E-Paper
Advertisement

యాపిల్ నుంచి హెల్త్ స్మార్ట్ గ్లాసెస్.. వర్కౌట్స్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఇక కళ్లద్దాలతోనే!

యాపిల్ నుంచి హెల్త్ స్మార్ట్ గ్లాసెస్.. వర్కౌట్స్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఇక కళ్లద్దాలతోనే!
Advertisement

Apple Smart Glasses: టెక్ దిగ్గజం ప్రముఖ యాపిల్ కంపెనీ తమ భవిష్యత్ ఉత్పత్తులను కేవలం వినోదానికి మాత్రమే పరిమితం చేయకుండా.. మన ఆరోగ్యానికి కాపలాగా నిలిచే సాధనాలుగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది. త్వరలో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్, హెడ్‌సెట్‌లను డిజిటల్ హెల్త్ పరికరాలుగా మార్చాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పుడీ సంస్థ తీసుకున్న కీలక నిర్ణయం వెనుకు ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం రండి..

విజన్ ప్రోతో మొదలైన ప్రయోగం:

నిజానికి ఈ హెల్త్ ప్రాజెక్ట్ ఆలోచన ఈనాటిది కాదు. యాపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్ ద్వారానే ఫిట్‌నెస్ ప్లస్ సర్వీస్‌ను తీసుకురావాలని కంపెనీ భావించింది. వర్కౌట్స్ చేసే సమయంలో యూజర్ల శరీర కదలికలను ట్రాక్ చేసి, ఫీడ్‌బ్యాక్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. కానీ హెడ్‌సెట్ బరువు ఎక్కువగా ఉండటం, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు.

Advertisement

Also Read: 6500 నిట్స్ బ్రైట్‌నెస్, 7000mAh భారీ బ్యాటరీ.. ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసిన Honor Play 11 Pro!

స్మార్ట్ గ్లాసెస్‌పై ప్రత్యేక దృష్టి:

హెడ్‌సెట్ బరువుతో వచ్చిన ఇబ్బందుల వల్ల, యాపిల్ ఇప్పుడు తన దృష్టిని తేలికగా ఉండే స్మార్ట్ గ్లాసెస్‌ వైపు మళ్లించింది. మనం రోజువారీగా వాడే ఎయిర్‌పాడ్స్ మాదిరిగానే, ఈ గ్లాసెస్ కూడా రోజంతా వేసుకోవడానికి అనువుగా ఉంటాయి. వీటిలో ఉండే ప్రత్యేక సెన్సార్లు మన శరీర కదలికలను, ఆరోగ్యాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. అయితే వచ్చే ఏడాది రాబోయే మొదటి తరం గ్లాసెస్‌లోనే ఈ ఫీచర్లు ఉంటాయా లేదా అనేది చూడాలి.

కొత్త రిక్రూట్‌మెంట్ చూపిస్తున్న సంకేతాలు:

Advertisement

యాపిల్ విజన్ ప్రొడక్ట్స్ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన ఒక ఉద్యోగ ప్రకటన ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. ‘స్ట్రాటెజిక్ ప్రొడక్ట్ డిజైన్ లీడర్’ పోస్ట్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. డిజిటల్ హెల్త్, ఫిట్‌నెస్ ఉత్పత్తులు రూపొందించిన అనుభవం ఉన్నవారికి ఈ పోస్టులో ప్రాధాన్యం ఇస్తున్నారు. హెల్త్, స్పాషియల్ కంప్యూటింగ్, హ్యూమన్ బిహేవియర్‌లను అనుసంధానిస్తూ సరికొత్త అనుభవాన్ని అందించడమే ఈ రోల్ ముఖ్య ఉద్దేశం.

భవిష్యత్తులో హెల్త్ డివైజ్‌గా యాపిల్ గ్లాసెస్:

ప్రస్తుతం మన చేతికి ఉన్న యాపిల్ వాచ్, చెవిలో పెట్టుకునే ఎయిర్‌పాడ్స్ ఏ విధంగానైతే ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాయో, భవిష్యత్తులో రాబోయే స్మార్ట్ గ్లాసెస్ కూడా అదే జాబితాలో చేరబోతున్నాయి. ధరించడానికి సౌకర్యంగా ఉంటూనే, మన ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసే డిజిటల్ పార్ట్‌నర్‌గా ఇవి మారనున్నాయి.

Also Read: పవర్‌ఫుల్ ప్రాసెసర్, 50MP కెమెరా ఉన్న Oppo ఫోన్‌పై ఏకంగా రూ.12,000 తగ్గింపు!

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×