E-Paper
Advertisement

పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటే.. శోభాశెట్టి చెప్పిన అసలు కారణం ఇదే!

పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటే.. శోభాశెట్టి చెప్పిన అసలు కారణం ఇదే!
Advertisement

Shobha Shetty: డాక్టర్ మోనిత.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.ముఖ్యంగా కార్తిక దీపం సీరియల్ లో మౌనితగా శోభాశెట్టి ఏ రేంజ్ లో విలనిజం సంపాదించిందో చెప్పక్కర్లేదు.ఒక దశలో ఆమె స్క్రీన్ పై కనిపిస్తే ఏం జరుగుతుందో అంటూ క్యూరియస్ గా వాచ్ చేసేవారు ఆడియన్స్ .ఇక ముఖ్యంగా వంట లక్క చుట్టూ ,డాక్టర్ బాబు చుట్టూ మౌనిత వేసే ప్లాన్లు ఆడియన్స్ ని బాగా అలరించాయి.

ఇక ఆ సీరియల్ తర్వాత శోభాశెట్టి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది.ఆ రియాల్టీ షోలో కూడా శోభా శెట్టి మంచి క్రేజ్ సంపాదించింది .

Advertisement

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభా శెట్టి పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చింది.ముఖ్యంగా కార్తీకదీపం సమయంలో యశ్వంత్ తో తనకి పరిచయం ఏర్పడిందని, అదే పరిచయం ప్రేమగా మారిందని తెలిపింది .అయితే మొదట్లో యశ్వంత్ తన ప్రేమని ఒప్పుకోలేదని, కెరియర్లో సెట్ అయిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పాడని తెలిపింది. ఒకానొక సమయంలో ఇక ఈ ప్రేమను వదిలేద్దాం అనుకుంటుండగా యశ్వంత్ తనని ఇష్టపడడం మొదలెట్టడని చెప్పుకొచ్చింది .

అయితే వీరి ఎంగేజ్మెంట్ అయి ఇప్పటికి రెండేళ్లు అవుతున్న ఇంకా పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. అయితే ఇదే విషయంపై శోభా శెట్టి స్పందిస్తూ 2025 లోనే తామ పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ తన తల్లి హెల్త్ సరిగ్గా లేకపోవడంతో ఆ పెళ్లి వాయిదా పడిందని చెప్పుకొచ్చింది. తన పెళ్లిని ఎంతో ఘనంగా చూడాలనేది తన తల్లి కోరిక అని, అయితే ఆమె ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత తమ పెళ్లి గురించి ప్రయత్నాలు చేస్తామంటూ తెలిపింది.

Advertisement

ఇక బిగ్ బాస్ లో పలు ఆసక్తికరమైన సంఘటనలు గురించి చెబుతూ తేజ తన వెంట తిరుగుతూ బాగా అల్లరి చేసేవాడని అయితే రెండో వారంలోనే తానేంటో అతనికి క్లియర్ గా చెప్పేశానని చెప్పుకొచ్చింది . మనం ఎంత చనువుగా ఉన్నా బయటనుంచి మనల్ని చూసేవారు ఎలా చూస్తారో తెలియదు ,నాకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, అతను చాలా మంచివాడు కాబట్టి నువ్వు ఏం చేసినా సరదాగా చేయాలి తప్ప ఆ ఉద్దేశంతో మాత్రం చేయకూడదు అంటూ అతని మొహం మీద చెప్పేశానని తెలిపింది.

ఇదే తేజ నిజంగా సీరియస్ గా ఏదైనా చేసినా కూడా తనకి ఫన్ గానే అనిపించేదని చెప్పుకొచ్చింది .అయితే వీరిద్దరి మధ్య జరిగే ఫన్ ని ఆడియన్స్ మరోలా అర్థం చేసుకునే లోపే యశ్వంత్ బిగ్ బాస్ స్టేజి మీదకి రావడంతో అసలు విషయం బయటపడిందని తెలిపింది.

బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ టైంలో తాను యశ్వంత్ రిలేషన్ లో ఉన్నామన్న విషయం ఆడియన్స్ కు తెలిసిందని తెలిపింది. శోభితా శెట్టి తన వ్యక్తిగత జీవితం గురించి తెలుపుతూ తనకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరని కేవలం హాయ్ భాయ్ మాత్రమే అందరితో అని చెప్పుకొచ్చింది.

పైగా తన కుటుంబంలో ఇంతమంది అన్నయ్యలు కజిన్స్ ఉండటంతో, బయట ఫ్రెండ్స్ ఎక్కువగా లేకుండా పోయారని తెలిపింది.అయితే యశ్వంత్ కి ఉన్న ఫ్రెండ్స్ ని చూసి అప్పుడప్పుడు తనకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటూ వాపోయింది శోభితశెట్టి .

ఇక అమర్దీప్, తేజ తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని, వీరిద్దరిలో అమర్ దీప్ కన్నా తేజనే తనకి కాస్త ఎక్కువ క్లోజ్ అని చెప్పడం విశేషం .అయితే తన లైఫ్ లో తేజ లాంటి ఫ్రెండ్ రావడం వల్లే ఫ్రెండ్షిప్ అనే విలువకి అర్థం తెలిసిందని తెలిపింది.

also read :విజయ్ – త్రిష రూమర్స్ పై నోరు విప్పిన సంజనా.. “వాళ్ళపర్సనల్ లైఫ్ తో మీకేంటి పని?”

ఇక తేజ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు అన్న రూమర్స్ కి సమాధానం ఇస్తూ నా దగ్గర ఫోన్ ఉంది, అతని నెంబర్ ఉంది నేను ఫోన్లో విష్ చేస్తాను. అంతే తప్ప ఇంస్టాగ్రామ్ లో విషెస్ పోస్ట్ పెడితేనే విషెస్ చేసినట్టు కాదు అంటూ కౌంటర్ ఇచ్చింది శోభితశెట్టి .ఇక ప్రస్తుతం సీరియల్స్ కి దూరంగా ఉంటూ బిజినెస్ పై ఫోకస్ పెట్టిన శోభిత యశ్వంత్ తో పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతుందో చూడాలి!

Tags

Related News

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode October 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీ, ఐశ్వర్య పెళ్లి కోసం ఇందు ఏం చేసిందో తెలుసా..?   

Big Stories

Advertisement
×