BigTV English

Etela Rajender-KTR: ఈటెల చుట్టూ రాజకీయాలు.. బీఆర్ఎస్‌కు టచ్‌లో, అదెలా?

Etela Rajender-KTR: ఈటెల చుట్టూ రాజకీయాలు.. బీఆర్ఎస్‌కు టచ్‌లో, అదెలా?

Etela Rajender-KTR: తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? కేటీఆర్ అరెస్టు అవుతారన్న వార్తలతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయా? ముఖ్యంగా బీజేపీ ఎంపీ ఈటెల పాత గూటి వైపు చూస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. నేతల మాటలు కేవలం పార్టీల వరకే.. తెర వెనుక అంతా మామూలే.

తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ కొత్త వార్త ఒకటి హల్‌చల్ చేస్తోంది. దాని సారాంశం ఏంటంటే.. కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే.. ఈటెల పాత గూటికి చేరుకోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అదెలా సాధ్యమంటారా? అందులోకి వచ్చేద్దాం.


బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గురించి చెప్పనక్కర్లేదు. సీనియర్ రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. ఏ విషయానైనా ముక్కుసాటిగా మాట్లాడేతత్వం ఆయనది. బీజేపీ ఎంపీ అయిన తర్వాత ఆయన పెద్దగా కనిపించలేదు..  మాటలూ వినిపించలేదు.

ALSO READ: చిక్కుల్లో మల్లారెడ్డి.. బయటపడ్డ మరో బాగోతం

ఒకానొక దశలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆయనకు వస్తుందని చాలా మంది భావించారు. కాకపోతే పార్టీ హైకమాండ్ నేతల కదలికలను క్షుణ్ణంగా గమనిస్తోందట. సింపుల్‌గా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీని బలహీన పరిచేందుకు కుట్ర జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఆ  పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. కొద్దిరోజులుగా బీఆర్ఎస్ నేతలతో ఎంపీ టచ్‌లోకి వెళ్లారన్నది అసలు సారాంశం. ఈ క్రమంలో పార్టీ ఆయన్ని పక్కనపెట్టిందని అంటున్నారు.

శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర విషయానికొద్దాం. పాదయాత్ర సందర్భంగా నకిలీ బీజేపీ నేతలు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. గంగా, సబర్మతి నదులను వేల కోట్ల రూపాయలతో ప్రధాని మోదీ సుందరీకరణ చేస్తున్నారని అన్నారు. మూసీ పునరుజ్జీవం చేయవద్దా అంటూ ప్రస్తావించారు. ఈటెలను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు మొదలయ్యాయి.

రేపో మాపో ఈటెల కారు ఎక్కబోతున్నారంటూ గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఏదైనా కేసుల్లో కేటీఆర్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తే, దాన్ని భర్తీ చేసేందుకు ఆయన కారు ఎక్కడం ఖాయమని అంటున్నారు. ఈటెల పైకి పార్టీ మారినట్టు కనిపించినా, ఆయనను బీజేపీలోకి కేసీఆర్ పంపించారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు. మొత్తానికి ఈటెలపై వస్తున్న ఈ పుకార్లు పుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

Related News

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Big Stories

×