Satyabhama Today Episode November 22 th : నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రవర్తి నుంచి సత్య అసలు నిజాన్ని బయటపెడుతుంది. క్రిష్ తన సొంత కొడుకుని తెలుసుకుంటుంది. పాతికేళ్లు మౌనంగా ఉండడానికి అసలు కారణం ఏంటో చక్రవర్తి చెప్పగానే సత్య షాక్ అవుతుంది. చక్రవర్తి మౌనానికి నిజమైన కారణం తన భార్య చనిపోవడం అని సత్య తెలుసుకుంటుంది. చక్రవర్తిని మహదేవయ్య ముందు క్రిష్ ముందు అసలు నిజం చెప్పమని సత్య అడుగుతుంది. తనకి చక్రవర్తి భయపడుతూ ఉంటాడు. నా వల్ల తను చెప్పే నిజం వల్ల క్రిష్ కి ఏమైనా అవుతుందని బాధపడుతుంటాడు. ఇక సత్య ఇంటికి వచ్చి మహాదేవయ్య క్రిష్ చూసి అసలు నిజాన్ని బయటపెడతానని అనుకుంటుంది.. ఇక సంధ్య రెస్టారెంట్ లో ఉన్న విషయాన్ని తెలుసుకొని సంజయ్ అక్కడికి వెళ్తాడు. మనిద్దరినీ వీధి కలుపుతుందని అబద్ధం చెప్తాడు. హర్ష రాలేదని నందిని కోపంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చక్రవర్తి పుట్టినరోజునే సత్య కృష్ణ గ్రాండ్ గా చేస్తారు. ఇవన్నీ ఎందుకమ్మా అని చక్రవర్తి అంటే నాదేం లేదు చిన్న మామయ్య అంతా చేసింది క్రిష్ అని సత్య అంటుంది. ఇక జయమ్మ నాది ఏమీ లేదురా నేను వీళ్ళ వెనకాల తోకల వచ్చాను అనేసి అంటుంది. సత్య క్రిష్ ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఆ బంధం ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతారు. చక్రవర్తి కేక్ కటింగ్ తర్వాత సత్య చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. ఎందుకు మామయ్య కన్నీళ్లు మీ కొడుకు చేతే మీ పుట్టినరోజు జరిగింది కదా ఇక సంతోషించాల్సిన విషయమే కదా అనేసి అడుగుతుంది. కానీ చక్రవర్తి మాత్రం ఇలాంటి ఒకరోజు వస్తుందని నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదు అమ్మ ఇదంతా నీ వల్లే నా కొడుకుని నాకు దగ్గర చేశావు నువ్వు ఎప్పటికీ చల్లగా ఉండాలని అంటాడు. మా ఇద్దరిని కలపాలి అనే ప్రయత్నంలో నీకు ఏదైనా అవుతుందని నా బాధ అనేసి అనగానే, దానికి ఎప్పుడో చచ్చిపోయే బదులు ఒక మంచి మనుషుల్ని కలిపి చనిపోవడం మేలు కదా మామయ్య అని సత్య తగ్గకుండా మాట్లాడుతుంది.
ఇక క్రిష్ దగ్గరికి వెళ్లిన సత్య ఏమైంది క్రిష్ ఆ కన్నీళ్లు ఎందుకు అని అడుగుతుంది. నేను ఇంతకుముందు బాపు పుట్టినరోజులు చేశాను. బాపు కు కూడా కేక్ తినిపించాను. ఎప్పుడూ నాకు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు ఏదో దగ్గర పుట్టినరోజు జరిపానని నాకు అనిపిస్తుంది. చాలా అదృష్టవంతుడు బాబాయి లాంటి మంచి మనిషి తనకు తండ్రిగా దొరికాడు అని అంటాడు. దానికి సత్య సంజయ్ కాదు మంచి మనిషి నువ్వే మంచి మనిషివి నీకు అలాంటి తండ్రి దొరకడం అదృష్టం అని మనసులో అనుకుంటుంది. ఇదంతా బాగానే ఉంది సత్య నువ్వు చెప్తానన్నా ఆ సర్ప్రైజ్ ఏంటి అని క్రిష్ అడుగుతాడు. చెప్తాను క్రిష్ నీకు రేపటిలోగా అదేంటో తెలుస్తుంది నువ్వు చాలా థ్రిల్ గా ఫీల్ అవుతావని సత్యా అనేసి వెళ్ళిపోతుంది.. ఇక ఈ నిజాన్ని రేపే కుండలు బద్దలు కొట్టాలి సత్య అనుకుంటుంది. గంగానే కొత్త క్యారెక్టర్ కి ఫోన్ చేస్తుంది. ఇంక కూడా తగ్గేదేలే గలగల గంగా అంటూ డైలాగులు మీద డైలాగులు వదులుతుంది. తనకి సత్య నాకు డైలాగులు కాదు అసలు నిజం కావాలి మా మామ గురించి నీకు తెలియదు అంటే నా గురించి కూడా మీ మామయ్యకు తెలియదు ఎక్కడ తగ్గేది లేదు అనేసి మాటకు మాట చెప్తుంది. రేపే నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలని సత్య చెప్తుంది. ఈ గంగ కూడా సరే అంటుంది.
