E-Paper
Advertisement

నా వల్ల కావట్లేదు.. పెళ్లి చేసేయ్ అమ్మ.. సుప్రీత కామెంట్స్ వైరల్!

నా వల్ల కావట్లేదు.. పెళ్లి చేసేయ్ అమ్మ.. సుప్రీత కామెంట్స్ వైరల్!
Advertisement

Kissik Talks: సుప్రీత బండారు (Supritha bandaru) .. సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఎవరో కాదు టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి (Surekha Vani)కూతురు. కరోనా వచ్చిన దగ్గర్నుంచి తల్లీ కూతుర్లు ఇద్దరు సోషల్ మీడియాలో పలు వీడియోలు, రీల్స్ చేస్తూ వైరల్ అయ్యారు. ముఖ్యంగా సినిమాలలోకి రాకపోయినా సురేఖవాణి కూతురిగా ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది సుప్రీత. ప్రస్తుతం పలు షోలు, సినిమాలు అంటూ బిజీగా గడిపేస్తున్న ఈమె.. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ 76 వ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చింది. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. అందులో సుప్రీత పెళ్లి గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

పెళ్లి చేసేయ్ అమ్మ – సుప్రీత

కిస్సిక్ టాక్స్ లేటెస్ట్ ప్రోమోలో భాగంగా హోస్ట్ వర్ష మాట్లాడుతూ.. సుప్రీత సింగిల్ ఆ? లేక కమిటెడ్ ఆ?అంటూ ప్రశ్నించగా.. నేను సింగిల్.. ఎప్పటికీ సింగిలే అంటూ తెలిపింది. ఎందుకు? అని వర్ష అడిగితే..” అబ్బాయిలు దొరకట్లేదు. మా అమ్మకు చెప్పాను అబ్బాయిలను వెతకండి.. ఇక చాలు సింగిల్ గా ఉండి , నాకు బోర్ కొట్టేసింది.. పెళ్లి చేసేయి అమ్మా అని నేను మా అమ్మను అడిగాను.” అంటూ తెలిపింది.

సురేఖ వాణి రియాక్షన్..

Advertisement

అయితే మా అమ్మ వద్దు. ఈమధ్య ఎక్కువగా విడాకులు అవుతున్నాయి అని చెప్పింది. కానీ నేనేమో అన్నింటిని నేను హ్యాండిల్ చేసుకోగలను.. ముఖ్యంగా నేను గ్రిప్ లో పెట్టుకుంటాను అని చెప్పాను అంటూ నవ్వులు పూయించింది సుప్రీత. మొత్తానికైతే సింగిల్ లైఫ్ బోర్ కొడుతుందని , త్వరగా మంచి అబ్బాయిని చూసి పెడితే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మరి ఈమె పెళ్లి ఎప్పుడు కుదురుతుందో అంటూ అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

నేనెక్కడుంటే అక్కడే నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు – సుప్రీత

ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ క్రియేట్ అవుతుంది. అంటూ ఆమె కాస్త ఫీలవుతూ చెప్పింది. అయితే వర్షా ఆమెను ఆ ఫీలింగ్ నుంచి బయట పడేయడానికి నెగిటివ్ కూడా ఒక పాపులారిటీ నే కదా అంటూ నవ్వించింది. సుప్రీత మాట్లాడుతూ.. అందుకే వదిలేశాను దులుపుకొని అంటూ తనదైన శైలిలో స్పందించింది.

Advertisement

also read: ‘దృశ్యం: ది కన్‌క్లూజన్‌’ మూవీ రివ్యూ.. ఆఖరి చిత్రం ఎలా ఉందంటే?

టీవీ మీదే నా ఫోకస్ – సుప్రీత

ఇదే ఇంటర్వ్యూలో సుప్రీత మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం టీవీ మీదే ఫోకస్ చేయడంతో అదృష్టవశాత్తు నాకు మాస్ జాతర షోలో అవకాశం వచ్చింది అంటూ చెప్పింది. ముఖ్యంగా ఈ షో లో అమర్ వచ్చిన తర్వాత నాకు మరింత కంఫర్ట్ నెస్ పెరిగింది అంటూ తెలిపింది సుప్రీత. వర్ష మాట్లాడుతూ.. చూసావా దీపిక.. మన చెల్లి అన్నావు.. నువ్వు వెళ్ళాక బాగుంది అంటోంది సుప్రీత అంటూ ఆట పట్టించింది. మొత్తానికైతే సుప్రీత కు సంబంధించిన ఈ లేటెస్ట్ ప్రోమో వైరల్ గా మారింది.

Related News

3 సార్లు బ్రేకప్.. కోలుకోలేకపోయాను – సుప్రీత

సుప్రీతకు సినిమా అవకాశాలు రాలేదా..అందుకే ఇలా చేస్తున్నారా?

ఇండస్ట్రీకి దూరంగా సురేఖ వాణి… అసలు కారణం చెప్పిన సుప్రీత!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు నటి…పోస్ట్ వైరల్!

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode October 2nd ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్‌: మనోజ్‌, రోహిణిలను విడదీసేందుకు ప్రభావతి వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అయ్యేనా..?              

Podarillu Serial Today Episode October 2nd ‘పొదరిల్లు’ సీరియల్‌: గోపిక మనసును మహా మారుస్తుందా..?             

Karthika Deepam 2 Serial Today Episode October 2nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినితో చాలెంజ్ చేసిన జ్యోత్స్న – సూరజ్ లో మార్పు వచ్చినట్టేనా..?              

Big Stories

Advertisement
×