E-Paper
Advertisement

సరిహద్దుల్లో డేంజర్ బెల్స్.. చైనా హెచ్చరికలతో జంకుతున్న నేపాల్!

సరిహద్దుల్లో డేంజర్ బెల్స్.. చైనా హెచ్చరికలతో జంకుతున్న నేపాల్!
Advertisement

Nepal Floods: చైనా నుంచి మరో హెచ్చరిక వచ్చింది. విపత్తు తర్వాత ఏర్పడిన సరస్సులో నీటి రంగు ముదురు రంగులోకి మారుతోందని, ఇది సరస్సు బద్దలయ్యేందుకు ప్రధాన సూచన అని చైనా అధికారులు.. నేపాల్ విదేశాంగ శాఖను అప్రమత్తం చేశారు. చైనా వైపున చోచెన్ నది, నేపాల్ వైపున పురెపు నది కలిసే ప్రాంతంలో ఏర్పడిన ఈ సరస్సులో.. నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఫ్లడ్ మోడలింగ్ రీసెర్చ్ ప్రకారం.. గరిష్టంగా సెకనుకు 500 క్యూబిక్ మీటర్ల ప్రవాహం ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

మృతుల సంఖ్య 700..

ఇప్పటివరకు ఈ ప్రకృతి విలయంలో.. మృతుల సంఖ్య 700 దాటింది. 2,400 మందికి పైగా గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. ఆకస్మిక వరదలు సంభవించిన 4 రోజుల తర్వాత.. చైనా సహాయక బృందాలు గిరాంగ్ వలస కేంద్రానికి చేరుకున్నాయ్. కైలాస యాత్రకు వెళ్తున్న కొందరు భారతీయ యాత్రికులు మధ్యలోనే ఉన్నారు. వరదల్లో చిక్కుకున్న 84 మంది భారతీయులను రక్షించారు. ఇంకా 320 మంది భారతీయుల ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో 400 మంది చైనా వైపు చిక్కుకుపోయారు.

Advertisement

Also read: మ్యాచ్ ఆడుతుంటే స్టేడియంలో పదే పదే వినిపించే సీక్రెట్ విజిల్… శబ్దంతో కోచ్ కొంపముంచిన లేడీ

సొరంగాల్లో రక్షణ చర్యలు..

మొదట్లో విదేశీ సహాయాన్ని తిరస్కరించిన నేపాల్ ప్రభుత్వం.. దౌత్యపరమైన ఒత్తిళ్లు, గల్లంతైన వారిలో విదేశీయులు ఉండటంతో వెనక్కి తగ్గింది. సొరంగాల్లో రక్షణ చర్యలు, డీఎన్‌ఏ, ఫోరెన్సిక్ పరీక్షల కోసం అంతర్జాతీయ నిపుణుల బృందాలను అనుమతించాలని నిర్ణయించింది. మరోవైపు.. భారత్ నుంచి నేపాల్‌కు అత్యవసర సహాయం అందుతోంది. తాజాగా 10 టన్నుల సహాయక సామగ్రితో పాటు డాక్టర్లు, రెస్క్యూ సిబ్బందితో కూడిన మూడో విమానం నేపాల్‌కు చేరుకుంది. విపత్తుతో ఏర్పడిన కొత్త సరస్సు ముప్పు పొంచివున్న తరుణంలో.. నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో సహాయక చర్యలకు తాత్కాలికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. వేలాది మంది ఆచూకీ గల్లంతు కావడంతో.. వాళ్లందరినీ కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయ్.

Advertisement

Also read: విజయ్ – త్రిష రూమర్స్ పై నోరు విప్పిన సంజనా.. “వాళ్ళపర్సనల్ లైఫ్ తో మీకేంటి పని?”

Tags

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

టెన్త్ సర్టిఫికెట్ లేకున్నా జూనియర్ లెక్చరర్.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి సంచలనాలు!

కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష.. ఫిక్స్ అయినట్టేనా..?

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×