trinayani serial today Episode: దేవీపురం వెళ్లిన వల్లభ అక్కడి నుంచి రత్నాంబ, వైకుంఠం, ముక్కోటిలను తీసుకుని వస్తాడు. వాళ్లను చూసిన నయని షాక్ అవుతుంది. నయనిని చూసిన రత్నాంభ త్రినేత్రి అంటూ దగ్గరకు వెళ్తుంది. ముక్కోటి షాక్ అవుతాడు. దగ్గరకు వెళ్లిన రత్నాంభ అమ్మా త్రినేత్రి ఎన్నాళ్లయింది నిన్ను చూసి అంటూ ప్రేమగా పలకరిస్తుంది. నయని చూస్తుంటుంది. ఏం మాట్లాడవేంటి త్రినేత్రి అని వైకుంఠం అడుగుతుంది. పక్కనే పెళ్లి కొడుకు విశాల్ బాబు ఉన్నారు కదా అంటాడు ముక్కోటి. పెళ్లి కొడుకా అంటూ సుమన అడుగుతుంది. అవునని నా మనవరాలు త్రినేత్రిని చూడటానికి ఆరోజు మా ఇంటికి వచ్చారు విశాల్ బాబు అని రత్నాంభ చెప్తుంది.
దీంతో ఏంటి తమ్మి రెండో పెళ్లికి రెడీ అయ్యావా అని అడుగుతాడు. నువ్వు ఉండు అన్నయ్య ఇప్పుడిప్పుడే నాకు క్లారిటీ వస్తుంది. అంటూ నేను ఆరోజు మంచి నీళ్ల కోసం మీ ఇంటికి వచ్చాను అని విశాల్ చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. ఇంతలో విక్రాంత్ ఈ బామ్మను హాస్పిటల్‌లో చూశాను అని చెప్తాడు. రత్నాంభ కూడా అవును బాబు మీ వదినకు యాక్సిడెంట్ అయిందని చావుబతుకుల్లో ఉందని చెప్పావు కదా..? అంటుంది. అవునని మాట్లాడుతుడగానే నువ్వేం మాట్లాడవేంటి కొత్త అక్కా అంటుంది సుమన. దీంతో నేను ఏమైనా అంటే మీరు గోల చేస్తారు. ఆ గోలకు పిల్లలు నిద్ర లేస్తారని ఊరికే ఉన్నాను అంటుంది.
దీంతో ముక్కోటి షాకింగ్ గా ఏంటి త్రినేత్రి నీకు పిల్లలు కూడా ఆయ్యారా..? అని అడుగుతాడు. పెళ్లి కాకుండానే పిల్లలు ఎలా పుడతారని అని వైకుంఠం అంటుంది. దీంతో దత్తత తీసుకున్నారేమో అంటాడు ముక్కోటి. ముక్కోటిని రత్నాంభ తిడుతుంది. నేను మాట్లాడేటప్పుడు ఎంగిలా కాకిలాగా మాట్లాడొద్దు అంటూ విశాల్ బాబు మీరే నిజం చెప్పాలి. మీరు నా మనవరాలిని పెళ్లి చేసుకోవడానికే కదా మా ఇంటికి వచ్చింది అని అడుగుతుంది. దీంతో లేదని వేరే అబ్బాయి మీ ఇంటికి వస్తుంటే మధ్యలో కారు ఆగిపోయింది.
కారు బాగయ్యాక తను రిటర్న్ వెళ్లిపోయాడు. నాకు దాహం వేసి మీ ఇంట్లోకి వచ్చాను అంటాడు. దీంతో మనమే పెళ్లి కొడుకు అని తప్పుగా అనుకున్నావేమో అంటుంది వైకుంఠం. అయితే అయింది కానీ నా మనవరాలి దగ్గరకు వచ్చాం కదా అంటుంది రత్నాంభ. మీ మనవరాలేంటి మా నయని కదా అంటుంది హాసిని. విక్రాంత మాత్రం వదిన మీరు చెప్పండి వీళ్లకు అంటాడు. దీంతో ఎవ్వరూ కంగారు పడకండి హాసిని అక్కా వీళ్లకు టిఫిన్ పెట్టండి నేను త్రినేత్రిని తీసుకొస్తాను అని నయని వెళ్లిపోతుంది.
తిలొత్తమ్మ ఆలోచిస్తుంటుంది. వల్లభ గట్టిగా మమ్మీ అని పిలవగానే ఎందుకురా అలా అరుస్తున్నావు అని తిడుతుంది. మమ్మీ నిన్ను గెలిపించాలని రాత్రికి రాత్రి నేను దేవీపురం వెళ్లి వాళ్లను తీసుకొస్తే.. తను నయని కాదని త్రినేత్రి అని ఫ్రూవ్ చేసి ఇంట్లోంచి గెంటిచి వేస్తా అన్నావు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి?.? పెద్ద మరదలు నేత్రిని తీసుకొస్తాను అంది అంటే త్రినేత్రి ఇంట్లోనే ఉంది అని అర్థం కదా అంటాడు వల్లభ. ఇద్దరూ ఇంట్లో ఎలా ఉంటారు అని తిలొత్తమ్మ అడుగుతాడు. దీంతో నాకు అర్థం అయింది మమ్మీ నీ డౌటు విశాల్ బ్రో గురించే కదా అని చెప్పగానే విశాల్ అలా చేయడు వల్లభ నాకు తెలుసు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది నయని, త్రినేత్రిని ఎలా తీసుకొస్తుంది అని. తను అలా అంది అటే చాలా అడ్వాన్స్ గా ఉందని అనుకోవాలి అంటుంది తిలొత్తమ్మ.
విక్రాంత్ రాగానే త్రినేత్రి ఎక్కడుందని అడుగుతుంది సుమన. మన ఇంట్లోనే ఉందని నయని వదిన చూపిస్తానని చెప్పారు కదా అంటాడు. దీంతో మా అక్క అందరికీ చుక్కలు చూపిస్తుంది కానీ త్రినేత్రిని ఎలా చూపిస్తుంది అయినా మా అక్క ఇన్ని కోట్ల ఆస్తిని ఎలా వదిలేసి వెళ్తుంది అంటూ సుమన అనగానే విక్రాంత్ కోపంగా సుమనను తిట్టి వెళ్లిపోతాడు. మరోవైపు సుష్టుగా భోంచేసిన ముక్కోటి ఇన్నాళ్టికీ తృప్తిగా భోజనం చేశానని వైకుంఠానికి చెప్తాడు. అలాగే ఈ ఆస్తిని చూశావా ఎంత ఉందో అంటాడు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?