Satyabhama Today Episode March 5th : నిన్నటి ఎపిసోడ్లో.. క్రిష్ సత్య ఎంతగా డైవర్ట్ చేయాలని చూసినా కూడా తన మనసంతా బాపు దగ్గరే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. సత్య కృష్ణ తన దారిలోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా క్రిష్ మాత్రం తన బాపు గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే సత్యం వదిలేసి తన బాబుని ఒక్కసారైనా చూడాలని ఆ ఇంటికి వెళ్తాడు. మహదేవయ్య, భైరవిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు క్రిష్ అయితే క్రిష్ రావడం చూసిన సంజయ్ దొంగ దొంగ అని అరుస్తాడు. అతని మహదేవ మనుషులు పట్టుకుంటారు నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు రా అంటే నేను బాబును చూడాలని వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంటే బాపును చూడాలని వచ్చావో ఇంకా ఏదైనా తీసుకెళ్లాలని వచ్చావు అని భైరవి అంటుంది. కృష్ణ అందరూ తల ఒక మాట అనేసి ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు అప్పుడే సత్య వచ్చి మీకు ఏం అధికారం ఉందని గెంటేశారు మీకోసం ఎన్ని రోజులు కుక్కలాగా తను పనిచేసినందుకు మీరు ఇలా సన్మానించారా అని సంజయ్ చెంప పగలగొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య కృష్ణ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. చూసావు కదా క్రిష్ ఎంతగా అవమానించారు అందుకే నిన్ను అక్కడికి వెళ్ళద్దని చెప్పాను అయినా కూడా నా మాటంటే కాస్త కూడా లెక్క చేయకుండా వెళ్లావు మీ అమ్మ ఏమందో విన్నావా? అది వాళ్ళ పరిస్థితి నిన్ను ఇన్ని రోజులు కాపలాగా వాడుకున్నారు ఇప్పుడు నీ అవసరం తీరిపోయింది కాబట్టి నేను ఇంట్లోంచి బయటికి గెంటేశారు అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో నీకే తెలియాలి అని సత్య బాధపడుతుంది. ఇక ఉదయం లేవగానే రేణుక మహదేవయ్యకు కాఫీ ఇస్తుంది. భైరవి రేణుకను ఏదో ఒకటి అంటూ ఉంటుంది.
జయమ్మ బ్యాగు పట్టుకుని బయటకు వస్తుంది. ఏందమ్మా ఎందుకు బ్యాగు పట్టుకుని బయటకు వచ్చావని మహదేవ అడిగితే అప్పుడు భైరవి పైపు మహాదేవయ్య చూస్తాడు. నాకేం సంబంధం లేదు పెనిమిటి నేను మీ అమ్మని ఏం అనలేదు మీ అమ్మే మరి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది అవును అత్తమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావ్ అని అడుగుతుంది.. ఇంట్లో ఉండబుద్ధి కాలేదు నా మనసు విరిగిపోయింది అందుకే నా మనవడి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని జయం అంటుంది. ఆ మనవడికే గతిలేక ఆ తండ్రి ఇంట్లో పడి ఉన్నాడు నువ్వు వెళ్తే నీకు ఎలా పోషిస్తాడు అనుకుంటున్నావు ఒకసారి వెళితే ఇంట్లోకి రావడానికి కుదరదు అది గుర్తుపెట్టుకో అత్తమ్మ అని భైరవి అంటుంది.
ఒకసారి వెళ్ళిపోతే చచ్చిన మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టనని జయమ్మ శపధం చేసి మరి వెళ్ళిపోతుంది. అటు హర్ష మైత్రి బ్లాక్మెయిల్ ని తట్టుకోలేక ఫీలవుతూ ఉంటాడు. నందిని వదిలేసి నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలి లేదంటే మాత్రం మనిద్దరం గడిపిన ఆ క్షణాల్ని అందరి ముందర చూపిస్తాను అని బెదిరిస్తుంది. హర్ష మాత్రం నేను నందినీకి ద్రోహం చేయలేను తను నాతో తాళి కట్టించుకున్న భార్య.. పెళ్లయిన తర్వాత నన్ను ఎంత ప్రేమగా చూసుకుందో నాకు తెలుసు నాకోసం అన్ని వదిలేసుకుంది అలాంటి నందినీకి నేను ద్రోహం చేయనని మైత్రితో అంటాడు మైత్రి షాక్ అవుతుంది.
ఇక సత్యకు చక్రవర్తి ఫోన్ చేస్తాడు. కొడుకు క్రిష్ గురించి అడుగుతాడు. అలాగే ఉన్నాడు మామయ్య మనుషులకి దూరంగా సమాజానికి దూరంగా ఉన్నాడు మీ అబ్బాయి తను ఎలా మారుతాడు అర్థం కావట్లేదని బాధపడుతుంది అది విన్న క్రిష్ సత్య కి ఎలాగైనా గుడ్ న్యూస్ చెప్పాలని నేను మెకానిక్ షాప్ పెట్టాలనుకుంటున్నాను సత్య నేను పూర్తిగా మారిపోయాను నువ్వు ఇప్పుడు హ్యాపీనే కదా అని భార్యను సంతోషంగా ఉంచడానికి కృషి తన మనసును చంపుకుంటాడు. ఇప్పుడే జయం వచ్చి నీ భార్యనే కాదు నన్ను కూడా పోషించాలి నాకు కూడా నువ్వు భోజనం పెట్టాలి అనగానే నువ్వేంటి నానమ్మ ఇలా వచ్చావ్.. నువ్వు కూడా బాపుని వదిలేసి వస్తే బాబు ఏమైపోతాడు అది ఆలోచించవని క్రిష్ అంటాడు. జయమని తిట్టి మరీ ఆ ఇంటికి పంపించేస్తాడు క్రిష్.
మహదేవయ్యకు కాఫీ ఇస్తూ రేణుక మావయ్య మీ ముందర నేను ఏ రోజు నోరెత్తి మాట్లాడలేదు ఎందుకంటే నాకు ధైర్యం చాలలేక ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడొచ్చా మావయ్య అని అడుగుతుంది. ఏంటో చెప్పు అని మహదేవ అనగానే మనము మంచిగా ఉంటే మన దగ్గరికి అందరు వస్తారు కానీ మన మనసు మంచిది కాకుంటే మన నుంచి అందరు దూరం అయిపోతారు అని సలహాలిస్తుంది. అది విన్న భైరవి రేణుకను నువ్వు ఇప్పుడు ఒంటరిదానివి నిన్ను పీక నొక్కితే చచ్చే ఊరుకుంటావ్ అలాంటిది నువ్వు మావయ్యకి ఎదురు చెప్తావని అరుస్తుంది.
అందులోకి జయమ్మ అక్కడికి వస్తుంది. ఏమైనా అత్తమ్మ మళ్ళీ తిరిగి వచ్చేసావ్ అక్కడ నీకు రానివ్వ లేదా లేకపోతే ఒక ముద్ద అన్నం పెట్టలేకపోయారని అడుగుతుంది. ఇప్పుడు నేను దూరమై అమ్మవి నువ్వు దూరమైపోతే బాబు ఏమైపోతాడని క్రిష్ పంపించాడు అని చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది నందిని హర్ష గురించి చెప్తుంది. ఏం జరుగుతుందో చూడాలి…