E-Paper
Advertisement

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?
Advertisement

Aditi Sharma:హిందీ బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న నటి అదితి శర్మ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. భర్త, అత్తమామలు తనను గృహహింసకు గురిచేస్తున్నారని, నగలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడం టీవీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ప్రారంభమైన వీరి వైవాహిక బంధం ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసులు, ఎఫ్‌ఐఆర్‌ల వరకు వెళ్లడం తోటి నటీనటులను, అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది..

భర్త, అత్తపై తీవ్రమైన ఆరోపణలు:

‘కలీరీన్’, ‘రబ్ సే హై దువా’, ‘ఖత్రోం కే ఖిలాడీ 14’ వంటి పాపులర్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న అదితి శర్మ, ముంబైలోని గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త అభినీత్ కౌశిక్, అత్త ఊర్మిళా కౌశిక్, ఆడపడుచు కీర్తి కౌశిక్‌లు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని వాపోయారు. ఇక పెళ్లయిన కొద్ది రోజులకే భర్త ప్రవర్తన మారిపోయిందని, వేసుకునే దుస్తుల నుంచి చిన్న చిన్న విషయాల వరకు గొడవపడేవాడని ఆమె పేర్కొన్నారు.

నగలు తిరిగి ఇవ్వకుండా వేధింపులు:

Advertisement

అదితి వాంగ్మూలం ప్రకారం.. భర్త ఇంటి ఖర్చులకు సహకరించకపోగా, తన వద్ద నుంచే డబ్బులు డిమాండ్ చేసేవాడట. అంతేకాకుండా పెళ్లి సమయంలో తనకు ఇచ్చిన బంగారు గొలుసులు, డైమండ్ రింగ్, మంగళసూత్రం, గాజులన్నింటినీ అత్త ఊర్మిళా కౌశిక్ తమ వద్దే ఉంచుకుని, ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారని అదితి ఆరోపించారు.

అనుమానం, తీవ్ర ఆంక్షలు:

గత ఏడాది జనవరిలో కేవలం ఒక కాఫీ విషయంలో మొదలైన చిన్నపాటి ఘర్షణ తీవ్రమైన పదజాలంతో నిందలు వేసేవరకు వెళ్ళింది. ఆ సంఘటన తర్వాత నుంచి ఆమె భర్త ప్రవర్తన మరింత దారుణంగా మారింది. ఆమె వ్యక్తిగత జీవితాన్ని అనుమానిస్తూ, వేరొకరితో అక్రమ సంబంధం అంటగట్టడం మొదలుపెట్టాడు. ఇక ప్రైవసీ లేకుండా ఆమె మొబైల్ ఫోన్‌ను తరచూ తనిఖీ చేయడమే కాకుండా, దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఆఖరికి ఆమె తన కన్నతల్లిదండ్రులతో కూడా మాట్లాడకుండా కఠినమైన ఆంక్షలు విధించాడని అదితి తన ఫిర్యాదులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

also read:బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

ముంబై పోలీసుల ఎఫ్‌ఐఆర్ నమోదు:

నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై గోరేగావ్ పోలీసులు జులై 31న ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. భర్త, అత్త, ఆడపడుచులపై ఐపీసీ సెక్షన్ 85, సెక్షన్ 316(2), సెక్షన్ 352 కింద కేసులు నమోదు చేసి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

టీవీ సీరియల్స్‌లో బలమైన పాత్రలతో గుర్తింపు పొందిన అదితి శర్మ, ఇప్పుడు నిజ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటోంది. దీంతో అందరూ బాధపడుతున్నారు. చట్టపరంగా పోలీసులు జరుపుతున్న ఈ విచారణలో నిజానిజాలు ఏమిటనేది త్వరలోనే బయటకు రానుంది.

Related News

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

Big Stories

Advertisement
×