trinayani serial today Episode: ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేయమని సుమన వచ్చి విక్రాంత్‌ను అడగ్గానే కోపంతో విక్రాంత్ సుమనను తిడతాడు. ఇంకొక్క నిమిషం ఇక్కడున్నావంటే చంపేస్తానంటాడు. దీంతో సుమన సరేలేండి అంటూ.. మీసే తిప్పేవాడే ఏమీ చేయడు అన్నట్టు మీ గురించి నాకు తెలియదా..? అంటుంది. అదే ఆన్‌లైన్‌లో లెదర్ బెల్ట్ ఆర్డర్ చేస్తాను. అది వచ్చాక విరిగిపోయే వరకు కొడతాను అంటాడు దీంతో సుమన అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
బామ్మ కాళ్లు నొక్కుంతుంటాడు ముక్కోటి. గట్టిగా నొక్కితే మా అమ్మ ప్రాణాలు పోతాయి అని వైకుంఠం అంటుంది. నోక్కినా పర్వాలేదురా.. నా సొమ్ము నోక్కేయకపోతే సరి అంటుంది బామ్మ. ఇంతలో మామ్మ తీసుకునేది చిల్లర అనుకుంటూ త్రినేత్రి వస్తుంది. మందులు వేసుకో అని టాబ్లెట్స్ ఇస్తుంది బామ్మను అవి వేసుకోననని మారాం చేస్తుంది. దీంతో బలవంతంగా నేత్రి టాబ్లెట్స్ ఇస్తుంది.
తర్వాత రేపు అడవిలో అమ్మవారి దగ్గరకు వెళ్లి నైవేద్యం పెట్టి వస్తానని చెప్తుంది నేత్రి. అడవి అత్తవారి ఇల్లు అయినట్టు ప్రతిసారి వెళ్తున్నావేంటి..? వయసుకు వచ్చిన ఆడపిల్లవి వెళ్లొద్దని అంటుంది బామ్మ. ఒక్కదాన్నే పోనని అత్తమామలను తీసుకుని వెళ్తాను అంటుంది. చాటు నుంచి అంతా వింటున్న ముక్కోటి మనం నేత్రితో వెళ్దామని రేపు అమ్మవారి ప్రసాదంలో విషం కలుపు ఆ ప్రసాద్ నేత్రి తిని చనిపోతుంది. ఈ ఒక్కసారి నాకోసం ధైర్యం తెచ్చుకుని ప్రసాదంలో విషం కలుపు అని చెప్తాడు ముక్కోటి.
ఐసీయూలో ఉన్న నయని దగ్గరకు యమపాశం వస్తుంది. నిన్ను యమపురికి తీసుకెళ్లడానికి వచ్చానని నువ్వు ఇక రావాల్సిందేనని చెప్తుంది. నేను నా భర్తను పిల్లలను వదిలి రాలేనని నయని ఆత్మ చెప్తుంది. నువ్వు రానన్నా నిన్ను తీసుకెళ్తాను అని యమపాశం నయనిని తీసుకుని వెళ్తుంది. మరోవైపు ఇంట్లో పాపను తన మీద పడుకోబెట్టుకుని నిద్రపోతుంటాడు విశాల్. ఇంతలో హాసిని, సుమన వల్లభ, విక్రాంత్ వస్తారు. విశాల్ ను నిద్ర లేపి గాయత్రిని ఇస్తే లోపల పడుకోబెడుతుంది హాసిని అంటారు. వద్దు పాప నా దగ్గరే ఉండని మా అమ్మ నా దగ్గర ఉంటే నా గుండెల్లో ప్రాణాన్ని కాపాడుతుంది అంటూ ఎమోషనల్ అవుతాడు.
