E-Paper
Advertisement

Horoscope  Today December 28th:  ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త

Horoscope  Today December 28th:  ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 28న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. చాలకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారంలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు.

Advertisement

కర్కాటక రాశి :  ఈరోజు ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో అనుకూలత కలుగుతుంది.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ నిర్వహణలో లోపం వలన అధికారులు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. భూ సంబంధిత వివాదాలు మరింత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. మానసిక చికాకులు పెరుగుతాయి.

కన్యా రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక వృద్ధి, పాత రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. ఉద్యోగమున అధికారులతో వాదాలకు వెళ్లకపోవడం మంచిది. పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకర రాశి : ఈ రాశి వారు ఈరోజు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నూతన రుణ యత్నాలు కలసిరావు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలుతో కాని పూర్తికావు. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తరువాత కాలానికి ఉపయోగపడతాయి. వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×