BigTV English

Satyabhama Today Episode : సత్యకు మహాదేవయ్య వార్నింగ్.. షాకిచ్చిన విశాలాక్షి..

Satyabhama Today Episode : సత్యకు మహాదేవయ్య వార్నింగ్.. షాకిచ్చిన విశాలాక్షి..

Satyabhama Today Episode January 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యకు కౌంటర్ ఇచ్చేలా మహదేవయ్య తన మనిషిని పిలిచి నామినేషన్ కి టైం అయింది ఎలా చేయాలో చెప్పు అంటాడు. అతను చెప్పగానే సత్యకు కౌంటర్ వేస్తాడు.. దానికి సత్య నాకు అంత ఆడంబరాలు అవసరం లేదు అని అంటుంది.. నీకోసం పదిమంది ఎవరు వస్తారో నేను చూస్తాను. ఆ మాత్రం తెలియకుండానే నామినేషన్స్ లో నిలబడ్డావా అనేసి మహాదేవయ్యా సత్యకు కౌంటర్ లేస్తాడు. సత్య మాత్రం పది మందిని తెచ్చుకోలేనా అనేసి ధీమా గా ఉంటుంది.. ఇక క్రిష్ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని అడుగుతుంది. నామినేషన్ వేయాలంటే పదిమంది కావాలా అనేసి అంటుంది. ఇక క్రిష్ దగ్గరకు వచ్చి అడుగుతుంది. అధికారంలో ఉండే పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళు కేవలం ఆ పార్టీ ఇన్చార్జ్ సంతకం పెడితే సరిపోతుంది. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళు ఆయన వెనకాల ఒక 10 15 మంది ఉండాలి ఎందుకంటే ఒక పదిమంది కూడా లేనివాడు ఎలక్షన్స్ లో ఎలా నిలబడతాడని అందరూ అంటారు. అప్పుడే నామినేషన్స్ ని తీసుకుంటారు. లేదంటే మాత్రం నామినేషన్స్ ని రిజెక్ట్ చేస్తారని క్రిష్ చెప్తాడు మరి నీ తరఫున పదిమంది ఎవరు అనగానే నా భర్త అనేసి అంటుంది. దానికి క్రిష్ మాత్రం చాన్సే లేదు అనేసి అంటాడు.. ఇక నందిని తన బాపుని నీలదీస్తుంది.. నా అత్తింటి వాళ్ళు ఏడ్పిస్తే ఊరుకోను అంటుంది.. ఇక సత్యకు సపోర్ట్ చేస్తానని వెళ్ళిపోతుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నందిని సపోర్ట్ చేస్తుంది అన్న విషయం తెలుసుకున్న సత్య సంబరపడిపోతుంది. నీ వెళ్ళగానే సత్య దగ్గరికి మహదేవయ్య వచ్చి ఒకరు సపోర్ట్ చేస్తారని సంబరపడిపోకు నీకు ఇంకా తొమ్మిది మంది కావాలి అది గుర్తుపెట్టుకో కోడలా అని కౌంటర్ ఇస్తాడు. దానికి సత్య హిరణ్యకశిపుడు అనే కథ చెప్తుంది. హిరణ్యకశిపుడు దేవుని నాకు చావు ఉండకూడదని కోరుకున్నాడు కానీ నరసింహ అవతారంలోని దేవుడు అతని చంపేశాడు అనగానే ఇద్దరు కాసేపు గొడవ పెట్టుకుంటారు. అది చూద్దాం నువ్వు ఎలక్షన్స్ లో ఎలా నిలబడతావని మహదేవయ్యా చాలెంజ్ చేస్తాడు. ఇకనందిని కోసం హర్ష వాళ్ళ ఫ్యామిలీ ఎదురు చూస్తుంటారు. ఎక్కడికి కెళ్ళావని అడుగుతారు. మా పుట్టింటికి వెళ్ళొచ్చానని నందిని అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పేస ఎల్లుండొచ్చు కదా ఇంత టెన్షన్ పడే వాళ్ళు కాదు కదా అని విశాలాక్షి అంటుంది.

మా బాపుతో గొడవ పెట్టుకోవాలని వెళ్ళాను అత్తమ్మ అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను అని అంటుంది.. మీ బాపుతో గొడవ పెట్టుకున్నావా ఏమైంది ఎందుకు అనేసి హర్ష అడుగుతాడు.. మన కష్టాలు తీర్చినట్టుంది తీర్చినట్టే తీర్చి మనకి అన్యాయం చేస్తుంది మాత్రం మా బాపునే ఆ విషయం తెలుసుకొని ఉండబట్ట లేక వెళ్లి అడిగి దులిపేసి వచ్చాను అని నందిని అంటుంది.. నందిని వల్ల రెండు కుటుంబాలు ఎక్కడ విడిపోతాయో సంజయ్ ఎక్కడ దూరమైపోతానని సంధ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. వల్ల ఈ దూరము ఇంకాస్త పెరిగేలా ఉంది ఈమె వెళ్లి అక్కకి సపోర్ట్ చేస్తానంది ఇక మీ ఇద్దరికీ దూరం పెరుగుతుందేమోనని భయపడుతుంది. నందిని నేను వదినకి సపోర్ట్ చేస్తానని తెగేసి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక సంధ్య వాళ్ళ నాన్నతో వాదన పెట్టుకుంటుంది. నువ్వన్న చెప్పకుండా అంటే ఇటు వదినా అటు అక్క ఇద్దరు కలిసి మన రెండు కుటుంబాల మధ్య దూరాన్ని పెంచేలా ఉన్నారని హింట్ ఇస్తుంది. అటు సత్య, క్రిష్ లు ఇద్దరు సరదాగా గడుపుతారు. బెడ్ రూమ్ లో రొమాన్స్ అన్న విషయాన్ని మర్చిపోవద్దని సత్యా గుర్తు చేస్తుంది. ఇక తొమ్మిది మంది కోసం వెళ్తానని సత్య అంటుంది.


విశాలాక్షి సత్యను మహదేవయ్య కాల్చి చంపేసినట్టు కలగంటుంది. ఓకే నువ్వు ఎలాగైనా కాపాడాలని ఇంట్లో వాళ్ళ అందరితో కంగారు పడుతూ చెప్తుంది. నందిని మాత్రం అందుకు ససేమిరా అంటుంది. మా బాపుని కంట్రోల్ చేయాల్సింది వదిన ఒక్కటే ఆ ధైర్యం వదినకు మాత్రమే ఉంది అందుకే నేను వదినని సపోర్ట్ చేస్తున్నాను ఇక మీ ఇష్టం అనేసి అందరికీ చెప్పి వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో సత్య తన పుట్టింటికి వస్తుంది. సంతకం పెట్టడానికి రెడీగా లేమని చెప్తారు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×