BigTV English

Trinayani Serial Today October 1st: ‘త్రినయని’ సీరియల్‌: ఉలూచి దానం చేస్తానన్న సుమన – మణిని గాయత్రిపాపే దాచిందన్న నయని

Trinayani Serial Today October 1st: ‘త్రినయని’ సీరియల్‌: ఉలూచి దానం చేస్తానన్న సుమన – మణిని గాయత్రిపాపే దాచిందన్న నయని

trinayani serial today Episode:   హాల్ లోకి అందరూ వచ్చి  లైట్స్‌ వేస్తారు. దీంతో వల్లభ, తిలొత్తమ్మ, సుమన షాక్‌ అవుతారు. అయితే నయని మాత్రం వాళ్లకు బంపర్ ఆఫర్‌ ఇస్తుంది. మణి ఎక్కడ ఉందో కరెక్టుగా చెప్పిన వారికి ఆ మణిని ఇస్తానని చెప్తుంది. అయితే అది ఎక్కడ ఉన్నా కరెక్టుగా చెబితే ఇస్తావా? అని అడుగుతారు. ఇస్తానని నయని చెప్తుంది. నయని అంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే మీరెవరు  గెస్‌ చేయలేరని అంటాడు విశాల్‌.


ఒక్కోక్కరు ఒక్కో ప్లేస్ చెప్తుంటారు. కానీ ఎవరూ కూడా కరెక్టుగా చెప్పరు. ఇంతలో తిలొత్తమ్మ విక్రాంత్‌ను చెప్పమంటుంది. దీంతో నాకు దాని మీద ఆశ లేదు. నేను చెప్పను అంటాడు విక్రాంత్‌. హాసినిని చెప్పమంటుంది తిలొత్తమ్మ. నాకు తెలియదు అంటుంది హాసిని. అయితే గాయత్రి పాపకు తెలుసేమో అంటుంది.

ఇంతలో నయని ఇంకెవ్వరూ వెతికి విసిగిపోకండి. ఎందుకంటే భుజంగమణిని నేను దాచిపెట్టలేదు. గాయత్రిపాపనే భద్రంగా దాస్తుంది అని చెప్తుంది. ఎక్కడ పెట్టింది అని సుమన అడుగుతుంది. దురంధర ఎక్కడ పెట్టింది తెలుస్తుంది కానీ ఎక్కడ పెట్టింది ఎలా చెప్తుంది అని అడుగుతుంది. నోటితో చెప్పకపోయినా నోటితో చూపిస్తుంది అని నయని చెప్పగానే  గాయత్రి పాప నోరు తెరచి నోటిలోని మణిని అందరికీ చూపిస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.


ఉలూచి పాపను రెడీ చేస్తుంది సుమన. నిన్ను రెడీ చేయించడానికే నాకు  టైం సరిపోతలేదని అంటుంది ఇంతలో పెద్ద బొట్టమ్మ వచ్చి సుమనకు  భుజంగమణి నీకు  వచ్చే దారి చెప్తాను అంటుంది. నువ్వు ఉత్తి మాటలు చెప్తావు కానీ నేను శ్రీమంతురాలిని కాలేదని అంటుంది. ఆ మణి నయని చేజార్చుకున్నంత వరకే అని చెప్తుంది. దీంతో మా అక్క అంత ఈజీగా ఆ మణిని చేజార్చుకోదు అంటుంది సుమన.

కానీ నువ్వు ఉలూచిని నా వెంట నాగలోకానికి పంపించావనుకో.. నువ్వు అక్కడికి రావాలి అంటే కచ్చితంగా భుజంగమణి వెంట ఉండాల్సిందే. అది లేకుండా రాలేరు అని చెప్తుంది పెద్దబొట్టమ్మ. అంటే  నా బిడ్డను నీకు ఇస్తే నువ్వు తీసుకుని వెళ్లిపోతావన్నమాట. నా బిడ్డను తీసుకెళ్లాక నువ్వు మళ్లీ తీసుకొస్తావని గ్యారంటీ ఉందా? అని ప్రశ్నిస్తుంది సుమన. నా మీద నమ్మకం లేకపోతే నీ చేతికి ఆ మణి అయితే రాదు అని చెప్తుంది పెద్దబొట్టమ్మ.

