BigTV English
Advertisement

YCP’s Future: వైసీపీ చాప్టర్ క్లోజ్.. సాయి రెడ్డి బాటలో వైసీపీ కీలక నేతలు

YCP’s Future: వైసీపీ చాప్టర్ క్లోజ్.. సాయి రెడ్డి బాటలో వైసీపీ కీలక నేతలు

YCP’s Future: ఇటు అసెంబ్లీ అటు లోక్ సభలో దాదాపు ఖాళీ అయిన ఫ్యాను పార్టీకి రాజ్యసభ కూడా ఏమంత కలసి రావడం లేదా? విజయసాయితో పాటు మరో రాజ్యసభ్యుడు కూడా బైబై చెప్పనున్నారా? సాయి బాటలో పయనించే ఆ ఇతర లీడర్లెవరు? వారి తాలూకూ రియాక్షన్లు ఎలా ఉన్నాయి?


రాజ్యసభలోనూ అద్వానంగా ఫ్యాను పార్టీ సీన్ఒకప్పుడు మన ఇండియన్ క్రిక్రెట్ టీమ్ కో వీక్నెస్ ఉండేది. ఒక్క వికెట్ గానీ పడితే.. మొత్తం ప్లేయర్లూ పెవిలియన్ బాట పట్టేవారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందిగా అన్న మాట అటుంచితే.. వైసీపీ లో ప్రెజంట్ సీన్ సరిగ్గా అలాగే ఉందన్న మాట వినిపిస్తోంది.

ప్రెజంట్ విజయసాయిరెడ్డి కేవలం పార్టీకే కాకుండా ఏకంగా రాజకీయాలకే ఎలా ఎండ్ కార్డ్ వేస్తున్నారో.. సరిగ్గా అలాగే అయోధ్య రామిరెడ్డి సైతం ఇదే బాట పట్టనున్నట్టు సమాచారం. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న రామిరెడ్డి.. స్వదేశానికి తిరిగి రాగానే.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. అయితే తన రాజీనామా వార్తలను అయోధ్య రామిరెడ్డి ఖండిస్తున్నట్టు సమాచారం.


అయితే విజయసాయి రెడ్డి వంటి హేమా హేమీలే ఇలా పార్టీని వీడుతుండటంతో.. వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందట. ఇదే బాటలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు కూడా పక్క చూపులు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణమాలపై బాబురావు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. దీంతో బాబూరావు పార్టీ వీడతారని విశాఖ జిల్లాకు చెందిన నాయకులు చర్చించికుంటున్నారట. అయితే తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఈయన కూడా ఖండిస్తున్నట్టు సమాచారం.

ఇక ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా పార్టీ వీడే చాన్స్‌ ఉందన్న చర్చ నడుస్తోందట. ఓ ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ గుడ్ బై చేప్పే అవకాశం ఉందని జిల్లా జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయట. విజయవాడకు చెందిన మాజీ మంత్రి కూడా బీజేపీ వైపు చూస్తున్నారని వినికిడి. ఆ మాజీ మంత్రి గతంలో బీజేపీలో పని చేశారు. కొంత కాలంగా పార్టీ కార్యాక్రమాల్లో ఆయనేమంత యాక్టీవ్‌గా లేరనే టాక్ నడుస్తోంది.

Also Read: కూటమిని విడగొట్టేందుకు వీఎస్ఆర్ కొత్త స్కెచ్

కోడాలి నాని కూడా రాజకీయలకు దూరంగా ఉండబోతున్నారని కొంత కాలం సోషల్ మీడియాలో హాల్‌ చల్ చేస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో కోడాలి గత కొంత కాలంగా యాక్టీవ్‌గా లేకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారిందట. నాని కూడా రాజకీయాలు దూరంగా ఉంటారనే చర్చకు మరింత ఊతమిచ్చేలా.. ఆయన నుంచి ఎలాంటి ఖండనలు రావడంలేదట. మరి కోడాలి నిర్ణయం ఎలా ఉండబోతుందనేది చర్చనీయంశంగా మారిందట.

గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్‌ రెడ్డి కూడా పార్టీ వీడబోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. టీడీపీలో చేరేందుకు మర్రి సైతం రంగం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై బీజేపీ ఎక్కు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోందట.. రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ సీనియర్ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్న మరో కథనం కూడా ప్రచారంలో ఉంది.

ఫ్యాను అధికార చక్రం తిప్పడం ఆగి కేవలం ఏడాది కూడా కాలేదు. ఈ మాత్రం కాలానికే.. వైసీపీ నుంచి అగ్రనేతలంతా రాజీనామాల బాట పడుతుండటంతో.. సగటు కార్యకర్తకు ఏం చేయాలో అర్ధం కావడం లేదట. ఇప్పటికే మోపిదేవి, బీదా మస్తాన్ రావులతో పాటు ఆర్ కృష్ణయ్య సైతం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. రాజ్యసభలోనూ ఫ్యాను పార్టీ పరిస్తితి అద్వానంగా మారినట్టు తెలుస్తోంది. మరి పార్టీ భవితవ్యమేంటో తేలాల్సి ఉందంటున్నారు మిగిలి ఉన్న ఫ్యాను పార్టీ లీడర్లు. ఏది ఏమైనా ఫ్యాను రెక్కలన్నీ ముక్కలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట వీరందరూ.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Big Stories

×