BigTV English

OTT Movie : బ్రిడ్జి కింద మనుషుల ఎముకలు… 40 ఏళ్ల మిస్టరీ… మతిపోగొట్టే ట్విస్టులున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : బ్రిడ్జి కింద మనుషుల ఎముకలు… 40 ఏళ్ల మిస్టరీ… మతిపోగొట్టే ట్విస్టులున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్‌ మిస్టరీ సినిమాలను ఇష్టపడే వారికి ఒక ఆసక్తికరమైన సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇందులో ట్విస్టులు కావలసినన్ని ఉన్నాయి. ఈ సినిమాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అదికూడా 40 సంవత్సరాల క్రితం జరిగిన మిస్టరీని కనిపెడతాడు. ఈ క్రమంలో స్టోరీ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్ తో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


స్టోరీ ఏమిటంటే

ఈ కథ శక్తి అనే ట్రాఫిక్ పోలీసు అధికారితో ప్రారంభమవుతుంది. అతనికి ఈ ఉద్యోగం సంతృప్తిని ఇవ్వదు. ఎందుకంటే అతను ఒక క్రైమ్ డిటెక్టివ్ కావాలని కలలు కానేవాడు. కానీ అతని ప్రస్తుత ఉద్యోగం అతని కలలకు అడ్డంకిగా ఉంటుంది. ఒక రోజు అతను ఒక పాడు బడిన ఇంటిలో కొన్ని పాత ఎముకలను, వస్తువులు ఎదురుపడతాయి. ఈ ఎముకలు దాదాపు 40 సంవత్సరాల పాతవని తెలుస్తుంది. అవి ఒక కుటుంబం హత్యకు సంబంధించినవని శక్తి అనుమానిస్తాడు.ఈ కేసు శక్తి ఆసక్తిని మరింత పెంచుతుంది. అతను ఈ కేసును అనధికారికంగా దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. అతను ఈ ఎముకలతో పాటు అక్కడ దొరికిన ఒక గొలుసు, ఒక డైరీని పరిశీలిస్తాడు. ఈ ఆధారాలు అతన్ని 1970ల నాటి ఒక హత్య కేసుకు లింక్ చేస్తాయి.


శక్తి ఈ కేసును వెలికితీసేందుకు, ఒక రిటైర్డ్ పోలీసు అధికారి అయిన రామచంద్ర సహాయం తీసుకుంటాడు. అతని దగ్గర ఈ కేసు గురించి కొంత సమాచారం కూడా ఉంటుంది. అదే సమయంలో, శక్తి ఒక జర్నలిస్ట్ అయిన స్వాతిని కలుస్తాడు. ఆమె కూడా ఈ కేసు గురించి ఆసక్తి చూపిస్తుంది. స్వాతి శక్తికి సమాచారం అందించడంలో సహాయపడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తారు.

శక్తి దర్యాప్తు వేగంగా, మరింత లోతుగా సాగుతుంది. అతను ఈ కేసు వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉందని కనిపెడతాడు. 1970లలో ఈ హత్యలు ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడు, అతని సన్నిహితులతో సంబంధం కలిగి ఉన్నాయని శక్తి అనుమానిస్తాడు. ఈ కేసు గురించి ఆధారాలు సేకరించడంలో శక్తి అనేక అడ్డంకులను ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఈ కేసును వెలికితీయడం వల్ల ఇప్పటి రాజకీయ నాయకులు, అధికారులకు సమస్యలు తలెత్తుతాయి.శక్తి దర్యాప్తు అతన్ని మినుకు అనే మహిళ వైపు నడిపిస్తుంది. ఆమె ఈ కేసుతో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉందని తెలుస్తుంది. మినుకు గతంలో ఈ కుటుంబంతో సంబంధం ఉందని, ఆమె ఈ హత్యలకు సాక్షిగా ఉండవచ్చని శక్తి అనుమానిస్తాడు. అయితే మినుకు ఏమీ తెలీనట్లు ఉంటుంది. ఆమెను ప్రశ్నించడం శక్తికి కష్టంగా మారుతుంది.

ఈ దశలో అతని ఉన్నతాధికారులు, అతన్ని ఈ కేసును వదిలివేయమని హెచ్చరిస్తారు. ఎందుకంటే ఈ కేసులో బలమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళ వల్ల ప్రాణాపాయం కూడా వస్తుంది. శక్తి తన జీవితాన్ని పణంగా పెట్టి న్యాయం కోసం పోరాడతాడు. ఇక క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టులు వస్తాయి. శక్తి హంతకులను కనిపెడతాడా ? ఆ కుటుంబాన్ని ఎందుకు చంపారు ? వాళ్ళకు శిక్ష పడుతుందా ? క్లైమాక్స్ ట్విస్టులు ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘కబడ్డారి’ (Kabadadaari) తెలుగు-తమిళ భాషలలో ఒకేసారి రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ప్రదీప్ కృష్ణమూర్తి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సిబిరాజ్, నందిత శ్వేత, నాసర్, జయప్రకాష్, సుమన్ రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2019లో వచ్చిన కన్నడ చిత్రం కావలుదారికి రీమేక్ గా వచ్చింది. 2021జనవరి 28న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. 2 గంటల 26 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా Amazon Prime Video, Sun NXT లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : భర్తకు తెలియకుండా మరొకరితో… దెయ్యమని తెలిసినా ఇదేం పాడు పని మావా?

Related News

OTT Movie : ఈ కాలేజ్ లో పిల్లలంతా ఆ ఆట ఆడాల్సిందే… గ్యాప్ లేకుండా పాడు సీన్లు… దిమాక్ కరాబ్ చేసే డార్క్ కామెడీ

OTT Movie : డిజిటల్ యుగంలో జరిగే క్రైమ్స్ అన్నీ ఈ ఒక్క మలయాళ మూవీలోనే… కేసు కేసుకో ఇంటెన్స్ క్రైమ్ కథ

OTT Movie : అమ్మాయిలు కన్పిస్తే చాలు అల్లాడిపోయే ఆటగాడు… కోడల్ని కూడా వదలకుండా… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : బాక్స్ లో పడుకున్న దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే కపుల్… గుండె ధైర్యం ఉన్నవాళ్ళే చూడాల్సిన హార్రర్ మూవీ

OTT Movie : ఆకాశంలో తేలే ఈ ఓడలో ఒళ్ళు తెలియకుండా ఆ పనులు… మస్త్ మసాలా స్టఫ్… ఈ మూవీని చూస్తే నిద్ర పట్టడం కష్టమే

Big Stories

×