Health Tips: మన శరీరం సరిగ్గా పనిచేయడానికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. విటమిన్ లోపం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా మన శరీరం పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ ఎ, బి12, సి లోపం వల్ల శరీరంలో కలిగే లక్షణాలు, వాటిని నివారించే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. విటమిన్ ఎ లోపం:
పొడి చర్మం, దురద
జుట్టు రాలే సమస్య
నివారించేందుకు మార్గాలు:
మీరు తినే ఆహారంలో క్యారెట్, బత్తాయి, బచ్చలికూర, బొప్పాయి , పాలు చేర్చండి.
నారింజ, పసుపు రంగు పండ్లు, కూరగాయలు తినండి.
విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినండి.
2. విటమిన్ B12 లోపం :
తీవ్రమైన అలసట, బలహీనత
చేతులు, కాళ్ళలో జలదరింపు లేదా తిమ్మిరి
జ్ఞాపకశక్తి కోల్పోవడం
నివారించేందుకు మార్గాలు:
గుడ్లు, చేపలు,పాలు తినండి.
శాఖాహారులు, బలవర్థకమైన తృణధాన్యాలు, సోయా ఉత్పత్తులను తినడం మంచిది.
3. విటమిన్ సి లోపం:
చిగుళ్ళలో రక్తస్రావం
తరచుగా జలుబు చేయడం
ఆలస్యం గాయాలు నయం అవడం
నివారించేందుకు మార్గాలు:
ఉసిరి, ఆరెంజ్, నిమ్మ, జామ వంటి పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తినండి.
ప్రతిరోజు ఒక గ్లాసు నిమ్మరసం తాగండి.
తాజా పండ్లు , పచ్చి కూరగాయలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.