దీంతో హాసిని.. విశాల్ ను తిడుతుంది. నువ్వు అలా మాట్లాడకు అంటూ తను ఎమోషనల్ అవుతుంది. నేనే బలవంతంగా బ్రోను ఇంటికి తీసుకొచ్చాను. అక్కడే ఉంటే ఇంకా బాధపడతాడని తీసుకొచ్చాను అంటాడు. ఇంతలో సుమన మా అక్కకు ఎప్పుడు స్పృహ వస్తుందో డాక్టర్లను గట్టిగా అడగాల్సింది అంటుంది. ఇంతలో విశాల్ ఏడుస్తూ నయనిని చూడకుండా ఒక్కరోజైనా ఉండగలనా..? అంటూ బాధపడుతాడు. దీంతో వల్లభ నువ్వు పెద్ద మరదలును అక్కడకు పిలవడం వల్లే ఇదంతా జరిగింది అంటాడు. నువ్వు పైకి రా.. పక్కకు రా.. అంటూ ఊరంతా తిప్పడం వల్లే ఇలా జరిగింది అంటాడు. దీంతో విశాల్ కూడా అవునని నేను అలా పిలవాల్సింది కాదని.. విశాల్ మరింత బాధపడతాడు.
ఇంతలో విక్రాంత్ ఎందుకు మీరంతా ఏదేదో మాట్లాడుతున్నారు. సైలెంట్ గా ఉండలేరా..? అంటాడు. ఏది ఏమైనా నయని అమ్మ జీవితాంతం నిండు ముత్తైదువుగా ఉంటుందంటాడు పావణమూర్తి. దీంతో ఒక వేళ జరగరానిది జరిగితే అని సుమన అడుగుతుంది. విక్రాంత్ కోపంగా సుమనను తిడతాడు. నువ్వు నోరు మూసుకోమని హెచ్చరిస్తాడు. అది కాదండి అన్ని రకాలుగా మనసును సిద్దంగా ఉంచుకోవాలని చెప్తున్నాను అని సుమన చెప్పగానే.. నువ్వు తొడబుట్టిన దానివి ఇలా మాట్లాడితే ఎలా అని హాసిని అడుగుతుంది. ఇంతలో విశాల్ ఏడుస్తూ.. నయని కనక శాశ్వతంగా దూరమైతే నా బిడ్డలను చూసుకునే బాధ్యత హాసిని వదినదే అన్నయ్య అని విశాల్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. నువ్వేం చేస్తావు విశాల్ అని తిలొత్తమ్మ అడుగుతుంది. దీంతో నయనికి జరగరానిది ఏదైనా జరిగితే ఈ జన్మలో నేను కూడా ఎవ్వరికీ కనిపించను అంటూ పాపను హాసినికి ఇచ్చి వెళ్లిపోతాడు.
నేత్రి, ముక్కోటి, వైకుంఠం ముగ్గురు కలిసి అడవిలోకి అమ్మవారి దగ్గరకు వెళ్తారు. నేత్రి అమ్మవారిని అలంకరిస్తుంది. దీపం వెలిగించి అమ్మవారి ముందు నైవేద్యం పెడుతుంది. తర్వాత హారతి ఇస్తుంది. నైవేద్యం అమ్మవారు తింటారో లేదో కానీ విషం కలిపిన ప్రసాదం నువ్వు తింటే అమ్మవారి దగ్గరకు వెళ్లడం ఖాయం నేత్రి అని మనసులో అనుకుంటాడు ముక్కోటి.
యమపాశం నయనిని యమలోకం తీసుకుని వెళ్తుంది. యమలోకం చూసిన నయని భయంగా నడుచుకుంటూ వెళ్లిపోతుంది. మరోవైపు కింద ఇంట్లో గాయత్రి పాప గుమ్మం దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పావణమూర్తి బాధగా ఏడుస్తూ.. అమ్మ కోసం ఎదురుచూస్తున్నావా..? మీ అమ్మ నీకోసమే కాదు. నాకు అమ్మే అంటూ బోరునా ఏడుస్తుంటే గాయత్రి పాప, పావణమూర్తి కన్నీళ్లు తుడుస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.