Satyabhama Today Episode January 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహదేవయ్య ఎన్నిసార్లు బెదిరించినా బెదరకుండా సత్య ముందడుగు వేస్తుంది. నువ్వు నామినేషన్స్ నుంచి తప్పుకోవాలంటే నువ్వు ప్రజలకు మేలు చేయాలి అలాగే నీ ప్రవర్తన మార్చుకోవాలని సత్య ఆఫర్ ఇస్తుంది కానీ మహదేవయ్య ఆ ఆఫర్ ను తిరస్కరిస్తాడు. ముందు ముందు నీకు ఇంకా కొన్ని ఎదురవుతాయి కోడలా అని వార్నింగ్ ఇస్తాడు. ఇక సత్యా బెడ్రూంలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. సత్య తనని హేళన చేస్తాడని ఏమి మాట్లాడుకున్నా ఉంటుంది. కానీ క్రిష్ మాత్రం సత్యను అడుగుతాడు. మా ఇంట్లో వాళ్ళు ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదని సత్య అనగానే క్రిష్ బాధపడతాడు. రుద్రను బెయిల్ పై రిలీజ్ చేయిస్తాడు మహాదేవయ్య.. రేణుక క్రిష్ సత్యాలు టెన్షన్ పడుతూ ఉంటారు. రుద్ర ఏం చేస్తాడని టెన్షన్ పడుతూ ఉంటుంది రేణుక. నందిని సత్య కోసం ఇంటికి వస్తుంది. రుద్రను చూసి సెటైర్లు వేస్తుంది. ఇక సత్యతో కలిసి వెళ్తుంది. ఎవరిని నామినేషన్స్కోసం సంతకం పెట్టరు. సత్య షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నందిని,సత్యలు నామినేషన్ పత్రం పై సంతకం పెట్టించాలని ఊరంతా తిరుగుతారు. కానీ ఒక్కరు కూడా సంతకం చేయడానికి ముందుకు రారు మహదేవయ్య గురించి తెలిసి మేము ముందుకు రాము మా ప్రాణాలు మాకు ముఖ్యం అనేసి అంటారు. ఇక దాంతో నిరాశగా వెను తిరుగుతారు నందిని సత్య. వాళ్ళని చూసి నరసింహ అక్కడికి వస్తాడు. నీ మామ కి నువ్వు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నావంటే నువ్వు నాకు మిత్రువనే శత్రువు శత్రువు కలిస్తే మిత్రులే అవుతారు నీకు నేను సపోర్ట్ చేస్తాను పదిమంది కాదు వంద మందిని నీకు తీసుకొస్తాను. నాతో చేతులు కలుపుకొని నరసింహ బంపర్ ఆఫర్ ఇస్తాడు. కానీ దానికి సత్యం మాత్రం అస్సలు ఒప్పుకోదు. నరసింహ కు షాక్ ఇస్తుంది. సిద్ధాంతాలకు మాత్రమే నేను మా మామయ్య వ్యతిరేకం కానీ మా మామయ్య మీద నాకు ఎటువంటి కక్ష లేదు. నువ్వు మా ఇద్దరి మధ్య చీలికలు ఏర్పాటు చేయాలని అనుకోకు అనేసి గట్టి షాక్ ఇస్తుంది.. ఇక నరసింహ ఏం మాట్లాడుకున్నా ఉంటాడు. మార్చుకుంటే మళ్లీ నాకు చెప్పు నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తాను అని సత్యతో అంటాడు.
నరసింహతో సత్య మాట్లాడిన మాటలు విని క్రిష్ ఫిదా అయిపోతాడు..
నందిని సత్య ఇద్దరూ వస్తుంటే క్రిష్ ఎదురుగా వస్తాడు. సత్య అన్న మాటలు విని సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇక నందిని నేను వెళ్తాను అని చెబుతుంది. ఇక క్రిష్ సత్యా ఇంటికి వెళ్తారు. ఇద్దరం కలిసి లోపలికి వెళ్దామంటే సత్య వచ్చి వద్దు మీరు వెళ్ళండి అనేసి అంటుంది. ఇప్పటికే నావల్ల మీరు చాలా బాధలు పడుతున్నారు అనేసి బాధపడుతుంది. మనిద్దరం ఎక్కడ దూరం అవుతాము అని నాకు బాధగా ఉంది అని క్రిష్ అనగానే సత్య దూరమవుతావని నువ్వు అనుకుంటున్నావా అనేసి అంటుంది. నువ్వేమనుకుంటున్నావు అని క్రిష్ అనగానే మనం ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలెత్తినా మనిద్దరి మీ భార్య భర్తలు గా రావాలని కోరుకుంటున్నాను అని సత్య అంటుంది.. ఇక మహదేవయ్యా రుద్ర నామినేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
నామినేషన్ పనుల గురించి క్రిష్ కి చెప్పాను. వాడు చేయకుంటే ఆ పని నువ్వే చూసుకోవాలి అని అనగానే అవసరం లేదు బాపు నేను ఆల్రెడీ చూసుకున్నాను అని అంటాడు.. ఇక సత్య అప్పుడే ఎంట్రీ ఇస్తుంది.. రుద్ర ఎమ్మెల్యే వచ్చింది చాయ్ తీసుకురా అనేసి అంటాడు. భైరవి ఎవరా అని పరిగెత్తుకుంటూ వస్తుంది. సత్యని చూసి ఓ ఇదా అనేసి అనుకుంటుంది. ఎమ్మెల్యే కాదమ్మా అని అనగానే అందరూ నవ్వుతారు. 9 మంది కాదు 90 మందిని తీసుకొస్తానని నీ ఆడబిడ్డ నేను తీసుకెళ్లింది వచ్చారా 90 మంది అనేసి చురకలేస్తుంది భైరవి.. నందిని తప్ప ఇంకొకరు దీనికి సపోర్ట్ చేస్తే నాకు చెప్పుతో నేను కొట్టుకుంటాను అనేసి అంటుంది. ఇక జయమ్మ చెప్పును తీసుకొచ్చి కొట్టుకో నేను సత్యకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను అనేసి అంటుంది.. సిద్ధాంతాలు నాకు నచ్చాయి ఎవరు కాదంటారు. ఎవరు ఒప్పుకోరు నేను చూస్తాను నేను సత్య కే సపోర్ట్ చేస్తానని జయమ్మ మొండిగా చెప్తుంది.. ఇక మహదేవయ్యా మా అమ్మ ఇస్తాను ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు అని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సత్యకు సపోర్టుగా వృద్ధాశ్రమంలోని వృద్ధులు వస్తారు. మరి వాళ్ళని మహదేవయ్య ఏమైనా చేస్తారేమో రేపటి ఎపిసోడ్లో చూడాలి..