BigTV English

OTT Movie : యోగి బాబు సర్వైవల్ థ్రిల్లర్… తప్పించుకోవడానికి వెళ్లి సముద్రంలో అడ్డంగా చిక్కుకుంటే…

OTT Movie : యోగి బాబు సర్వైవల్ థ్రిల్లర్… తప్పించుకోవడానికి వెళ్లి సముద్రంలో అడ్డంగా చిక్కుకుంటే…

OTT Movie : ఇటీవల కాలంలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుండడం చూస్తుంటే భాష అనే అడ్డు తొలగిపోయిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అన్ని భాషల నటీనటులు అందరికీ తెలుసా అంటే కాదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. కొంతమంది నటులు పాన్ ఇండియా రేంజ్ లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కదు. కానీ మరి కొంతమందికి మాత్రం సొంత భాషలో నటించినా చాలు పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అవుతారు.. అలా మంచి గుర్తింపును దక్కించుకున్న నటుల్లో తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు కూడా ఒకరు. ఆయన పాపులారిటీ ఎంతగా పెరిగింది అంటే యోగి బాబు ప్రధాన పాత్రలో నటించినా సరే సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు జనాలు. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటించిన ఒక సర్వైవల్ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టడానికి రెడీ అయింది. మరి ఆ మూవీ పేరేంటి? ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


స్ట్రీమింగ్ ఎప్పుడంటే…

యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ డ్రామా ‘బోట్’. ఈ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజై పర్వాలేదు అనిపించింది. దీనికి చెంబు దేవర దర్శకత్వం వహించగా, ఇప్పుడు ఓటిటిలోకి అడుగు పెట్టడానికి రెడీ అయింది. ఈ బోట్ మూవీ అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ బోట్ మూవీ తమిళంలో రిలీజ్ అవుతుంది. కానీ తెలుగు డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ‘బోట్’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కు కానుండడంతో యోగి బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించగా, మాల్వి అండ్ మాన్వి మూవీ మేకర్స్, చెంబున్ దేవ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కళావాణి, చింబుదేవన్, ప్రేమ్ కుమార్ నిర్మించారు.


కథ ఏంటంటే..

సినిమా మొత్తం 1943 కాలంలో సాగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలన కొనసాగుతున్న టైంలో రెండో ప్రపంచం యుద్ధం జరుగుతుంది. ఆ టైంలో ముంబై నగరం పై బాంబులు పడడంతో, ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి సముద్రాన్ని మార్గంగా ఎంచుకుంటారు ఓ పదిమంది. వీళ్లు బోట్ ద్వారా సముద్రంలో వేరే ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అందులో హీరో మత్స్యకారుడు. అయితే ఆ బోట్ లో ఉన్న పది మంది విభిన్నంగా ఉంటారు. ఓ గర్భిణీ, తండ్రి, కూతురు, బ్రిటిషర్లు తీవ్రవాదిగా పేర్కొనే మరో వ్యక్తి.. ఇలా ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కోలా ఉంటుంది. మొత్తానికి ప్రాణాలను కాపాడుకోవడానికి సముద్రంలో బోటు ప్రయాణం చేసే ఈ పది మంది సొర చేపల దాడి, బోటు మునిగిపోయే ప్రమాదం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇంత డిఫరెంట్ గా ఉన్న ఈ పది మందిలో సురక్షితంగా ఎంతమంది బయటపడ్డారు? ప్రాణాలను కాపాడుకోవడానికి ఏమేం చేశారు అనే విషయాలు తెలియాలంటే ఈ ‘బోట్’ మూవీని చూడాల్సిందే.

Related News

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

OTT Movie : భర్త ఇంట్లో లేడని బాయ్ ఫ్రెండ్ ను పిలిచే భార్య… నెక్స్ట్ బుర్రబద్దలయ్యే ట్విస్ట్… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : రాత్రిపూట భర్త గదిలోకి వెళ్లాలంటేనే భయపడే భార్య… నాలుగురమ్మాయిల అరాచకం… సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : సాఫ్ట్వేర్ జాబ్ పేరుతో అమ్మాయిలతో ఆ పాడు యాపారం… కూతురు కూడా అదే పని… వర్త్ వాచింగ్ మూవీ

OTT Movie : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

Big Stories

×