V Narayanan ISRO Chief | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇండియాన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (ఇస్రో) కొత్త చైర్మెన్ గా వి నారాయణన్ ని నియమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన జనవరి 14, 2025 నుంచి తన కొత్త పదవి బాధ్యతలు చేపట్టనన్నారు. ఈ మేరకు మంగళవారం జనవరి 7, 2025న నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. కేంద్ర కేబినెట్ నియామక కమిటీ.. ఇస్రోలో లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పిఎస్‌సి) విభాగం డైరెక్టర్ అయిన వి నారాయణన్ ని ఇస్రో చైర్మెన్ గా నియమించబడ్డారు. ఆయన పదవి కాలం రెండేళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుత చైర్మెన్ సోమనాథన్ పదవీకాలం జనవరి 13, 2025న పూర్తి కానుంది.
వి నారాయణణ్ ఇస్రోలో ప్రస్తుతం సోమనాథన తరువాత సీనియర్ మోస్ట్ డైరెక్టర్ ఆయన అంతరిక్ష పరికరాల విభాగం శాస్త్రవేత్త. అంతరిక్షంలోకి శాటిలైట్లను తీసుకెళ్లడానికి ప్రయగించే లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ లో ఆయన డైరెక్టర్ గా ఉంటూ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, వాటిలో ఉపయోగించే కెమికల్స్, ఎలెక్ట్రిక్ ప్రపల్సన్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్. లిక్విడ్, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్ ప్రపల్సన్ స్టేజీలలో (వివిధ దశలలో) వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు.
Also Read: ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..
దీంతో పాటు ఆయన మరో రెండు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కౌన్సిల్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ (పిఎంసి – ఎస్‌టిఎస్) చైర్మెన్ గా, చంద్రుడిపై మనిషిని తీసుకెళ్లే స్పేస్ ఫ్లైట్ మిషన్ అయిన నేషనల్ లెవల్ హ్యూమన్ రేటెడ్ సర్టిఫైడ్ బోర్డ్ (హెచ్‌ఆర్ సిబి) ఫర్ గగన్‌యానా్ చైర్మెన్ గా ఉన్నారు.
తమిళ మీడియం స్కూళ్లలో చదువుకున్న వి నారాయణణ్.. క్రయోజెనిక్ ఇంజినీరింగ్ లో ఎం టెక్ పూర్తి చేశారు. ఐఐటి ఖరగ్‌పూర్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో పిహెచ్ డి కూడా పూర్తి చేశారు. ఐఐటి ఖరగ్ పూర్ లో ఎంటెక్ లో ఆయనకు ఫస్ట ర్యాంక్ సాధించినందుకు సిల్వర్ మెడల్ ప్రదానం చేశారు. రాకెట్, అంతరిక్ష విమానం లాంచింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన నారాయణన్ ఆ తరువాత 1984లో ఇస్రోలో చేరారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఇస్రోలో ఎదుగుతూ 2018లో లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ లో 2018లో డైరెక్టర్ గా నియమితులయ్యారు.
ప్రస్తుతం ఇస్రో చేర్మెన్ గా ఉన్న ఎస్ సోమనాథన్ జనవరి 2022లో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలోనే భారతదేశం తొలిసారి చంద్రుడి దక్షిణ ధ్రవంపై ఒక రోవర్ ని విజయవంతంగా దింపింది. ప్రపంచంలో అంతకుముందు చంద్రుడిపై రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశాలుగా అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. ఇండియా ప్రస్తుతం ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.