Telangana Power: తెలంగాణలో విద్యుత్ వినియోగంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ హయాంలో తొమ్మిదిన్నరేళ్లు మంత్రిగా పని చేసిన జగదీష్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడి వెళ్లిపోయారని ఫైర్ అయ్యారు. అక్టోబర్ 16వ తేదీన ఈ సంవత్సరంలో విద్యుత్ వినియోగం 20 వేల మెగావాట్ల పీక్ డిమాండ్‌కు చేరిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రానికి మంచి పరిణామం తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వినియోగంలోకి తెచ్చామని అన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీ భద్రాద్రి, యాదాద్రిలో వాడటం వలన కాస్ట్ ఎక్కువ అయిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో వచ్చిన తెలంగాణ అప్పుల రాష్ట్రం అయిందని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌తో ఖర్చు ఎక్కువ అయిందని, ఏపీ బోర్డర్ లో కట్టారని అన్నారు. బొగ్గు, నీటి వనరులు లభ్యం అయ్యే దగ్గర కట్టలేదని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 40 ఏళ్ల డ్యూరేషన్ పీరియడ్‌లో లక్ష కోట్ల అదనపు ఖర్చు అవుతుందని ఎంపీ చామల అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను జీ9 బొగ్గు కోసం మాత్రమే కట్టారని అన్నారు.
జీ9 క్వాలిటీ బొగ్గు అనేది విదేశాల్లో మాత్రమే దొరుకుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల నుంచి అదే విధంగా కోల్ ఇండియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, బిఆర్ఎస్ హయాంలో కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణ చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలకు క్వాలిటీ విద్యుత్ అందించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, విద్యుత్, నీటి సౌకర్యం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని అన్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ప్రతిపక్షాలు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలి. అధికార పార్టీకి చెందిన వారి కాళ్లల్లో కట్టెలు పెట్టవద్దని, తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు,నియామకాలకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Also Read: రెండు హెలికాప్టర్లు అనూహ్యంగా ఢీ.. ఓ భారతీయుడు మృతి, నేపాల్‌లో దారుణమైన ఘటన