Telugu Tv Serials : బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ ఎంతగా ఆకట్టుకుంటున్నయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల కాలంలో టీవీ చానల్స్ కొత్తకొక సీరియల్స్ మొత్తం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా టీవీ చానల్స్ బోలెడు సీరియల్స్ ని అందిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. కొత్త సీరియల్స్ ఎన్ని వస్తున్నా పాత సీరియల్స్ కి మాత్రం డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు సీరియల్స్ కి డిమాండ్ పెరుగుతున్న సరే కొన్ని సీరియల్స్ కి స్టొరీ డల్ అవ్వడంతో ఆ సీరియల్స్ ఇప్పుడు శుభం కార్డు వేసుకోబోతున్నాయి అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. మరి త్వరలోనే ఎండు కార్డు వేసుకోబోతున్నా ఆ రెండు సీరియల్స్ ఏవో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి టీఆర్పి రేటింగ్ షో దూసుకుపోతున్నాయి. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటికి రామాయణం సీరియల్ అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గత కొద్ది రోజులుగా టీఆర్పి రేటింగ్ విషయంలో వెనకడుగు వేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.. ఇటీవల కాలంలో ఈ సీరియల్స్ స్టోరీ బాగా వీక్ అయిందని జనాలు నుంచి అభిప్రాయాలు సోషల్ మీడియా ద్వారా వెల్లు వెత్తుతున్నాయి. ఇంటింటి రామాయణం సీరియల్ ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు పల్లవి బండారం మరోసారి బయటపడడంతో ఆమెను ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఆ తర్వాత స్టోరీ మళ్ళీ మొదటికి వచ్చినట్లు తెలుస్తుంది. పల్లవి మాత్రం ఆ ఇంటిపై ఆ ఇంట్లోనే మనుషులపై పల్లవి తీర్చుకుంటుంది అన్నది ప్రస్తుతం మారింది. అయితే ఈ స్టోరీ ఇప్పుడు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు అని అర్థమవుతుంది దాంతో దీనికి శుభం కార్డు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. అదేవిధంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా శ్రీవల్లి బాగోతం బయటపడడంతో సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీవల్లి క్యారెక్టర్ వెళ్ళిపోతే ఇక సీరియల్ కి పెద్దగా స్టోరీ కలిసి వచ్చే అవకాశాలు లేదు కాబట్టి ఈ సీరియల్ కి కూడా శుభం కార్డు పడిపోతుంది అంటూ ఓ వార్త వినిపిస్తుంది మరి ఈ రెండు సీరియల్కు శుభం కార్డు పడిపోతాయా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముందు వరసలో ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఈ సీరియల్ కొన్న రేటింగ్ నుంచి వస్తే రోజు రోజుకి పెరుగుతూ వస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలు రోహిణి బండారం బయట పెట్టడంతో సీరియల్ స్టోరీ ఇంకాస్త క్యూరియాసిటితో ముందుకు సాగుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న స్టోరీ ఇప్పుడున్న స్టోరీకి అస్సలు సంబంధం లేకుండా అనేక ట్విస్ట్ లతో ముందుకు సాగడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మనోజ్ చిన్నపిల్లడి లాగా మారిపోవడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. మరి ఈ సీరియల్ స్టోరీ ఇకమీదట ఎలా మారబోతుంది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.