E-Paper
Advertisement

2014 నుంచి దేశానికి దరిద్రం.. అమిత్ షాకు ఎంపీ చామల చురకలు!

2014 నుంచి దేశానికి దరిద్రం.. అమిత్ షాకు ఎంపీ చామల చురకలు!
Advertisement

Chamala Kiran: అమిత్ షా కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎప్పటికి అధికారంలో ఉంటది అని అమిత్ షా అంటుండు. SIR ను అడ్డం పెట్టుకొని పర్మినెంట్‌గా అధికారంలో ఉండాలని చూస్తున్నారని ఎంపీ చామల అన్నారు. BRS ఓట్ల దానంతో తెలంగాణలో 8మంది ఎంపీలు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు? సచ్చేది లేదు? అమిత్ షా హైదరాబాద్ కంటే మణిపూర్ పోయి ఉంటే బాగుండేదని అన్నారు. మణిపూర్ అల్లర్లతో బగ్గుమంటుంది. తొలగించిన 13కోట్ల 30లక్షల ఓట్లలో 3కోట్ల మంది ఇల్లిగల్ ఓట్లు ఉన్నాయని అమిత్ షా అంటున్నాడని, 3కోట్ల మంది ఇల్లీగల్ గా దేశంలోకి వస్తే హోమ్ మంత్రిగా మీరు ఏమి చేశారని ప్రశ్నించారు.

12 ఎళ్లుగా దేశంలోకి ఎంత మంది వచ్చారు..?

దేశంలో పలికి ఎంతమంది విద్రోహ శక్తులు వచ్చాయి? దేశంలో ఇంటర్నల్ సెక్యూరీటి పరిస్థితి ఏంటి? 12ఏండ్ల నుండి బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుండి ఎంత మంది దేశంలోకి వచ్చారు? దేశంలో ఇద్దరు గుస్పతిలు మోడీ, అమిత్ షా లు గుజరాత్ నుండి డిల్లీకి వచ్చారు. 2014 నుండి ఇద్దరి గుస్పతి లనుండి దేశానికి దరిద్రం పట్టిందని, వల్లభాయ్ పటేల్ హోమ్ మిస్టర్‌గా ఎవరి దగ్గర ఉన్నారు కాంగ్రెస్ లోనే కదా? కేరళ, తమిళనాడు, హర్యానా లో ఒక్క ఓటు కూడా బీజేపీకి పడదని అన్నారు. డబుల్ సర్కార్ అంటే గంగా, యమునా, సబర్మతి నే అభివృద్ధి చేస్తారా? మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి చేయరా లక్షలాది మంది జంతర్ మంతర్ దగ్గరికి వస్తే కానీ బుద్ధి రాలేదని అమితం షా పై ఫైర్ అయ్యారు.

జ్ణానేష్ కుమార్ రాజీనామా..

Advertisement

ఈనెల నుండి జరిగే పార్లమెంట్ స్పెషల్ సెషన్‌లో CEC జ్ఞానేశ్వర్ కుమార్‌ను తొలగించడానికి ప్రయత్నం చేయండని చామల అన్నారు. రాహుల్ గాంధీ అడిగిన డిమాండ్లను BJP నెరవేర్చాలని, జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించి, జ్ఞానేశ్వర్ కుమార్ పై విచారణ జరగాలని అన్నారు. తొలగించిన ఓట్లను సరిచేసి వాటిని యాడ్ చేయాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే నిధులు ఇస్తామనే పిచ్చి ఆలోచన మానుకోండి. అమిత్ షా మున్నాభాయ్ mbbs లాగ ఆలోచించకుండా వాస్తవాలను మాట్లాడాలని అన్నారు. తెలంగాణలో 50 శాతం అర్బనైజేషన్ కావాలంటే RRR రావాలి. హైదరాబాద్ ఎక్కడైన తమ పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలంటే మెట్రో ఫేజ్-2 పూర్తి కావాలని దాన్ని గురించి మాట్లాడాలని అన్నారు.

Also Read: సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనేనా? పెళ్లి తేదీ ఫిక్స్!

Tags

Related News

ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదు.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్!

జీడీమెట్ల సర్కిల్‌లో దారుణం.. పారిశుధ్య కార్మికులను వేదిస్తున్న సూపర్వైజర్!

నన్ను సీఎం అనకండి.. మైక్ బంద్ చేస్తా.. సభలో కార్యకర్తలపై బండి సంజయ్ ఫైర్!

ఆ ఒక్క తప్పుతో.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ వల్ల తెలంగాణకు లక్ష కోట్ల నష్టం?

మురసు తుఫాన్ ఎఫెక్ట్‌.. తెలంగాణలో భారీ వర్షాలు, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్

గిరిజన మహిళపై వేటేస్తే.. మరి మీ సంగతేంటి? శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ వంశీకృష్ణ సెటైర్లు!

సుకన్య రెడ్డి పేరిట ఫేక్ ప్రొఫైల్.. ట్రేడింగ్ యాప్‌లో కానిస్టేబుల్‌కు రూ.30 లక్షల టోకరా!

Big Stories

Advertisement
×