BigTV English

Local boy Nani: పోలీసుల చేతికి లోకల్ బాయ్ నాని… ఎన్ని రోజులు రిమాండ్ అంటే?

Local boy Nani: పోలీసుల చేతికి లోకల్ బాయ్ నాని… ఎన్ని రోజులు రిమాండ్ అంటే?

Local boy Nani:బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా యూట్యూబర్ కి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో.. ఇతడిని నమ్మి మోసపోయిన బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి..విశాఖ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 111(2) చీటింగ్, 112(1)పెట్టీ కేసు , 318(4)ఎలక్ట్రానిక్ పోర్జరీ , 319(2) పర్సనల్ చీటింగ్ 46 రెడ్ విత్ 61-2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66 C, 66D , Ap గేమింగ్ యాక్ట్ 1974 లోని సెక్షన్ 3,4 కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 21వ తేదీ యూట్యూబర్ నానిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు.. కోర్టులో హాజరు పరచగా.. దాదాపు 7 రోజులపాటు రిమాండ్ విధించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా సజ్జనార్ మాటలతో అలర్ట్ అయిన పోలీసులు.. ఇప్పుడు బాధితుడు కంప్లైంట్ ఇవ్వడంతో లోకల్ బాయ్ నానిని అరెస్టు చేశారు.


 

Keerthy Suresh: గోవా పార్టీలో కీర్తి సురేష్ వేసుకున్న డ్రెస్ ప్రైస్ ఎంతో తెలుసా.. అమ్మడి రేంజ్ మామూలుగా లేదుగా..?


యూట్యూబర్ పై సజ్జనార్ ఫైర్..

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టిసి ఎండి సత్యనారాయణ ఫైర్ అవుతూ.. ఇవేం దిక్కుమాలిన పనులు అంటూ యూట్యూబ్ లోకల్ బాయ్ నాని పై మండిపడ్డారు. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీ టాలెంట్ ను ఇతరత్రా రంగాలలో ఉపయోగించుకొని డబ్బు సంపాదించండి. అంతేకానీ ఇలాంటి పనులు చేసి ఇతరుల జీవితాలతో ఆడుకోకండి అంటూ సూచించారు. ముఖ్యంగా బెట్టింగ్ భూతానికి బానిసలు కావడం వల్ల చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి జీవితాన్ని నాశనం చేసే బెట్టింగ్ యాప్ లను ఎందుకు ప్రమోట్ చేయడం అంటూ ఆయన ప్రశ్నించారు. అంతేకాదు సమాజ శ్రేయస్సు కోసం ఈ ప్రమోషన్లను ఆపండి అంటూ కూడా పలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి సూచించారు.

చదువుకున్న వారివల్లే ఇలా అయ్యాను..

అయితే దీనిపై స్పందించిన లోకల్ బాయ్ నాని.. సజ్జనార్ సార్ నా బెట్టింగ్ వీడియో మీద స్పందించడం తో ఈ విషయం వైరల్ గా మారింది. కానీ నేను ఎప్పుడో ఈ బెట్టింగ్ మానేశాను. వీడియో పాతదైనా నేను చేసింది తప్పే కదా.. కాబట్టి ఆ తప్పుని నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను చదువుకోలేదు. కానీ చదువుకున్న వారే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళని చూసే నేను నిజం అనుకొని కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాను. ఆ తర్వాతే అది ఫేక్ అని తెలుసుకొని దూరమయ్యాను అంటూ వేడుకొన్నారు. అయినా సరే ఇప్పుడు ఆయనను పోలీసులు వదలడం లేదని తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×