Telugu TV Serials : ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈమధ్య టీవీ చానల్స్ పోటీపడి మరి కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తున్నాయి. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో జనాలు ప్రతి సీరియల్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చే సీరియల్స్ అన్నీ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ అలరిస్తున్నాయి. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ఈమధ్య జనాలని ఆకట్టుకుంటూ టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి. ప్రతి వరం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉంటుందో సీరియల్స్ కూడా అలానే టిఆర్పి రిపోర్టు అనేది ఉంటుంది. మరి ఈవారం ఏ టీవీ సీరియల్ కు ఎంత రేటు నమోదు అయిందో ఒక్కసారి తెలుసుకుందాం..
స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో కార్తీకదీపం సీరియల్ ముందు వరుసలో ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న అన్ని సీరియల్స్ లలో కార్తీకదీపం సీరియల్ ముందు వరుసలో ఉండడం గత కొన్ని నెలలుగా జరుగుతుంది. వంటలక్క డాక్టర్ బాబు బంధం ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్న సస్పెన్స్ తో ఈ సీరియల్ ముందుకు నడుస్తుంది. దీని తర్వాత బాలు సీరియల్ అంటే గుండె నిండా గుడి గంటలు సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది.. ఇక మూడో స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది.. ఇక నాలుగో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉండగా ఐదవ స్థానంలో పొదరిల్లు సీరియల్ మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంది.. వీటితో పాటుగా మిగిలిన సీరియల్స్ అన్నీ కూడా జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇవన్నీ మధ్యాహ్నం ప్రసారంతో ఎక్కువ మంది జనాలు వీటిని మిస్ అవుతున్నారు అని ఒక వాలనా సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. దీనిపై స్టార్ మా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..
స్టార్ మా ఛానెల్ లో టాప్ లో కొనసాగుతున్న ప్రతి సీరియల్ జనాలను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇటీవల టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. ఇకపోతే గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి బాగా పెరిగింది.. ఇటీవల ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. మొదటి ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 11.30 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 11.66 ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.55, ఇంటింటి రామాయణం 10.46, పొదరిల్లు 9.47, నువ్వులేక నేను లేను 8.50, నిండు మనసులు 7.31, చిన్ని 6.53, బ్రహ్మముడి 6.67.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2 అలాగే గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా పోటీ పడుతున్నాయి.ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటుకి నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగు కాస్త ఎక్కువగానే ఉంది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..