Satyabhama Today Episode January 26th: నిన్నటి ఎపిసోడ్ లో… క్రిష్ ను తీసుకొని బయటకు వెళ్లడానికి రెడీ అవుతారు. క్రిష్ మాత్రం చాలా స్లోగా కార్ డ్రైవ్ చేస్తూ సరదాగా ఉంటాడు. సత్య నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంత సరదాగా ఎలా ఉన్నావు అని అంటుంది. దానికి క్రిష్ ఆ ఫోన్ చేసింది నేనే అలా చేస్తే నువ్వు బయటికి వచ్చి నీ ప్రచారం చేసుకోవచ్చు కదా అని చేశానని అంటాడు. మా అమ్మ నిన్ను బ్లాక్ చేసింది నాటకం ఆడి ప్రచారంకి పోనివ్వకుండా అక్కడే ఉంటే ప్రచారం ఎవరు చేస్తారని జరంత సాయం చేశాను నాకు అన్యాయం చేయడం నచ్చదు అని క్రిష్ అంటాడు. సత్యానందిని ఇద్దరు బయట ప్రచారం చేయడానికి మొదలు పెడతారు. ముందుగా ఒక జామకాయల వ్యక్తిని ఓటు వెయ్యమని అడుగుతారు. చదువుకున్న దానిలాగా ఉన్నావ్ నీకెందుకు అమ్మ ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఒక చెత్త లాంటివి వీటిని అలానే వదిలేయాలి లేకుంటే మాత్రం మనల్ని పట్టుకుని పీడిస్తాయని ఆయన ఉచిత సలహాలు ఇస్తాడు. బస్టాప్ లో ఉన్న ఆడపిల్లలు నేర్పించడానికి ఇద్దరు రౌడీలు వస్తారు. వాళ్ళని ఏడిపిస్తుంటే సత్య ఊరుకోకుండా వాళ్ళని కొట్టడానికి వెళుతుంది. రౌడీలని చితకొట్టి ఆడపిల్లలను ఏడ్పిస్తే అసలు ఊరుకోను అన్యాయం జరిగిందంటే నేను ఎంతకైనా తెగిస్తానని చెప్పి చెప్పు తీసుకొని కొడుతుంది. సత్య కొడుతున్న వీడియోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది అది చూసిన వాళ్ళందరూ ఇలాంటి అమ్మాయి ఎమ్మెల్యే అయితే మన ఊరికి మంచి జరుగుతుంది అమ్మాయిలకు న్యాయం జరుగుతుందని అందరూ అనుకుంటారు.. ప్రతి ఒక్కరూ సత్యకు సపోర్ట్ చేస్తూ ఓటు వేయాలని అనుకుంటారు. ఇక సత్యానందిని ప్రచారాన్ని మళ్లీ మొదలు పెడతారు. విశ్వనాథం ఇంట్లో ఆ వీడియోని చూసి విశ్వనాథం నాన్నమ్మ టెన్షన్ పడుతూ ఉంటారు. హర్ష ఈ విషయాన్ని నందిని కి చెప్తాడు నందిని వెళ్లి సత్యకి చెప్తుంది. సంతోషంగా ఉన్న సమయంలో సంధ్య సంజయ్ బైక్ పై కనిపించడంతో సత్య షాక్అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ప్రోమో విషయానికి వస్తే.. సంజయ్ బండిపై వెళుతున్న సంధ్యని చూస్తుంది సత్య.. కాల్ చేసి అడిగితే కంప్యూటర్ క్లాస్ కి వెళ్లాను ఇప్పుడే ఇంట్లోకి వెళుతున్నా అంటుంది. సంజయ్ బైక్ పై నిన్ను చూశాను అంటే తను లిఫ్ట్ ఇచ్చాడని అబద్ధం చెబుతుంది. తనకి దూరంగా ఉండు అని చెబుతుంది.. పెళ్లికి వచ్చిన ఆడపిల్లవి తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని సత్య అంటుంది. సత్య సంధ్యకేమవుతుందని టెన్షన్ పడుతూ ఇంట్లోకి అడిగి పెట్టడంతో మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు. వరంగల్ లో ఇలాంటి ధైర్యం ఎవరూ చేయలేదు అంటారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారా అంటే.. దీనికి ఎన్నికలకు ముడిపెడతారని నాకు తెలుసు..సమాజంలో సమస్యల పట్ల ఇలాగే రియాక్టవుతాను ..ప్రచారం కోసం కాదు తోటి ఆడపిల్లల పట్ల బాధ్యత అనుకుని చేశానంటుంది. అది మీడియాలో టెలికాస్ట్ అవడంతో అటు క్రిష్ ఫుల్ ఖుషి అవుతాడు.. నా సంపంగి ఎన్నికల్లో గెలిచినట్టే అని సంబరపడిపోతుంటాడు. మీడియా వాళ్లకు సత్య ఇంటర్వ్యూ ఇవ్వడం అటు బైరవి ఇటు మహదేవయ్య రుద్రా చూస్తారు. చూసావా ఎంత పొగరుగా సమాధానం చెప్తుంది అని భైరవికి పంకజం లేనిపోనివి నూరిపోస్తుంది..
ఇక సంధ్య మాత్రం ఇంట్లో వాళ్లకి ఎక్కడ నిజం తెలిసిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కకు ఒకవేళ అనుమానం వస్తే కచ్చితంగా ఇంట్లో చెప్పేస్తుంది ఆ తర్వాత నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వరు. ముఖ్యంగా నన్ను సంజయ్ ని కలుసుకొని ఇవ్వరు.. కనీసం ఫోన్ కూడా మాట్లాడనివ్వరని బాధపడుతూ ఉంటుంది. సత్యను అడ్డుతప్పించాలని మహదేవయ్య నీ చిలకను పోదాం రమ్మని చెప్పు అని సంజయ్ ను ఉసిగోలుపుతాడు. అలాగే బిడ్డని సంజయ్ సంధ్య కు ఫోన్ చేస్తాడు. సత్య ఏమనిందో అని తెలుసుకోవడానికి ఫోన్ చేశానని నువ్వు టెన్షన్ పడకు నీకు నేనున్నానని ధైర్యం చెప్పడానికి ఫోన్ చేస్తానని సంజయ్ సంధ్యతో అంటాడు. నాకు మాత్రం టెన్షన్ గా ఉంది సంజయ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు అక్క వచ్చి ఏదైనా చెప్తే నన్ను ఇంట్లోంచి బయటికి రానివ్వరు నిన్ను కలుసుకొని ఇవ్వరు నీతో మాట్లాడకుండా నేను చూడకుండా నేను ఉండలేను నా ప్రాణం పోయేటట్లు ఉందని సంధ్య బారీ డైలాగులు కొడుతుంది. ఇక మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి నేనే ఇదంతా చేయించాను నీ చెల్లిని కాపాడుకుంటావో ఎలక్షన్లలో నిలబడతావో అది నీ ఇష్టం అని బెదిరిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో క్రిష్ నేరుగా రంగంలోకి దిగుతాడా లేదా సంధ్యను సంజయ్ నుంచి కాపాడుతాడా చూడాలి..