Satyabhama Today Episode January 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యను ఎలాగైన ఆపాలని మహాదేవయ్య ప్లాన్ వేస్తాడు. క్రిష్ ను పూర్తిగా తన సెంటిమెంట్ తో లాక్ చేస్తాడు. అటు విశాలాక్షి భయంతో ఇంట్లో అందరిని కంట్రోల్ చేస్తుంది. సత్యకు సపోర్ట్ చెయ్యొద్దని అందరి దగ్గర మాట తీసుకుంటుంది. మనం సపోర్ట్ చెయ్యకుండా ఉంటేనే సత్య వెనక్కి తగ్గుకుండా ఉంటే సత్య మాట వింటుందని అంటుంది. ఇక దానికి నందిని నన్ను క్షమించండి అంటుంది. మా బాపుని కంట్రోల్ చేయాల్సింది వదిన ఒక్కటే ఆ ధైర్యం వదినకు మాత్రమే ఉంది అందుకే నేను వదినని సపోర్ట్ చేస్తున్నాను ఇక మీ ఇష్టం అనేసి అందరికీ చెప్పి వెళ్తుంది.. ఇక సత్యా ఉదయం లేవగానే మహదేవయ్య కాళ్ళు మొక్కి బయటకు రావడానికి వస్తుంది. ఎక్కడికి పోతున్నావ్ ఇంత పొద్దున్నే తయారైపోతున్నావని భైరవి అడిగితే నవగ్రహాల కోసం అనేసి మహాదేవయ్య అంటాడు. నవగ్రహాల అదేంటి అని అంటే 9 మంది నామినేషన్ చేయడానికి సంతకాలు పెట్టాలి కదా అందుకే వెళ్తుందని తన అనుచరులతో కలిసి మహదేవయ్య పరాచకాలు ఆడుతాడు. ఆ ప్రయత్నంలో లేవు నేను చేసుకుంటానులే మామయ్య అనేసి సత్య అంటుంది అంతలోపే క్రిష్ వచ్చి తన మనిషిని కొడతాడు పనోళ్ళ ముందు నా భార్యను తక్కువ చేసి మాట్లాడద్దు బాపు మన ఇంట్లో వాళ్ల గౌరవం మనమే తీస్తున్నామనేసి క్రిష్ అంటాడు. సత్య పుట్టింటికి రాగానే అందరు మౌనంగా ఉంటారు. సత్యకు సపోర్ట్ చెయ్యడానికి ఇంట్లో ఎవరు ముందుకు రారు. దాంతో సత్యకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. నామినేషన్ ఫామ్ లో సంతకాల కోసం పుట్టింటికి వచ్చిన సత్యకు చుక్కెదురు అవుతుంది. మీ అత్తింటి వాళ్ళ సపోర్ట్ లేకుండా నువ్వు ఇలా మొండిగా ఉండటం బాగోలేదని చెబుతారు. ఇక విశాలాక్షితో సహా ఇంట్లో వాళ్ళందరూ సత్యకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ముందు నీ భర్తని నీ మామని నీ దారికి తెచ్చుకో ఆ తర్వాత మేము నీ దారికొస్తామని విషయాలు అంటుంది. విశ్వనాథం కూడా భార్య మాటను కాదనలేక పోతాడు. అటు హర్ష కూడా చెల్లెలుకు సపోర్ట్ చేయడానికి ముందుకు రాడు. నందిని మాత్రం నా సపోర్ట్ నీకే వదినా ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. ఇంట్లో ఎవరు ముందుకు రాకపోవడంతో నిరాశపడుతుంది.
ఎప్పుడూ నాకు ఏ కష్టం వచ్చినా నా పుట్టింటి వాళ్ళు ఉన్నారని ధైర్యంతో నేను ముందుకు సాగేదాన్ని కానీ ఇప్పుడు నా పుట్టింటి వాళ్ళు నన్ను వదిలేసారని బాధపడలో లేకపోతే ఆనందపడాలో అర్థం కావట్లేదు అని సత్య బాధపడుతుంది. సరే అమ్మ మీరందరూ నన్ను ఆశీర్వదించండి నేను విజయం సాధించాలని నన్ను దీవించండి అని సత్య అడుగుతుంది. సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 9 మందిని ఎలా తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక ఇంటికి వెళ్లిన సత్యకు మహాదేవయ్య చురకలంటిస్తాడు. ఏంటి కోడలా 9 మంది రాలేదా నా పుట్టింటి వాళ్లను తీసుకొని వస్తాను నామినేషన్స్ ఏస్తానని ధీమాగా వెళ్ళావుగా మరి ఇప్పుడేమైంది. అయ్యో నిన్ను చూస్తుంటే జాలేస్తుంది కోడలా కన్నీళ్లే మిగిలాయి కదా అనేసి మహదేవయ్య అంటాడు.. ఇంకా నేను ఓడిపోలేదు మామయ్య కానీ మావయ్య అనేసి సత్య కూడా తగ్గకుండా మహదేవయ్యకు ఛాలెంజ్ చేస్తుంది. నీ పుట్టినరోజు ఉత్తి పిరికోళ్లే.. నువ్వేం చెప్పినా వినేస్థితిలో వాళ్ళు లేరు మొత్తం మహదేవయ్యా గుప్పెట్లో ఉన్నారని మహదేవయ్యా రెచ్చిపోతాడు.. నువ్వు ఇకమీదటైనా మహదేవయ్యతో పెట్టుకోవాలంటే ఆలోచించు ఈ ఎలక్షన్స్ కలెక్షన్స్ నీకు అవసరం లేదు పోయి వంటలు చేసుకో పో అనేసి అంటాడు. దానికి సత్య గరిట తిప్పిన చేత్తోనే రాజకీయాల తిప్పలేని అనుకుంటున్నావా మావయ్య నేనేంటో చూపిస్తాను 9 మంది కాదు ఈ జనం నా వెనకాల నిలబడి నిన్ను ఓడించేలా చేస్తానని మరోసారి ఛాలెంజ్ చేస్తుంది.
సత్యను ఎన్నిసార్లు బెదిరించినా తగ్గడం లేదని మహదేవయ్య మనసులో అనుకుంటాడు. ఇక సత్య మావయ్యతో ఛాలెంజ్ అయితే చేశాను కానీ 9 మందిని ఎలా తీసుకురావాలి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తే బాగుండు అని మనసులో అనుకుంటుంది. ఇక అటు క్రిష్ తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. వదినకు నువ్వు సపోర్ట్ చెయ్యకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు మీ బాబు అంటేనే ఇష్టం కాకపోతే వదినా నిన్నే నమ్ముకుంది నువ్వు వదినని కూడా జాగ్రత్తగా చూసుకోవాలనేసి అంటాడు. ఇక క్రిష్ బొమ్మ బొరుసు ఆడతాడు సత్యకు సపోర్ట్ చేయాలంటే ఈ కాయిన్ నిర్ణయిస్తుందని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సత్యకు అండగా క్రిష్ నిలబడతాడని తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…