Tollywood:సినిమా ఇండస్ట్రీ అయినా.. బుల్లితెర రంగం అయినా సరే దర్శకనిర్మాతలకు అనుకూలంగా ప్రవర్తిస్తేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉంటారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు దర్శక నిర్మాతలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మాత్రం బ్యాన్ తప్పదు అని చాలామంది ఉదాహరణగా నిలిచారు. అలాంటి వారిలో పల్లవి గౌడ(Pallavi Gowda) కూడా ఒకరు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె ఒకప్పుడు తెలుగు సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. కానీ సడన్గా ఉన్నట్టుండి బుల్లితెర ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడంతో పలు రకాల రూమర్లు కూడా వ్యక్తమయ్యాయి. దీనికి తోడు ఆమెపై దర్శక నిర్మాతల మండలి బ్యాన్ కూడా విధించింది. దీంతో తన తప్పు లేకపోయినా తనను బ్యాన్ చేశారని పల్లవి చెప్పుకొని బాధపడింది.
ఇండస్ట్రీ బ్యాన్ పై స్పందించిన పల్లవి గౌడ..
ఒకప్పుడు తెలుగులో వస్తున్న సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. అలా పసుపు కుంకుమ, సూర్యకాంతం, సావిత్రి, చదరంగం వంటి సీరియల్స్ తో భారీ పాపులారిటీ అందుకుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి గౌడ తనను బుల్లితెర ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసిందో కూడా తెలిపింది. పల్లవి గౌడ మాట్లాడుతూ.. నేను తెలుగులో రెండో సీరియల్ షూటింగ్ చేస్తున్నప్పుడు, ఒక సినిమాలో అవకాశం వచ్చింది. దానితో అనుమతి అడిగి మరీ సినిమా షూటింగ్ కి వెళ్లాను. కొద్దిరోజులే పర్మిషన్ తీసుకొని వెళ్లినప్పటికీ అనుకోకుండా 20 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత షూటింగ్ కి వెళ్లాను.
అందుకే బ్యాన్ చేశారు..
ఇక ఒకేసారి సినిమా షూటింగు, సీరియల్ షూటింగు జరగడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఎంతో ఇబ్బంది పడ్డాను. దీనికి తోడు సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ సీరియల్ వాళ్ళు నాకు సరిగ్గా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదు. పైగా రెండు నెలల డబ్బులు ఇవ్వలేదు. దాంతో నేను వేరే సీరియల్ కి డేట్ ఇస్తానని చెప్పాను. అప్పుడు వారు ఒక సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకో సీరియల్ అగ్రిమెంట్ ఎలా చేసుకుంటావు అంటూ నన్ను బెదిరించారు.నాకు డబ్బులు సరిపోడం లేదని కనీసం రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరినా.. వారు నిరాకరించారు. దాంతో చేసేదేమీ లేక ఆ సీరియల్ అగ్రిమెంట్ పై నేను సంతకం చేశాను. దాంతో ఈ సీరియల్ దర్శక నిర్మాతలు నాపై ఏడాది పాటు తెలుగులో బ్యాన్ విధించారు. అంటూ తెలిపింది..
మళ్లీ తెలుగు ఇండస్ట్రీ నుండి పిలుపు..
బ్యాన్ విధించిన తర్వాత తాను కన్నడ, మలయాళం లో సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్లీ తెలుగు నుంచి పిలుపు వచ్చింది అంటూ పల్లవి గౌడ తెలిపింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పల్లవి గౌడ విషయానికి వస్తే.. తెలుగు ఛానల్ లో ఏడాది పాటు బ్యాన్ విధించిన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరయింది. తన యూట్యూబ్ ఛానల్ లో పలు రకాల వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ అవకాశాలు తలుపు తడుతున్న నేపథ్యంలో సత్తా చాటడానికి సిద్ధమయింది పల్లవి. మరి ఇప్పటికైనా తనకు మరిన్ని రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈమె గత ఏడాది ప్రారంభమైన కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షోలో కంటెస్టెంట్ గా చేసింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">