E-Paper
Advertisement

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!
Advertisement

Actress Sireesha: తెరపై నవ్వులు చిందిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంతోమంది సెలబ్రిటీల జీవితాలలో కన్నీళ్లు తెప్పించే సంఘటనలు అభిమానులను సైతం కంటతడి పెట్టిస్తూ ఉంటాయి. అంతేకాదు ఆ విషయాలను వారే స్వయంగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇకపోతే సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ సోషల్ మీడియా అనేది మంచికి ఉపయోగపడుతోంది. అలాగే చెడుకి కూడా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే మంచికంటే చెడు వేగంగా వ్యాపిస్తుంది అనేది నిపుణుల ఆవేదన. ఈ క్రమంలోనే సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల్లోకి కొంతమంది ఆకతాయిలు తలదూరుస్తూ.. వారిని మానసికంగా వేధించడమే కాకుండా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను -నటి శిరీష

ఈ క్రమంలోనే ప్రముఖ సీరియల్ నటీమణి కూడా ఇదే సోషల్ మీడియా కారణంగా ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీరియల్ నటీమణి శిరీష (Sireesha). మనసు మమత సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో పలు సీరియల్స్ , షోలలో సందడి చేస్తూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం బొమ్మరిల్లు సీరియల్ లో విలన్ పాత్ర పోషిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈమె మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేసింది. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బాబు కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది..

Advertisement

శిరీష మాట్లాడుతూ..”నేను ఒక సీరియల్ చేశాక.. నా భర్త నవీన్ తో కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్నాను. అది 2024లో జరిగింది. విడాకుల కారణంగా ఏడాదిన్నర పాటు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకున్నాను. ఆ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఎన్నో నెగటివ్ కామెంట్స్ పెట్టారు. ముఖ్యంగా ఆ నెగిటివ్ కామెంట్స్ ఎలా ఉండేవి అంటే.. ఆఖరికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి కేవలం నా కొడుకు ఉన్నాడు అనే ఒక్క కారణంతో నేను ఆత్మహత్య చేసుకోకుండా ఆగిపోయాను. ఈ సోషల్ మీడియా నెగిటివ్ కామెంట్స్ వల్ల అంత నరకం అనుభవించాను” అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ALSO READ: ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

డాక్టర్లు 50 – 50 ఛాన్సెస్ అని చెప్పారు – ప్రదీప్ మాచిరాజు

Advertisement

ఇదే షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రదీప్ (Pradeep machiraju)మాట్లాడుతూ.. “షూట్ చేసేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల నా కాలికి సర్జరీ చేయడం జరిగింది. నాకు ఇంకా బాగా గుర్తుంది నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు.. డాక్టర్ చెప్పాడు 50- 50 ఛాన్సెస్ అని. కంప్లీట్ ఫిట్ గా నడవగలుగుతారా? లేదా? అనే విషయంపై స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇక వారి మాటలతో అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కూర్చొని చేసే పనులు ఏముంటాయి.. కూర్చొని యాంకరింగ్ చేయొచ్చా? లేదా? ఇంకా ఏదైనా చేయొచ్చా? అని ఫిజికల్ గా లేచి ఎంత రావాలన్నా.. నడవాలన్నా.. నేను ఒకానొక స్టేజిలో నడవలేకపోయాను.. నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజులవి” అంటూ చెప్పి కంటతడి పెట్టించారు ప్రదీప్ మాచిరాజు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Podarillu Today Episode : సురేష్ కు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. కేశవ మాటతో షాక్.. నారాయణకు మహా వార్నింగ్..

Big Stories

Advertisement
×