E-Paper
Advertisement

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!
Advertisement

Dell Inspiron 14 5410: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్టూడెంట్స్ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకు ప్రతి ఒక్కరికీ ల్యాప్‌ టాప్ అనేది ఒక అత్యవసర సాధనంగా మారి పోయింది. ప్రాజెక్ట్‌లు చేయాలన్నా.. ఆఫీస్ మీటింగ్‌లు అటెండ్ అవ్వాలన్నా, లేదా ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయాలన్నా.. మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్‌టాప్ ఉండాలి. సరిగ్గా మిడిల్ రేంజ్ బడ్జెట్‌లో.. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం డెల్ మార్కెట్‌లోకి తెచ్చిన అద్భుతమైన గ్యాడ్జెట్ Dell Inspiron 14 (5410). ఈ ట్రెండింగ్ ల్యాప్‌టాప్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ:

ఈ ల్యాప్‌టాప్ అతిపెద్ద హైలైట్ దీని ప్రీమియం లుక్ కాంపాక్ట్ డిజైన్.ఇందులో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల స్క్రీన్ పై ఉన్న అక్షరాలు, వీడియోలు చాలా షార్ప్‌గా,స్పష్టంగా కనిపిస్తాయి.దీని స్లిమ్ బెజెల్స్ ల్యాప్‌టాప్‌కి మోడ్రన్ లుక్‌ని తెస్తాయి. బరువు కూడా చాలా తక్కువగా ఉండటంతో.. దీనిని బ్యాగ్‌లో వేసుకొని కాలేజీకి లేదా ఆఫీస్‌కి ఎక్కడికైనా చాలా ఈజీగా మోసుకెళ్లవచ్చు.

పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ & ప్రాసెసర్ :

Advertisement

మల్టీటాస్కింగ్ సింపుల్ గా చేయడానికి  ఇందులో.. బెస్ట్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను వాడారు. మీరు.. ఒకే సమయంలో అనేక యాప్స్‌ని ఓపెన్ చేసినా, భారీ ఎక్సెల్ షీట్లు వాడినా లేదా సాఫ్ట్‌వేర్ టూల్స్ రన్ చేసినా ల్యాప్‌ టాప్ ఎలాంటి లాగ్ లేకుండా సూపర్‌ ఫాస్ట్‌గా పని చేస్తుంది. ఆఫీస్ వర్క్, కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ పనులకు ఇది చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అలాగే.. ఇందులో ఫాస్ట్ స్టోరేజ్ సపోర్ట్ ఉండటం వల్ల.. సిస్టమ్ క్షణాల్లో ఆన్ అవుతుంది.

కీబోర్డ్, బ్యాటరీ, ఆడియో :

దీని బ్యాక్‌లిట్ కీబోర్డ్ టైపింగ్ అనుభవాన్ని మరింత ఈజీ చేస్తుంది. చీకట్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టైప్ చేయవచ్చు. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే రోజంతా నాన్‌స్టాప్ వర్క్ చేసుకోవడానికి తగిన బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కొద్ది సేపట్లోనే .. దీని బ్యాటరీ ఫుల్ అవుతుంది. అలాగే ఇందులో.. ఉన్న స్పీకర్లు క్రిస్టల్ క్లియర్ సౌండ్‌ని అందించి, మూవీస్ చూసేటప్పుడు మంచి ఫీల్ ఇస్తాయి.

Advertisement

Also Read: డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

కనెక్టివిటీ ఆప్షన్లు :

ఈ ల్యాప్‌ టాప్‌లో యూఎస్‌బీ పోర్ట్స్, హెచ్‌డీఎంఐ పోర్ట్, టైప్-సి పోర్ట్ , వై-ఫై, బ్లూటూత్ వంటి అన్ని లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల పెన్ డ్రైవ్‌లు, ప్రొజెక్టర్లు ,ఇతర డివైజెస్‌ని ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.

ధర:

అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో.. వస్తున్న ఈ ల్యాప్ టాప్ అసలు ధర మార్కెట్లో కేవలం రూ. 54,700 మాత్రమే. బడ్జెట్ ధరలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ల్యాప్‌టాప్ కొనాలనుకునే.. వారికి ఇది ప్రస్తుతం నంబర్-1 ఛాయిస్. మీరు దీనిని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు లేదా డెల్ అధికారిక స్టోర్లలో కొనొచ్చె. ఇప్పుడే ఈ ట్రెండింగ్ గ్యాడ్జెట్‌ను మీ సొంతం చేసుకోండి.

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×