ఇక హర్ష అర్ధరాత్రి తర్వాత ఇంటికి వస్తాడు. నందిని చీకట్లో హాల్లోనే కూర్చొని ఉంటుంది. హర్ష లైట్ వేయగానే నందిని కోపంతో ఫ్లవర్ వాజ్ పగలగొట్టి లోపలికి వెళ్తుంది. హర్ష వాళ్ళ బామ్మ హర్ష దగ్గరకు వస్తుంది. మంచిది కాబట్టి పూలకొండని కొట్టి వెళ్ళింది. అదే నేనంటే నీ తలకాయ పగలగొట్టేదాన్ని అంటుంది. తను బయటికి తీసుకెళ్ళమని నిన్ను అడగలేదు తనకి ఆశ చూపించి ఊరించావు తర్వాత కుదరదని ఫోన్ చేసావా కనీసం అది కూడా లేదు అది ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ అవ్వలేదు. ఒక కారణమైతే చెప్తున్నావు ఒకప్పుడు ఇంటికొచ్చినప్పుడు నందిని ఎలా ఉండింది చాలా మొండిగా ఉండేది ఇప్పుడిప్పుడే తన చాలా మారిపోయింది. తనతో మళ్లీ దాన్ని ముందుగా చేస్తున్నావ్ వెళ్లి లోపలికి వెళ్లి ఏం మాట్లాడతావో మాట్లాడడానికి అంటుంది. నందిని కోపాన్ని చూసి హర్ష మెల్లగా లోపలికి వెళ్తాడు. నందిని కనీసం మాట్లాడను కూడా మాట్లాడదు. మైత్రి విషయం మన మధ్యలోకి తీసుకురానని చెప్పావు మాటిచ్చావు మాట తప్పవు అది నిలబెట్టుకుంటున్నావా అనేసి ఒక్క మాట అడుగుతుంది. ఇక సంధ్య చెప్పినట్లు విధి వాళ్ళని నిజంగానే కలుపుతుందా అని ఆలోచిస్తుంది. ఇప్పుడు తెలియకుండానే కన్ఫ్యూజన్ గానే వెళ్లిపోవాలని ఆటో ఎక్కి దారులు మారుస్తుంది. కానీ సంజయ్ మాత్రం సంధ్య వెనకాల ఫాలో అవుతున్న విషయాన్ని గమనించలేదు. ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల నేను వస్తానని సంగతి నువ్వు మర్చి పోతున్నావ్ సంధ్య అని సంజయ్ అనుకుంటాడు..
ఇక ఉదయం లేవగానే భైరవి క్రిష్ గార్డెన్లో కూర్చుని ఉంటారు. క్రిష్ బైరవిని నీళ్లు అడుగుతాడు. కానీ భైరవి మాత్రం నీళ్లు ఇవ్వదు పోయే నీ పెళ్ళాన్ని అడుగు అనేసి చురకలాంటిస్తుంది. తిరగడానికి నీ పెళ్ళాం కావాలి ఏదైనా మాట్లాడాలంటే నీ పెళ్ళాం కావాలి ప్రతిదానికి చక్కర్లు కొట్టాలన్న నీ పెళ్ళాం గాలి పోయి నీ పెళ్ళాన్ని అడుగు అనేసి బైరవి సెటైర్లు ఇస్తుంది. అతనికి క్రిష్ మంచినీళ్ళకి గింతగానం ఎందుకమ్మా పరేషన్ అవుతున్నావు అని అంటాడు. అప్పుడే గంగా ఎంట్రీ ఇస్తుంది. సత్య క్రిష్ చూపిస్తుంది. వచ్చి రాగానే నేరుగా క్రిష్ దగ్గరికి వెళ్తుంది గంగ.. బాబు నువ్వే కదా నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకువు అని ఎమోషనల్ అవుతుంది. పక్కనే ఇదంతా చూస్తున్న భైరవి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో గంగ మహదేవయ్యతో నీ రెండో పెళ్ళాన్ని అని చెబుతుంది. ఇక రేపు ఏం జరుగుతుందో చూడాలి..