Satyabhama Today Episode March 8th : నిన్నటి ఎపిసోడ్లో.. సంజయ్ మహదేవయ్యను చంపే ప్లాన్ వేస్తాడు. క్రిష్ కి ఎలాగైనా నిజం చెప్పాలని అప్పుడు మహదేవ్ క్రీస్తు చంపేస్తాడు. ఈ ఆస్తికి నేనే వారసులని అనుకుంటాడు. అనుకున్న విధంగానే పక్కా ప్లాన్ తో సంజయ్ భైరవికి హింట్ ఇస్తాడు. ఒక పంతులు చేత ఫోన్ చేయించి మహదేవయ్యకు ప్రాణగండం ఉంది హోమం చేయించాలి గుడికి రమ్మని చెప్తాడు. ఇక సంజయ్ కి ఆ విషయం చెప్పి టెన్షన్ గా భైరవి గుడికి వెళుతుంది. అడ్డుగా ఉంటావు అందుకే నేను పంపించాలి నీ ప్లాన్ వేసాము అని సంజయ్ అనుకుంటాడు. హర్ష ను మైత్రి ప్లాన్ లో ఇరుక్కున్న హర్షను సత్య కాపడుతుంది. సత్య చేసిన పనికి అందరు థ్యాంక్స్ చెప్తారు. సంధ్య వచ్చి తన తప్పును ఒప్పుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంధ్య సంజయ్ ప్లాన్ ను బయటపెట్టేస్తుంది. బావగారిని దెబ్బ కొట్టాలని మరో ప్లాన్ వేస్తున్నాడు అక్క అనేసి అంటుంది. ఏంటది అంటే బావగారి వల్ల అసలు తల్లిని చంపింది మావయ్య అంట. ఆవిషయాన్ని బావగారికి చెప్పి మామయ్య అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేస్తున్నాడు అని చెబుతుంది. అది విన్న క్రిష్ వెంటనే కోపంతో మహదేవయ్య దగ్గరికి వెళ్తాడు.. ఆవేశంగా బయటకు వెళ్లడం సత్యతో పాటు అందరూ చూస్తారు. సత్య, సంధ్యలు మహదేవయ్య ఇంటికి పరుగులు తీస్తారు. సంజయ్ తన తండ్రిని క్రిష్ చంపేస్తాడనని కలలు కంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. మహదేవయ్య చనిపోతే తనకు అడ్డులేదని ఈ సామ్రాజ్యం అంతా తనదే అని గెంతులేస్తాడు. క్రిష్ మహదేవయ్య ఇంటి తలపులు తన్ని లోపలికి వెళ్లడం చేతిలో కత్తి చూసిన మహదేవయ్య చిన్నా అని భయపడతాడు. ఎందుకు చంపినావ్ మా అమ్మని ఎందుకు చంపావ్ అని క్రిష్ అడిగితే క్రిష్కి నిజం తెలిసిపోయిందని మహదేవయ్య క్రిష్ని బతిమాలుతాడు. నా కన్న తల్లిని ఎందుకు చంపావ్ అని క్రిష్ అడుగుతూ నువ్వు చేసిన ద్రోహం తెలియగానే నా గుండె ముక్కలు అయిపోయిందని కేకలేస్తాడు..
మహదేవయ్య చేతిలో కత్తి పెట్టి నన్ను చంపే బాపు నీకు కావాల్సింది ఇదే కదా అప్పుడు మా అమ్మని దూరం చేసావు నన్ను నా తల్లిదండ్రులకు దూరం చేశావు ఇప్పుడు ఇది కూడా వచ్చేసి మంచి పని చేస్తావు అనేసి క్రిష్ అంటాడు. ఇదెక్కడి సంతరా ఎవరూ చంపుకోవడం లేదని సంజయ్ అనుకుంటాడు. నాకు నీ మీదే ప్రేమ ఎక్కువ అని అంటాడు క్రిష్. నువ్వు ఇష్టపడేవాళ్లు నీకు విలువ ఇవ్వకపోతే నువ్వు ఎంత బాధ పడతావో నేను అంతే బాధ పడతాను బాపు అని అంటాడు.. నేను ఎంతగా చెప్పినా మీరు నా మాట వినలేదు నన్ను వదిలించుకోవాలని చూశారు ఓ పని చేయండి బాపు ఎప్పుడు నీకు చంపాలని అనిపించినా నాకు ఫోన్ చెయ్ నేను రెడీగా వచ్చేసి నీ చేతిలో చచ్చిపోతానని క్రిష్ అనగానే మహదేవయ్య వెళ్ళు అనేసి పంపిస్తాడు.
అయితే క్రిష్ బయటకు వెళ్లిన తర్వాత తన చేతికున్న బ్రెస్ లైట్ కనిపించలేదని వెతుక్కుంటాడు. బ్రేస్ లేటుకున్న స్టోరీని గుర్తు చేసుకొని మళ్లీ దాన్ని వెతుక్కుంటూ మహదేవయ్య ఇంటికి వెళ్తాడు. సంజయ్ మహాదేవయ్య దగ్గరకు వచ్చి ఏంటి డాడీ ఇలా ఫీల్ అవుతున్నావ్ అంటే చూసావా రా వాడు వాడిని నేను ఎంతగా చీదరించుకొని అవతలు పడేసిన కూడా వాడు నన్నే కావాలని అనుకుంటున్నాడు అని అంటాడు. కానీ సంజయ్ మాత్రం వాడిని ఇప్పుడు ఇంటికి తీసుకురమ్మంటావా డాడ్ అనేసి అనగానే తీసుకురావాలి రా నువ్వేం అనుకోవద్దు నీ స్థానం నీదే వాడి స్థానం వాడిది అని మహదేవ అంటాడు. కానీ సంజయ్ మాత్రం దానికి ఒప్పుకోడు నువ్వు చచ్చిపో డాడ్ నీ స్థానం నాదే ఈ కోట నాదే ఆ తర్వాత వాడిని తీసుకొని వస్తాను అని అంటారు.. సంజయ్ మహాదేవయ్య ను చంపాలని అనుకోవడంతో మహాదేవయ్య షాక్ అవుతాడు. సంజయ్ నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. క్రిష్ వచ్చి సంజయ్ ను కొడతాడు. బాపు ను చంపాలని అనుకుంటావా అని అంటాడు. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. మహాదేవయ్య కు క్రిష్ క్షమించమని అడుగుతాడు. సంజయ్ కు గట్టిగానే బుద్ధి చెప్తాడు. ఎక్కడిదో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…