E-Paper
Advertisement

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!
Advertisement

Actress Raasi:చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్నారు సీనియర్ హీరోయిన్ రాశి (Raasi). పెళ్లి పందిరి, గోకులంలో సీత, శుభాకాంక్షలు వంటి ఎన్నో చిత్రాలతో టాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదిగిన ఈమె.. తెలుగు , తమిళ్, హిందీ భాషల్లో వందలాది చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. కెరియర్ పీక్స్ లో ఉన్నంత వరకు సినిమాలలో హీరోయిన్గా చేసి ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ఆ తర్వాత ‘కల్యాణ వైభోగమే’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా తల్లి, అత్త పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రాశి..

ఈ మధ్యకాలంలో వరుసగా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాశి.. తాజాగా ప్రముఖ కామెడీ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోకి గెస్ట్ గా వచ్చింది. అందులో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాలను పంచుకుంటూనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టడానికి ముందు తనను చాలా ఘోరంగా అవమానించారని, తన ముందే తనను తక్కువ చేసి మాట్లాడారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి గెస్ట్ గా రాశి..

Advertisement

బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇప్పుడు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరించిన ఇంద్రజ(Indraja).. జబర్దస్త్ జడ్జిగా వెళ్ళగా.. ఇక్కడ హోస్ట్ గా వ్యవహరించిన రష్మి (Rashmi Gautam) జబర్దస్త్ కే పరిమితమైంది.ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రదీప్ మాచిరాజు (Pradeep machiraju) హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో కంటెస్టెంట్లు కూడా బుల్లితెర వారిని రంగంలోకి దింపడం గమనార్హం. ఇక తాజాగా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా ఆ ప్రోమోలో రాసి ఎమోషనల్ కామెంట్లు చేసింది.

also read:గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

ఘోరంగా అవమానించారు అంటూ కన్నీళ్లు..

Advertisement

ప్రోమో విషయానికి వస్తే.. పొట్టి నరేష్ ‘పెళ్లి పందిరి’ సినిమా స్కూప్ వెయ్యగా.. ఇందులో రాశి కూడా పాల్గొని అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇకపోతే షోలో సందడి చేస్తున్న సెలబ్రిటీల గత తాలూకా జ్ఞాపకాలను నెమరు వేసుకోగా.. అందులో రాశి మాట్లాడుతూ..” హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికంటే ముందు ఒక సినిమాలో ఒక సాంగ్ కోసం నన్ను అడిగారు. అయితే ఆ సినిమాలో మెయిన్ గా ఉండే ఒక ఆయన.. ఏంటి వెంకటేష్ అప్పుడే మీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయిందా ఏంటి? అప్పుడే ఐస్ బాక్స్ లవి మెయింటైన్ చేస్తున్నావ్!” అంటూ నా ముందే అన్నారు. ఆ అవమానాన్ని నేను తీసుకోలేకపోయాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఎలాగైనా సరే ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్గా నేను ఎదగాలి అని.. అంటూ తన కెరియర్ స్టార్టింగ్ లో తాను పడ్డ అవమానాలను ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పి రాసి ఎమోషనల్ అయింది. ఇకపోతే ఇంకా కొన్ని విషయాలను ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. కానీ లాస్ట్ లో ప్రోమో కట్ చేశారు. ఇక పూర్తి ఎపిసోడ్ చూడాలంటే ఆగస్టు 9 వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

Big Stories

Advertisement
×