలి అని చూస్తున్నారు. ఈ ఇళ్లు నాది అనుకున్నా మీలో నా అమ్మానాన్నని చూస్తున్నా మీరంతా నా ఆప్తులు అనుకున్నా. జీవితాంతం మీతో సంతోషంగా ఉండాలి అనుకున్నా. ఇందంతా ఓ భ్రమ అని తేలిపోయింది. సంజయ్ కన్నీళ్ల నాటకాన్ని చూసి అందరు నిజం అని నమ్ముతారు. మహదేవయ్య నిజం చెప్పేస్తాడు.. నా చిన్న కొడుకు సంజయ్ అంటాడు. నువ్వు తట్టుకున్నా తట్టుకోకపోయినా ఇదే నిజం. నువ్వు నా కొడుకువి కాదు. నువ్వు బుద్ధిగా ఉండి ఉంటే పాతికేళ్లగా దాచుకున్న ఈ నిజం ఎప్పటికీ నా గుండెల్లోనే దాచుకునేవాడిని. ఎప్పటికీ నా కొడుకులా చూసుకునేవాడిని. కానీ గీత దాటావు. ఈ స్థానంలో ఉండాల్సింది వీడు నా అసలైన కొడుకు నా చిన్న కొడుకు సంజయ్. క్రిష్ కుప్పుకూలిపోయి.. అక్కదితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాపు కొడుకుని కాదట పరాయి వాడినంట. నా గుండెల మీద ఎవరో కాళ్లు వేసి తొక్కుతున్నట్లుంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొడుకు కాదు అంటే నేను ఏమైపోవాలి సత్య. బాపు కాదన్నా కూడా నేను బాపు కొడుకునే. ఇక్కడ గుండె నిండా ప్రేమ ఉంది నా ప్రేమ చావదు. అని అంటాడు.. జయమ్మ వాడు నీ కొడుకు కాకపోతే ఎవడ్రా వాడు అని అడుగుతుంది. భైరవి డెలివరీ అయినప్పుడు అక్కడ హాస్పిటల్ లో ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా అప్పుడే పక్కవాడిలో కాన్పైనా చక్రవర్తి కొడుకుని నా కొడుకుగా పెంచాను కేవలం నాకు కాపలాగా మాత్రమే పెంచాను నా కొడుకుని ఆ చక్రవర్తికి ఇచ్చాను అనగానే షాక్ అవుతాడు.. నిజం తెలియదనే చాలా బాధపడిపోతాడు నువ్వు అసలు నా కొడుకువే కాదు నేను ఇన్ని రోజులు నేను కుక్కలాగా పెంచుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు కన్న కొడుకుని చంపాలని చూసావు అందుకే ఈ నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చిందని మహాదేవయ్య అంటాడు.. నీ కన్నకొడుకుని కాదన్నా కాదన్నప్పుడు మరి నువ్వు ఎందుకు నీ గుండెల మీద పచ్చ పట్టుకున్నావ్ అనగానే ఇది నువ్వు ప్రేమనుకుంటున్నావా సరే ఆ ప్రేమనే నేను ఇప్పుడేం చేస్తానో చూడు అని ఆ పచ్చబొట్టు నువ్వు కత్తితో చేరిపేస్తాడు మహదేవయ్యా..
నేను నిన్ను ఇన్ని రోజులు ఇంటికి కాపలా కుక్కలాగే పెంచుకున్నాను నువ్వు వేరే వెళ్ళిపోవాల్సిందే అనేసి అంటాడు.. మహదేవయ్యా కృష్ణ ఇంట్లోంచి బయటికి గెంటే మని తన కొడుకులకు చెప్తాడు. అయితే సత్య మాత్రం ఎవరిని గెంటేయాలని చూస్తున్నారు ఇన్ని రోజులు మీకు కాపలా ఉన్నాయి కన్నా అనేసి క్లాస్ పీకుతుంది.. సత్య ఒకవైపు మాట్లాడుతుంటే మహదేవయ్య ఏ మాత్రం సత్యను ఒక్క మాటతో నోరు మూయిస్తాడు. ఇక సత్య మాట్లాడుతుంటే ఆపు ఇంక చాలు నీ సోది అని చెప్పేసి అరుస్తాడు. వాడు ఈ బాధ నుంచి బయటికి వచ్చి నన్ను ఏదో చేసినప్పుడు అప్పుడు చూసుకుందాం ఇప్పుడైతే ఇది నీ సొంతిల్లు కాదు నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు లేవరా అనేసి బయట గెంటేస్తాడు మహాదేవయ్యా.. ఏ ఆపు పోనీలే అని వింటుంటే చేతకానం అనుకుంటున్నావా. ఏయ్ లేరా ఇది నీకు సొంతిళ్లు కాదు నట్టింట్లో కూర్చొని ఏడ్వడానికి లేరా అని బయటకు గెంటేస్తాడు. చక్రవర్తి పట్టుకుంటాడు. ఇక సత్య మాత్రం ఏం జరిగిందో జరుగుతుందో అర్థమైందా మామయ్య ఈ రోజు క్రిష్కి ఈ ఇంట్లో అవమానం జరిగింది. నిజం చెప్పేయండి అని అంటే మీ అన్నయ్యకి భయపడి చెప్పలేదు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి క్రిష్ని గుండెల మీద తన్నారు. గుండె పడిగేలా ఏడ్పించారు. మెడ పట్టుకొని గెంటేశారు.
చక్రవర్తి క్రిష్కి సారీ చెప్పు అని ఒకరి కాలర్ ఒకరు పట్టుకుంటారు. అన్నయ్య నా కొడుకుని లాక్కున్నాడు. బలవంతంగా తన కొడుకుని నా చేతిలో పెట్టాడు. జాగ్రత్తగా వాడిని పెంచి తిరిగి తన చేతిలో పెట్టాను. కానీ అన్నయ్య నా కొడుకుని గెంటేశాడు. మర్యాదా ఇది అడగమ్మ అమ్మ అన్నని.. కానీ జయమ్మ మాత్రం దానికి నేను ఏం చెయ్యలేను అంటుంది. మహదేవయ్యా చక్రవర్తి ఇద్దరు కాలర్ పట్టుకుని అరుస్తారు నా కొడుకుని మెడ పట్టు గెంటేస్తావని చక్రవర్తి అంటాడు. ఇద్దరు గొడవపడడం కాదు మామయ్య ఈ లెక్కలన్నీ తేల్చాల్సింది ఒక క్రిష్ మాత్రమే అని సత్య అంటుంది.. సమయం వస్తుంది. క్రిష్ అన్నీ లెక్కలు సరిచేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.. రేపటి ఎపిసోడ్లో చక్రవర్తి ఇంటికి క్రిష్ వెళతాడు. జయమ్మ మాత్రం మహాదేవయ్యకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే…