trinayani serial today Episode: భుజంగమణి కోసం వచ్చిన గజగండకు ఇంట్లో ఎవ్వరూ కూడా ఇవ్వమని చెప్తారు. దీంతో గజగండ నన్ను అవమానిస్తున్నారు అని కోపంగా ముందుకు వెళ్తుంటే గాయత్రి పాప చెయ్యి అడ్డం పెట్టగానే ఆగిపోతాడు. ఇంతలో సుమన ఏమయ్యా గజగండ అంత పెద్ద మంత్రగాడివి చిన్న పిల్ల అడ్డుపడితే ఆగిపోయావేం ఇక నీకు పంచకమణి దేనికి నాకి ఇచ్చేయ్ అని లాక్కొవడానికి ప్రయత్నిస్తే కత్తి తీసి సుమన గొంతు మీద పెట్టి చంపేస్తానని బెదిరిస్తాడు. నయని మాత్రం ఆ గజగండ నిన్ను ఏమీ చేయలేడని చెప్తుంది సుమనకు.
తిలొత్తమ్మ నా చిన్న కొడులును విడిచిపెట్టు అని అడగ్గానే విడిచిపెట్టనని సుమన ప్రాణాలంటే ఎవ్వరికీ లెక్కే లేదనుకోవచ్చు అంటుంటే.. విక్రాంత్ నువ్వేన్ని లెక్కలేసుకున్నా తన కోసం ఎవ్వరూ రారు ఎందుకంటే నీ కంటె ఎక్కువ స్వార్థం ఉంది తనకు అంటాడు విక్రాంత్. సుమన భయపడుతూ విశాల్ బావగారు మీరైనా వచ్చి నన్ను కాపాడండి అని వేడుకుంటుంది సుమన. ఇంతలో గాయత్రి పాప వెళ్లి సుమనను లాగుతుంది.
ఆశ్చర్యంగా ఉందే గాయత్రి పాప నన్ను విడిపించింది అంటుంది సుమన. నేను ఈ పాపను చూసి భయపడలేదు. ఈ చిన్ని పాపను చంపాలనుకుంటున్నాను అంటాడు. ఇంతలో గాయత్రి పాప తన చేతిలో ఉన్న బోమ్మతో గజగండను కొట్టగానే దూరంగా వెళ్లి పడిపోతాడు. అది భుజంగమణి పవర్ అని గాయత్రి పాప దగ్గరున్న బొమ్మలో భుజంగమణి పెట్టాను అంటుంది నయని. విశాల్ వెళ్లి మర్యాదగా పంచకమణి ఇచ్చావ సరే లేదంటే దసర పండక్కి అమ్మవారికి బలి ఇచ్చైనా మణి తీసుకుంటాను అని వార్నింగ్ ఇవ్వడంతో గజగండ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
వల్లభ కిక్ బాక్సింగ్ నేర్చుకున్నట్లు బిల్డప్ ఇస్తుంటే తిలొత్తమ్మ తిడుతుంది. దొమలను కొడుతున్న వాడిలా ఏంటది అంటుంది. దీంతో వల్లభ నాలాంటి వాడైనా ఒక్కోసారి భయపడతారు. చిన్న పిల్ల గాయత్రి పాప ఎంత ధైర్యంగా గజగండ ముందుకు వెళ్లింది మమ్మీ అంటాడు. అది పిల్లది కాదు భుజంగమణి పవర్ అది అంటుంది తిలొత్తమ్మ. భుజంగమణి ఎలా పని చేస్తుందో ప్రత్యక్షంగా చూశాము అంటుంది.
దీంతో చిన్న పాప చేతిలో దెబ్బలు తిన్నామని గజగండ ఏం ఆత్మహత్య చేసుకోడు కదా? అంటాడు వల్లభ. అలాంటిదేం ఉండదు. కానీ భుజంగమణిని నయనికి దూరం చేయాలని చెప్తుంది తిలొత్తమ్మ. ఎలాగైన మణిని మనం సొంతం చేసుకోవాలంటే నయనిని చంపేయాలి. లేదంటే మణిని దొంగిలించాలి అని చెప్తుంది.
