AUS VS SA: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా వర్సెస్… దక్షిణాఫ్రికా మధ్య ( Australia vs South Africa) ఇవాళ రసవత్తర ఫైట్ జరగనుంది. గ్రూప్ బి లో ఆస్ట్రేలియా అలాగే దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు… తలో విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ టీం పైన సౌత్ ఆఫ్రికా విజయం సాధించగా… ఇంగ్లాండును చిత్తు చేసింది ఆస్ట్రేలియా. అయితే ఇవాళ… ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడబోతున్నాయి. పాకిస్తాన్ లోని ( Pakisthan ) రావల్పిండి వేదికగా ( Rawalpindi )… ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం… మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read: UP VS RCB: WPLలోనే తొలి సూపర్ ఓవర్..9 పరుగులు కూడా చేయలేక ఓడిన RCB !
ఇందులో టాస్ ప్రక్రియ రెండు గంటలకు ఉంటుంది. ఇదే వేదికగా నిన్న… బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో మొదట బౌలింగ్ చేసిన.. న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కాబట్టి… ఇవాళ కూడా టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ తీసుకున్న జట్టు విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా జరుగుతున్న మ్యాచులన్నీ… జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ప్రసారాలన్నీ ఉచితంగానే అందిస్తోంది జియో హాట్ స్టార్. అలాగే స్టార్ స్పోర్ట్స్ తో పాటు స్పోర్ట్స్ 18 లో కూడా మ్యాచులు తిలకించవచ్చు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఆస్ట్రేలియా వర్సెస్… దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న నేపథ్యంలో.. ఇందులో ఏ జట్టు గెలిచినా సెమీస్ ఛాన్సులు పెంచుకుంటాయి. ఒక జట్టు ఓడినా.. సెమీస్ కు వెళ్లే ఛాన్సులు ఉంటాయి. దీంతో… రెండు జట్లు కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. అటు గ్రూప్ ఏ లో టీమిండియా అలాగే న్యూజిలాండ్ జట్లు రెండు సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే… సెమీస్ బరిలో టీమిండియా అలాగే న్యూజిలాండ్ జట్లతో పాటు… ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: Virat fans in Islamabad: కోహ్లీ సెంచరీ.. పాకిస్థాన్ గడ్డపై సంబరాలు… గూస్ బంప్స్ రావాల్సిందే !
ఆస్ట్రేలియా VS దక్షిణాఫ్రికా ఇరు జట్లు
ఆస్ట్రేలియా: 1 మాథ్యూ షార్ట్, 2 ట్రావిస్ హెడ్, 3 స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), 4 మార్నస్ లాబుస్‌చాగ్నే, 5 జోష్ ఇంగ్లిస్ (W), 6 అలెక్స్ కారీ, 7 గ్లెన్ మాక్స్‌వెల్, 8 బెన్ ద్వార్షుయిస్, 9 నాథన్ ఎల్లిస్, 10 ఆడమ్ జాంపాసర్, 11 ఆడమ్ జాంపా
దక్షిణాఫ్రికా : 1 టెంబా బావుమా (కెప్టెన్), 2 ర్యాన్ రికెల్టన్, 3 రాస్సీ వాన్ డెర్ డస్సెన్, 4 ఐడెన్ మార్క్‌రామ్, 5 హెన్రిచ్ క్లాసెన్ (W), 6 డేవిడ్ మిల్లర్, 7 వియాన్ ముల్డర్, 8 మార్కో జాన్‌సెన్, 9 కేశవ్ కగిడి10, కేశవ్, 11