E-Paper
Advertisement

విజయ్ – త్రిష రూమర్స్ పై నోరు విప్పిన సంజనా.. “వాళ్ళపర్సనల్ లైఫ్ తో మీకేంటి పని?”

విజయ్ – త్రిష రూమర్స్ పై నోరు విప్పిన సంజనా.. “వాళ్ళపర్సనల్ లైఫ్ తో మీకేంటి పని?”
Advertisement

Sanjana Galrani: ఈ మధ్య  ఇంటర్వ్యూలో సినీ నటి సంజనా గల్రానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. కొద్దిరోజులుగా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు విజయ్, త్రిషల వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్, బిగ్‌బాస్ ఆడిషన్స్‌లో ఉప్పల్ బాలుపై నవదీప్ చేసిన కామెంట్స్, అలాగే ట్రాన్స్‌జెండర్ల హక్కులపై సంజనా రియాక్ట్ అయిన విధానం  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

తమిళనాడు రాజకీయాల్లోకి ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చి, సీఎం అయిన  దళపతి విజయ్ వ్యక్తిగత జీవితాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నారని సంజనా మండిపడ్డారు. అనిల్ కపూర్ ‘నాయక్’ సినిమాలో వన్-డే సీఎం అయినట్లు, విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తన పరిపాలనతో నిరూపించుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఒక ప్రజా నాయకుడి గవర్నెన్స్, పాలసీల గురించి మాట్లాడాలి కానీ, ఆయన పర్సనల్ లైఫ్ లోకి గుచ్చి గుచ్చి తొంగి చూడటం సంస్కారం కాదని స్పష్టం చేశారు.

Advertisement

అలాగే నటి త్రిషను ఉద్దేశించి సోషల్ మీడియాలో కొందరు వాడుతున్న “అది.. ఇది..” అనే పదాలు మాట్లాడవద్దు అంటూ హెచ్చరించారు త్రిష చాలా స్వీట్ పర్సన్ అని, ఎలాంటి ఈగో లేని వ్యక్తి అని కొనియాడారు. ఒక సాధారణ మధ్యతరగతి మహిళనైనా, ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్‌నైనా గౌరవించడం నేర్చుకోవాలని, ఏ వ్యక్తినైనా ‘అది.. ఇది..’ అని చులకనగా మాట్లాడటం ముమ్మాటికీ తప్పేనని చెప్పుకొచ్చారు.

ఇక బిగ్‌బాస్ తెలుగు ఓపెన్ ఆడిషన్స్ (అగ్నిపరీక్ష) సమయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలును నటుడు నవదీప్ ఇన్సల్ట్ చేశారనే వార్తలపై సంజనా స్పందిస్తూ, తాను ఆ ఎపిసోడ్ పూర్తిగా చూడలేదు కాబట్టి ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అని జడ్జ్ చేయలేనన్నారు. ఒకవేళ అది అగ్నిపరీక్ష కాన్సెప్ట్ అయి ఉంటే, కంటెస్టెంట్లు ఎలాంటి ప్రెజర్ నైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలని, అంతేగానీ బయటికొచ్చి మీడియా ముందు విమర్శించడం సరికాదని చెప్పారు.

Advertisement

ట్రాన్స్‌జెండర్ల జీవితాలపై ఎమోషనల్ అయిన సంజనా  కర్ణాటకలో ఒక సినిమా షూటింగ్ సమయంలో దాదాపు 15-20 రోజుల పాటు ట్రాన్స్‌జెండర్లతో కలిసి ప్రయాణించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు దొరక్క, సమాజం వేసే జోకులు భరిస్తూ వాళ్లు పడే బాధ చెప్పలేనిది అని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లకు జాలి కాదని, మన ప్రోత్సాహం కావాలని, బిగ్‌బాస్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లలో కనీసం ఒకరిద్దరు ట్రాన్స్‌జెండర్లకైనా క్రమం తప్పకుండా అవకాశం ఇవ్వాలని కోరారు.

ఏది ఏమైనా, సినీ ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై ట్రోలింగ్ ఆపాలంటూ సంజనా గల్రానీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. పర్సనల్ లైఫ్‌ను పక్కన పెట్టి, ఒక నటుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా విజయ్ సాధించబోయే విజయాలపైనే అందరూ దృష్టి పెట్టాలని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today Episode October 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీ, ఐశ్వర్య పెళ్లి కోసం ఇందు ఏం చేసిందో తెలుసా..?   

Big Stories

Advertisement
×