పెద్ద మరదలును చంపడం అంత ఈజీ కాదు ఆ చిన్న పాపను మచ్చిక చేసుకుని ఆ పిల్లతో ఉన్న బొమ్మలన్నీ తీసుకురావాలి అంటాడు వల్లభ. దీంతో నయని నీలా చిన్న పిల్ల కాదు ఇంకా అలాగే ఆలోచించడానికి అంటూ ఈసారి నేను కొట్టే దెబ్బకు నయని అదిరిపోవాలి అని చెప్తుంది. వల్లభ ఏం చేయబోతున్నావు మమ్మీ అని అడిగితే చెప్పను అంటూ వెళ్లిపోతుంది.
సుమన సోఫాలో కూర్చుని భుజంగమణి గురించి ఆలోచికస్తూ కళ్లు మూసుకుని కలవరిస్తూ ఉంటుంది. ఇంతలో విక్రాంత్ వస్తాడు. ఏంటి సుమన నీలో నువ్వే మట్లాడుకుంటున్నావు అని అడుగుతాడు. దీంతో నాకు భుజంగమణి కావాలని ఒక్కసారి చూడాలని చెప్తుంది. తీరని కోరికలు ఎందుకు అడుగుతావే అంటూ విక్రాంత్ తిడతాడు. దీంతో సుమన కోపంగా చిన్న పిల్ల గాయత్రికి కూడా తీసిపోనా? ఆ పిల్ల బొమ్మలో పెట్టి ఇచ్చిందట. నేను ఒక్కసారి చూసి ఇస్తానని చెప్తే నాకు ఎందుకు ఇవ్వదు అంటుంది.
నయని వదిన ఎప్పుడైతే నిన్ను భుజంగమణి టచ్ చేయోద్దు అందో అప్పుడే నువ్వు ఆ అర్హత కోల్పోయినట్టే అంటాడు విక్రాంత్. నేను ప్రాణాలకు తెగించి మా అక్క ప్రాణాలు కాపాడినందుకైనా ఇవ్వొచ్చు కదా? అంటుంది. నువ్వు కాపాడావా? చికెన్ సెంటర్‌లో కత్తితో కోయబోయే కోడిలా గిలగిల కొట్టుకున్నావు నువ్వు వదినను కాపాడావా? అంటాడు విక్రాంత్. ఇక సుమన మణిని కొట్టేసైనా గజగండకు ఇస్తే మనకు అష్టైశ్వరాలు ఇస్తాడు కదా అంటుంది. దీంతో విక్రాంత్ అప్పుడు నిన్ను చంపేస్తా అంటూ వెళ్లిపోతాడు.
రాత్రికి గాయత్రి పాప బొమ్మలను కొట్టేయడానికి సుమన వస్తుంది. ఇంతలో తిలొత్తమ్మ, వల్లభ వస్తారు వాళ్లను చూసిన తిలొత్తమ్మ పక్కకు వెళ్లి దాక్కుంటుంది. వల్లభ ఏమీ కనిపించడం లేదని లైట్ వేయాలా మమ్మీ అని అడుగుతాడు. వద్దని చెప్తుంది తిలొత్తమ్మ. ఇంతలో సుమన వచ్చి నేను కూడా మణి కోసమే వచ్చానని ఆ బొమ్మలన్నీ వెతికానని అక్కడ మణి లేదని చెప్తుంది.
ఇంతలో అందరూ వస్తారు. లైట్స్ వేస్తారు. దీంతో వల్లభ, తిలొత్తమ్మ, సుమన షాక్ అవుతారు. అయితే నయని మాత్రం వాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తుంది. మణి ఎక్కడ ఉందో కరెక్టుగా చెప్పిన వారికి ఆ మణిని ఇస్తానని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ కు ఎండ్ కార్డు పడుతుంది.