సినిమా : మెకానిక్ రాకీ
డైరెక్టర్ : రవితేజ ముళ్లపూడి
నటీనటులు : విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేష్, హైపర్ ఆదితో పాటు తదితరులు
ప్రొడ్యూసర్ : రామ్ తాళ్లూరి
మ్యూజిక్ : జేక్స్ బిజోయ్
విడుదల తేదీ : 22 నవంబర్ 2024
Mechanic Rocky Rating – 2.25/5
Mechanic Rocky Movie Review : విశ్వక్ సేన్ నుండి ఈ ఏడాది ‘గామి’ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలు వచ్చాయి. వీటిలో ‘గామి’ బాగానే ఆడింది. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అంతగా ఆడలేదు. ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ఒక్క హిట్టు కూడా లేని ‘ఎస్.ఆర్.ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ నిర్మించింది. టీజర్, ట్రైలర్ పెద్దగా ఆసక్తిని అయితే కలిగించలేదు. మరి సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుందా? అనే ప్రశ్నకి సమాధానం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
నగుమోము రాకేష్ అలియాస్ మెకానిక్ రాకీ(విశ్వక్ సేన్) సరిగ్గా చదవట్లేదు అని భావించి తన మెకానిక్ షెడ్డులో పనికి పెట్టేస్తాడు అతని తండ్రి(నరేష్). తర్వాత అతను మంచి మెకానిక్ గా పేరు తెచ్చుకుంటాడు. అలాగే తన గరాజ్ లో డ్రైవింగ్ క్లాసులు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో రాకీ డ్రైవింగ్ స్కూల్ లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తుంది మాయ(శ్రద్ద శ్రీనాథ్). ఆమె ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్.ఆమెకు డ్రైవింగ్ నేర్పించే క్రమంలో తన ప్రేమ కథ గురించి, కెరీర్ గురించి చెబుతాడు రాకీ. బాగా పలుకుబడి ఉన్న అక్కి రెడ్డి(సునీల్) రాకీ మెకానిక్ షెడ్డుపై కన్నేస్తాడు. ఆ స్థలం అమ్మాలని రాకీ తండ్రిపై ఒత్తిడి తీసుకొస్తాడు. కానీ అందుకు అతను ఒప్పుకోడు. బలవంతం చేసి సంతకాలు పెట్టించుకోవడానికి వచ్చిన రౌడీలని చితక్కొట్టి అక్కి రెడ్డి ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత రాకీ తండ్రి మరణించాడు అని తెలుసుకుని షెడ్డుని తన పలుకుబడి ఉపయోగించి సీజ్ చేస్తాడు. ఈ క్రమంలో తన షెడ్డు కోసం అక్కి రెడ్డితో ఓ డీల్ కుదుర్చుకుంటాడు రాకీ. తండ్రి గుర్తుగా తన షెడ్డు కావాలని భావించి .. రూ.50 లక్షలు ఇస్తాను అని చెబుతాడు. కానీ అతనికి డబ్బులు అడ్జస్ట్ కావు. ఈ క్రమంలో మాయ.. రాకీ తండ్రి పేరుపై రూ.2 కోట్లు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అని చెబుతుంది. కానీ నామినిగా రాకీ పేరు ఉండదు. మరి అప్పుడు అతనికి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయా? దాని కోసం హీరో ఏం చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా(మీనాక్షి చౌదరి) అతనికి చేసిన సాయం ఏంటి? రాకీ గతమేంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
‘మెకానిక్ రాకీ’ చాలా సాదా సీదాగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కామెడీ కూడా సో సో గానే అనిపిస్తుంది. విలన్ సునీల్ కి హీరో వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్ అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. ఇలాంటి కథ విశ్వక్ సేన్ ఎలా ఎంపిక చేసుకున్నాడు అని ఓ దశలో తలకొట్టుకుంటూ ఉంటాం. ఇంటర్వెల్ బ్లాక్ కూడా జస్ట్ ఓకే. మరీ ఎక్సయిట్ చేయదు. కానీ సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ పోర్షన్ వీక్ గానే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే ట్విస్ట్..లు కట్టి పడేస్తాయి. కథనం కూడా వేగం పుంజుకుంటుంది. అందరూ అటెన్షన్ తో కూర్చుంటారు. నాలుగు ట్విస్ట్ ..లు ఉంటే అందులో 3 ఊహించని విధంగా ఉంటాయి. మళ్ళీ క్లైమాక్స్ సాగదీసినట్టు ఉన్నా.. ఓకే అని కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
విశ్వక్ సేన్ ఎప్పటిలానే హుషారుగా నటించాడు. కానీ అతని కంటే శ్రద్దా శ్రీనాథ్ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. మీనాక్షి చౌదరికి కూడా మంచి పాత్రే దొరికింది. సునీల్ లుక్, నటన కొత్తగా అనిపిస్తాయి. వైవా హర్ష, హైపర్ ఆది..ల కామెడీ పెద్దగా పేలలేదు. సీనియర్ నరేష్ మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. హర్ష వర్ధన్ కూడా ఓకే.
ప్లస్ పాయింట్స్ :
సెకండాఫ్
ట్విస్టులు
కొత్త పాయింట్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
అక్కడక్కడ ఫోర్స్డ్ కామెడీ
మొత్తంగా ‘మెకానిక్ రాకీ’.. ఫస్ట్ హాఫ్ కి కొంచెం ఓపిగ్గా కూర్చుంటే.. సెకండాఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు.
Mechanic Rocky Rating – 2.25/5