OTT Movie : అడ్వెంచర్ మూవీస్ ఇచ్చే థ్రిల్ ఒక రేంజ్ లో ఉంటుంది. చిన్న పిల్లలతో సహా ఈ సినిమాలను చూసి బాగా ఎంటర్టైన్ అవుతారు. మూవీ మొదటి నుంచి చివరి దాకా ట్విస్టులు ఎక్కువగా ఉండే, ఒక అడ్వెంచర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది బోన్ స్నాచర్‘ (The bone snatcher). ఈ అడ్వెంచర్ మూవీకి జాసన్ వోల్ఫ్‌సోన్ దర్శకత్వం వహించారు. ఈ భయంకరమైన సినిమాలో స్కాట్ బెయిర్‌స్టో, రాచెల్ షెల్లీ, అడ్రియెన్ పియర్స్ నటించారు. వజ్రాల మైనింగ్ కోసం జరిపే యాత్రలో, ఒక వింత ఆకారం చేతిలో మనుషులు చనిపోతూ ఉంటారు. ఆ రహస్యం వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకుంటాడు హీరో. ట్విస్ట్ లతో సాగిపోయే ఈ అడ్వెంచర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఆఫ్రికాలో ఒక మైనింగ్ కంపెనీ, ఎడారి ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక ప్రాంతానికి రీసెర్చ్ చేయడానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులను, ఒక వింత ఆకారం అయిన క్రియేచర్ భయంకరంగా చంపేస్తుంది. మరోవైపు ఇదే కంపెనీకి చెందిన హీరో ఒక పెద్ద ప్రాబ్లంని సేవ్ చేస్తాడు. అందుకుగాను అతన్ని డైమండ్ గనిని వెతికే ప్రాంతానికి రప్పిస్తారు. రీసెర్చ్ చేయడానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు రాకపోవడంతో, వాళ్ళని వెతుక్కుంటూ హీరో బృందం వెళుతుంది. కొద్దిరోజులు ప్రయాణించాక వాళ్ళు శవాలుగా కనిపించి ఉండటం చూస్తారు. బాడీ మొత్తం ఆస్తిపంజరాలుగా మారిపోయి ఉంటాయి. వీళ్ళు ఎలా చనిపోయారో తెలుసుకోవాలనుకుంటారు అక్కడికి వచ్చిన ఈ బృందం. ఆ ప్రాంతంలో ఒకప్పుడు ట్రైబల్స్ నివసించిన గుర్తులు ఉంటాయి. అయితే ఒక క్రియేచర్ వాళ్ళ వెంటపడుతుంది. గన్ తో షూట్ చేశాక మళ్లీ ముక్కలైపోతూ, మళ్లీ తనంతకుతాను ప్రాణం పోసుకుంటుంది.
ఇలా జరుగుతున్న క్రమంలో హీరో దిమ్మతిరిగే కొన్ని విషయాలను గ్రహిస్తాడు. ఆ క్రియేచర్ చీమల రూపంలో వస్తుందని తెలుసుకుంటాడు. చీమలు ఒక ఆకారంగా మారి, భయపెట్టి మనిషిని చంపి తింటుంటాయి. ఈ విషయం తెలుసుకున్న హీరో, రాణి చీమను చంపాలనుకుంటాడు. ఎందుకంటే రాణి చీమను చంపితే, ఈ సమస్యకు పుల్ స్టాప్ పడుతుందని అనుకుంటాడు. చివరికి హీరో ఈ సమస్యను పరిష్కరిస్తాడా? నిజానికి అక్కడ ఉన్నది చీమల ఆకారమేనా? ఇంకెంత మంది ప్రాణాలు ఆ ప్రాంతంలో బలవుతాయి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది బోన్ స్నాచర్’ (The bone snatcher) అనే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.