Jabardast Bhaskar:తెలుగు బుల్లితెర ఛానల్ లో గత దశాబ్ద కాలానికి పైగా ఆడియన్స్ ను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ (Jabardast). ఈ వేదిక ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ అందివ్వడమే కాదు మరెంతో మందికి గొప్ప జీవితాన్ని కూడా ప్రసాదించింది. ఇక్కడ చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకొని సినిమాలలో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అలా కొంతమంది సినిమాలలో హీరోలుగా మారితే.. మరికొంతమంది దర్శకులుగా మారారు.ఇంకొంతమంది ఇటీవలే కమెడియన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇక అలాంటి వారిలో బుల్లెట్ భాస్కర్ (Bullet Bhaskar)కూడా ఒకరు.తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈయన.. దాదాపు చాలా సంవత్సరాలు గానే ఇక్కడ కొనసాగుతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా.. సెట్లో అనుకోకుండా జరిగే పరిణామాలకు అప్పుడప్పుడు చివాట్లు కూడా పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ 8 కంటెస్టెంట్ ప్రియాంక జైన్( Priyanka Jain ) తో చేసిన ఒక పనికి.. చివరికి ఆడవాళ్ళ చేత చివాట్లు పడేలా చేసింది. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా షోలో స్టేజ్ మీద మామూలుగా స్కిట్ జరుగుతూ ఉండగా.. బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ లో ప్రియాంక స్టేజ్ మీదకు వచ్చింది. అయితే వెంటనే బుల్లెట్ భాస్కర్ కూడా బ్యాక్ గ్రౌండ్ లో డ్యూయెట్ సాంగ్ రావడంతో ఆమెతో కలిసి డాన్స్ చేశాడు. ఇదంతా బాగానే ఉన్నా.. స్టెప్స్ వేసేవాడు కాస్త ఆమెను రెండు చేతుల మీద పీకి ఎత్తి గిరగిరా తిప్పేశాడు. ఈ అనుకోని పరిణామానికి ప్రియాంక కూడా షాక్ అయింది. వెంటనే ఆమెను దింపేశాడు భాస్కర్.
దీంతో ప్రియాంక జైన్ సీరియస్ అవుతూ..” చూసుకోవచ్చు కదా.. డ్రెస్ బాలేదు.. లిఫ్ట్ చేయొద్దని ముందే చెప్పాను కదా..” అంటూ ఫైర్ అయ్యింది. దానికి భాస్కర్ షాక్ అవుతూ..” అదేదో ముందు చెప్పాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు కంఫర్ట్ గా లేదు అంటే ఎలా ఉంటుంది” అని రివర్స్లో సీరియస్ అయ్యారు. ఇక ఆ మాటలకు ప్రియాంక..లిఫ్ట్ చేస్తారని మాకు తెలియదు కదా.. అంటూ అంది. ఇక వాళ్ళు గొడవ పడుతున్న నేపథ్యంలో.. మధ్యలో పాగల్ పవిత్ర (Pavitra) ఎంట్రీ ఇచ్చి, నేను మొదట్లోనే చెప్పాను. తన అడ్రస్ కంఫర్ట్గా లేదు అని అంటూ తెలిపింది. ఇక లేడీస్ అందరూ కూడా సీరియస్ అవుతూ భాస్కర్ పై చివాట్లు పెట్టారు. దీంతో పరువు పోయిందని భావించిన భాస్కర్ ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో కూడా తెలియక.. వేసుకునే వాళ్లకు తెలుస్తుంది. చూసేవాళ్ళకు ఏం తెలుస్తుంది. కంఫర్ట్ గా ఉందో లేదో అంటూ రివర్స్లో ఆన్సర్ చెప్పేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇక మాటకు ప్రియాంక జైన్ కూడా సమాధానం చెప్పకుండా స్టేజ్ మీద నుంచి కిందకు దిగి వెళ్లిపోయింది .మొత్తానికైతే పొట్టి డ్రెస్ తీసుకొచ్చిన తంటా.. చివరికి.. అందరిచేత భాస్కర్ చివాట్లు పడేలా చేసింది అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి డ్రెస్సులు వేసుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి అని కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.