trinayani serial today Episode: త్రినేత్రి అడవిలోకి పూల కోసం వెళ్లి తిరిగి రాలేదని ముక్కోటి బామ్మకు చెప్తాడు. బామ్మ ఏడుస్తుంది. మరోవైపు నయని కోమాలోకి వెళ్లిందన్న విషయం విశాల్‌కు చెప్పొద్దని విక్రాంత్ డాక్టర్‌ను రిక్వెస్ట్ చేస్తాడు. చెప్పకుండా ఎలా ఉంటామని డాక్టర్ అడగ్గానే బెటర్ ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ చేంజ్ చేస్తున్నామని చెప్పమంటాడు విక్రాంత్. డాక్టర్ సరే అంటుంది. ఇంటికి వచ్చిన విక్రాంత్ అందరికీ అదే విషయం చెప్తాడు. అయితే నయనిని హాస్పిటల్ చేంజ్ చేస్తారు కదా..? అందరం వెళ్దాం పదండి అని హాసిని అంటుంది. ఎవ్వరూ వెల్లొద్దని విక్రాంత్ చెప్తాడు. ఎందుకని అడిగితే మనం వెళితే బ్రో డిస్టర్బ్ అవుతాడని అందుకే వద్దంటున్నాను అంటాడు విక్రాంత్.
మరోవైపు త్రినేత్రి శవం దగ్గరకు నయనిని తీసుకుని వస్తాడు గుప్త. ఈ అమ్మాయి చనిపోయిందా గుప్తగారు అని నయని అడుగుతుంది. ఎప్పుడో అమ్మవారిల ఐక్యం అయిందని ఎంతో పుణ్యం చేసుకుందని చెప్తాడు గుప్త. అయితే నేను కోరినందుకు మీరు ఆమె ప్రాణాలు తీశారా ఏంటి? అని అనుమానంగా అడుగుతుంది నయని. అదేం లేదని నీ విషయంలో పొరపాటే కానీ త్రినేత్రిది విధిరాత. తన ఆయుష్షు ఇంత వరకే ఉంది అని చెప్తాడు గుప్త. నువ్వు నీ పిల్లలు, భర్తని కాపాడుకోవడానికి ఈ శరీరాన్నే ఆశ్రయించాలి. కాదు కాకూడదు అంటే కోమాలో ఉన్న దేహంలోనే ఉండాలి. మరో మూడు నెలలు ఎదురు చూడాల్సిందే అని గుప్త చెప్పగానే అయ్యో నేను కనిపించడం ఇంకొక్క రోజు అయితే బాబుగారు బతకరని.. మా తిలొత్తమ్మ అత్తయ్య బాబు గారిని ఏదైనా కుట్ర చేసి చంపేస్తుందని వెంటనే నన్ను ఈ నేత్రి దేహంలోకి పంపించండి అని చెప్తుంది.
సరేనని నువ్వు త్రినేత్రి దేహంలోకి వెళ్లిన తర్వాత నువ్వు త్రినేత్రి వలె నడుచుకుందువు. గాయత్రీ పాప అయినా గాయత్రీ దేవి అయినా త్రినేత్రి చేతులు తాకితే మూడు గంటలు నువ్వు నయనివి అని నీకు గుర్తుకు వస్తుంది. అని గుప్త చెప్పగానే నాకు మూడు గంటలు చాలు నయనిగా ఉన్నప్పుడు నా సమస్యలు అన్నీ తీర్చుకుంటాను అని చెప్తుంది నయని. అదంతా నీ శక్తియుక్తుల మీద ఆధార పడి ఉంటుంది. నిన్ను ఈ దేహంలోకి ప్రవేశింప జేసి నిన్ను నీ గృహం వద్ద ప్రత్యక్షమయ్యేలా చేస్తాను పడుకో మాత అని చిత్రగుప్తుడు చెప్పగానే నయని నేత్రి శరీరం పక్కన పడుకుంటుంది. గుప్తుడు వెంటనే మంత్రాలు చదివగానే నయని ఆత్మ నేత్రి శరీరంలోకి వెళ్తుంది.
సుమన, విక్రాంత్ దగ్గరకు వచ్చి మా అక్క ఎప్పుడు కళ్లు తెరుస్తుంది అని అడుగుతుంది. నేను ఏమైనా డాక్టర్‌నా నన్ను అడుగుతావేంటి అంటాడు విక్రాంత్. మీరు డాక్టర్ కాదు కానీ యాక్టర్ అండీ. గాయత్రీ పాప గురించి ముందే తెలిసినా ఏం తెలీనట్లు నటించారు. గానవీనీ తీసుకొని వచ్చి నా బిడ్డగా నటించలేదా అంటుంది సుమన. ఆ రెండు విషయాల వల్ల మేలే జరిగింది కదా అంటాడు విక్రాంత్. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మా అక్క బతుకుతుంది అని మళ్లీ సుమన అడగ్గానే నోరు మూయ్ అంటూ తిడతాడు విక్రాంత్.
అయితే విశాల్ బావగారు మా అక్కను చూస్తానంటే ఆయన బాధపడతారని వెళ్లనివ్వలేదు. కానీ తోడబుట్టిన నన్ను ఎందుకు వెళ్లనివ్వడం లేదు అని డౌటుగా అడుగుతుంది సుమన. వెల్లి ఏం చేస్తావు అని విక్రాంత్ ఎదురు ప్రశ్నిస్తాడు. మా అక్క శవాన్ని అని సుమన అనే లోపు విక్రాంత్ కోపంగా సుమనను కొడతాడు. నయని వదిన ప్రాణాలతో ఉంది. ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. నువ్వు అనవసరంగా ఏదేవో మాట్లాడితో చంపేస్తా అంటాడు. దీంతో సుమన ఏడుస్తూ అక్కడి నుంచి వెల్లిపోతుంది.
ఇంట్లో నేత్రి ఫోటోకు దండ వేసి దీపం పెడతాడు ముక్కోటి. అది చూసిన బామ్మ ముక్కోటిని తిడుతుంది. నా మనవరాలు చనిపోలేదని అడవిలోకి వెళ్లింది తిరిగి వస్తుందని నా మనసు చెప్తుంది. దీపం తీసేయ్ అని చెప్తుంది. దీంతో ముక్కోటి దీపం పెట్టకపోతే త్రినేత్రి ఆత్మ శాంతించదని చెప్తాడు. దీంతో బామ్మ భోరున ఏడుస్తుంది. నా ఆయుష్షు కూడా పోసుకొని త్రినేత్రి బతకాలి అనుకుంటూ ఫోటో దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది.
నేత్రిలో ఉన్న నయని ఆత్మ విశాల్ వాళ్ల ఇంటికి వస్తుంది. విశాల్ ను చూసి బాబు గారు అని పిలుస్తుంది. ఆ పిలుపునకు అందరూ షాకింగ్ అటూ ఇటూ చూస్తుంటారు. నయని పిలిచిందని అనుకుంటారు. లంగావోణీలో ఉన్న త్రినేత్రని చూసి అందరూ భయంతో వణికిపోతుంటారు. కోమాలో ఉన్న నయని వదిన లేచి రావడం ఏంటని విక్రాంత్ ఆలోచిస్తుంటాడు. నయనిని చూసిన వల్లభ కళ్లు తిరిగి కిందపడిపోతాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.