Nindu Noorella Saavasam Serial Today Episode: యముడితో గుప్త మాట్లాడిన మాటలు వెనక నుంచి వింటుంది ఆరు. ఆరును గమనించిన గుప్త ఏదో చెప్పబోతుంటే ఇక ఆపండి గుప్తగారు. నన్ను ఎలా మోసం చేయాలనిపించింది మీకు అని నిలదీస్తుంది. ఇది మోసం కాదని ఇందులో నేను కావాలని చేసేది ఏమీ లేదని చెప్తాడు గుప్త. ఆరు ఏడుస్తూ గుప్త గారు మీరు నన్ను ఎప్పటికీ మోసం చేయరని అనుకున్నాను. కానీ మీరు కూడా నన్ను మోసం చేస్తున్నారు కదా? అంటూ మిమ్మల్ని నమ్మడం నా తప్పే గుప్తగారు అని ఏడుస్తుంది.
నీకు ఒక సోదరుడిగా చెప్తున్నాను బాలిక. ఇక్కడ అన్ని వదిలేసి ఇక మా లోకానికి వచ్చేయ్. నీకు ఈ ఇంటికి రుణం తీరింది బాలిక. మనం మా లోకానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది అని చెప్పి పైకి వెళ్లడానికి గుప్త మంత్రాలు చదువుతుంటే ఆరుకు మనోహరి గుర్తుకు వస్తుంది. ఈ పౌర్ణమికి నీ వాళ్లలో ఒకరిని నీకు తోడుగా పంపిస్తాను అని మనోహరి ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుని ఇంట్లోకి పరుగెత్తుకుని వెళ్తుంది ఆరు. గుప్త కళ్లు తెరచి చూసి బాలిక ఆగుము అంటూ ఆరు వెనక పరుగెడతాడు.
ఇంతలో ఆరు మనోహరి రూంలోకి వెళ్తుంది. ఇంట్లోకి వచ్చిన గుప్త శివరాంలోకి దూరిందా? అని చూస్తాడు అలాగే నిర్మల, రాథోడ్, మిస్సమ్మ, పిల్లలు ఇలా అందరినీ పరీక్షించి చూస్తాడు. ఎవ్వరిలోనూ ఆరు కనిపించకపోయే సరికి మనోహరి రూంలోకి వెళ్లి ఆరును పిలుస్తాడు. మనోహరి కిటికీలోంచి బయటకు చూస్తుంటుంది. బాలికా ఇచ్చట ఉన్నది నీవేనని నాకు తెలుసును ఎందుకు ఇటుల చేయుచుంటివి. బాలికా నీవు ఈ శరీరం లో ఉండరాదు. వెంటనే బయటకు రమ్ము అని పిలుస్తాడు. దీంతో ఆరు సారీ గుప్త గారు నేను రాలేను అంటుంది.
బాలికా నువ్వు ఈ బాలిక శరీరం నందు ఉండుట వలన నీకు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో నీకు తెలియుట లేదు. రమ్ము బయటకు రమ్ము బాలిక. నీవు తన శరీరం నందు ప్రవేశించాలనే ఆ బాలిక అలా మాట్లాడింది అని గుప్త ఎంత హెచ్చరించినా ఆరు బయటకు రాదు. నేను మనోహరి ప్లాన్ చేస్తే మను బాడీలోకి రాలేదు గుప్త గారు. నేను నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వచ్చాను.
నా ఇంటికి వచ్చిన సమస్య కలకత్తాలో మొదలైంది అనిపిస్తుంది. రణవీర్, మనోహరితో మొదలైంది అనిపిస్తుంది. అందుకే సమాధానాలు వెత్తుక్కుంటూ రణవీర్ దగ్గరకు వెళ్తున్నాను అని చెప్తుంది ఆరు. అది కాదు బాలికా.. నేను చెప్పేది విను అంటాడు. దీంతో ఆరు రణవీర్, మనోహరి తన భార్య కాదని చెప్పడం వెనక మనును ఇక్కడే ఉంచడం వెనక కారణాలు తెలుసుకుంటే మా ఇంట్లో ఉన్న సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. నా పని అయిపోగానే నేనే వస్తాను గుప్త గారు. నాకేం కాదు. నన్నెవరూ ఏమీ చేయలేరు అంటూ ఆరు వెల్లిపోతుంది. ఆరు వెనకే గుప్త పరుగెడతాడు.
స్కూల్‌కు రాథోడ్ కారులో వెళ్తున్న అంజుకు మనోహరి తాయెత్తు కట్టమని చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. వెంటనే రాథోడ్ ను కారు ఆపమని చెప్పి నేను ఇంటికి వెళ్లాలి అర్జెంట్ పని ఉంది అని చెప్తుంది. ఇప్పుడు ఏం పని అని అమ్ము అడగ్గానే మనోహరి ఇచ్చిన తాయోత్తు చూపిస్తుంది అంజు. అంజు చేతిలో తాయోత్తు చూసిన పిల్లలు, రాథోడ్ షాక్ అవుతారు. మనోహరి ఆంటీ ఇది కట్టమని చెప్పింది నేను మర్చిపోయాను అంటుంది అంజు. సాయంత్రం కడుదువులే రాథోడ్ వెళ్దాం పద అంటుంది అమ్ము. అది కాదులే రాథోడ్ అంటూ అంజు కారు దిగి ఇంటికి వెళ్లిపోతుంది.
బయట కారు దగ్గరకు వచ్చిన ఆరు ఆత్మ ఉన్న మనోహరిని గుప్త పిలుస్తాడు. బాలిక నువ్వు పెద్ద తప్పు చేయబోతున్నావు. నీవు పెద్ద ప్రమాదంలో పడిపోతున్నావు. నా మాట వినుము బాలిక. బాలిక ఆగుము. బాలికా ఈ ఒక్కమారు నా మాట వినుము అంటాడు. దీంతో ఆరు మళ్లీ విని మళ్లీ మోసపోతేను గుప్తగారు అంటుంది. బాలిక ఈసారి నేను నీకు నిజం చెప్తున్నాను. ఈ ఒక్క రోజు ఏమీ చేయకు అంటాడు.
మీరు ఏ క్షణమైనా నన్ను మీ లోకానికి తీసుకెళ్లిపోతారని నాకు అర్థం అయింది గుప్తగారు. అందుకే నేను చేసేది నేను చేస్తున్నాను అంటుంది ఆరు. నీవు ఏ నిజం తెలుసుకున్నా ఎంత ప్రయత్నించినా జరగబోయేది ఆపలేవు. జరగాల్సింది మార్చలేవు బాలికా నేను చెప్పేది విను అంటాడు గుప్త. దీంతో కోపంగా అవునా గుప్తగారు సరే అయితే అంటూ కారులో వెళ్లిపోతుంది.
అప్పుడే ఇంటి దగ్గరకు వచ్చి అంజు ఆంటీ అని పిలుస్తుంది. నన్ను వచ్చి ఈ తాయోత్తు కట్టమని చెప్పి పిలుస్తుంటే కూడా పలకడం లేదు అని అంజు అనుకుంటుంది. అంజు చేతిలో తాయోత్తు చూసిన గుప్త షాక్ అవుతాడు. ఆ ఘోర ఆరును బంధించడానికి పూజ మొదలుపెట్టాడు అనుకుంటాడు. మరోవైపు టిఫిన్ చేయకుండా టెన్షన్ పడుతున్న అమర్ ను అందరూ ఎం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఎందుకో ఇవాళ ఏదో చెడు జరుగుతుందేమోనని నా మనసు అలజడిగా ఉందని చెప్తాడు అమర్. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.