అలా కాదు కానీ ముందు  అయితే అందరి ముందు ఇవాళ ఉలూచిని నీకే దానం చేస్తాను. రేపే నా బిడ్డ నాకు కావాలని ఏడుస్తాను. అప్పుడైతే నాగలోకానికి రావడానికి నా చేతికి భుజంగమణి ఇస్తారు అంటుంది సుమన. దీంతో నీకు ఇప్పుడు అర్థమైంది అన్నమాట అంటుంది పెద్దబొట్టమ్మ. నీకే అర్థం కాలేదే.. ఆ భుజంగమణి నా చేతికి  వచ్చాక నేను ఇంక నాగలోకానికి ఎందుకు వస్తానే అని మనసులో అనుకుంటుంది సుమన.

హాల్లో ఫోన్‌  చూస్తూ కూర్చున్న దురంధర దగ్గరకు  వచ్చిన హాసిని ఫోన్‌ లాగేసుకుంటుంది. పిన్ని నీకేమైనా  బుద్ది, జ్ఞానం ఏమైనా ఉన్నాయా? అంటూ తిడుతుంది. దీంతో పొద్దునే నా మీద పడ్డావేంటే అంటుంది దురంధర. ఇంతలో నయని వచ్చి ఎప్పుడూ ఫోన్‌ వాడకూడదు పిన్ని అని చెప్తుంది. నిజమే దురందర అంటూ తిలొత్తమ్మ వస్తుంది. ఇంతలో సుమన వచ్చి అందరూ ఉన్నారా? అని అడుగుతుంది. విక్రాంత్‌ వచ్చి ఒక్క వివాల్‌ బ్రో తప్పా అందరం ఉన్నాము ఎందుకని అడుగుతాడు.

ఈరోజు చాలా మంచి రోజంట అందుకే దానం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది సుమన. దీంతో వల్లభ నీ దగ్గర దానం చేయడానిక ఏముంది చిన్న మరదలా? అని అడుగుతాడు. దీంతో ఉలూచి పాప ఉంది కదా అంటుంది సుమన. అందరూ షాక్‌ అవుతారు. పాపని దానం చేస్తావా? నీకేమైనా మతి పోయిందా? అని నయని తిడుతుంది. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు  చిట్టి అని హాసిని అడుగుతుంది. ఇంతలో పెద్దబొట్టమ్మ వచ్చి ఎవరికో ఎందుకు ఇస్తావమ్మా.. నా బిడ్డను నాకిస్తే సంతోషిస్తాను కదా? అంటుంది.

నేను మనసులో తలుచుకున్నానో లేదో నువ్వే వచ్చేశావు పెద్దమ్మ. నీకే ఉలూచిని ఇచ్చేద్దాం అనుకున్నాను అంటుంది సుమన. చాలా  సంతోషం సుమన. నువ్వు మనసు మార్చుకుంటావని నేను కలలో కూడా అనుకోలేదు అంటుంది పెద్దబొట్టమ్మ. ఉలూచిని ఇస్తే పెద్దబొట్టమ్మ నీకేం ఇస్తుందని ఆశపడ్డావు అని విక్రాంత్‌ అడుగుతాడు. నేనేం  ఆశించలేదని సుమన చెప్తుంది. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదని చెప్తుంది పెద్దబొట్టమ్మ.

ఇంతలో నయని చెల్లి ఒక్కసారి ఉలూచి  పాపను నువ్వు ఇస్తే మళ్లీ ఈ జన్మలో చూడలేము అని చెప్తుంది. పాపను  ఇచ్చేయొద్దని చెప్తుంది. కానీ వినకుండా పాపను ఇచ్చేందుకు  సుమన రెడీ అవుతుంది. ఇంతలో గాయత్రి పాప వచ్చి పెద్దబొట్టమ్మను దూరంగా తోస్తుంది. తన చేతిలో ఫోన్‌ తీసి నయనికి ఇస్తుంది. ఫోన్‌ చూసిన నయని షాక్ అవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×