Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో ముఖేష్ వర్సెస్ త్రిగుణ్ అంటూ పోరు గట్టిగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇద్దరిలో నువ్వా నేనా అనే రేంజ్ లో టైటిల్ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ముఖ్యంగా ముఖేష్ ను త్రిగుణ్ అనవసరంగా దూషిస్తున్నాడు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. బిగ్ బాస్ లో త్రిగుణ్ మాటే శాశ్వతం అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే హౌస్ లో మాత్రం వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. హద్దులు దాటుతున్నాయి. ఇక ఎవరు విజేతగా నిలుస్తారు ? అనే విషయం కాస్త పక్కన పెడితే నిన్న జరిగిన టికెట్ టు ఫినాలే రేసులో భాగంగా జరిగిన కీలక టాస్క్ లో ఇద్దరు గట్టిగానే పోటీపడ్డారు. అయితే త్రిగుణ్ పై ముఖేష్ గౌడ విజయం సాధించి గ్రాండ్ ఫినాలే దిశగా అడుగులు వేశారు.అంతేకాదు నేరుగా గ్రాండ్ ఫినాలే లో స్థానం సంపాదించుకోవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. టికెట్ టు ఫినాలే కోసం బిగ్ బాస్ పెట్టిన ‘ బ్యాటిల్ ఆఫ్ డామినేషన్స్’ టాస్క్ లో ముఖేష్, త్రిగుణ్ ఇద్దరూ కూడా రెండు సామ్రాజ్యాలకు నియంతలుగా వ్యవహరించారు. మొత్తం మూడు రౌండ్లు జరిగిన ఈ పోటీలో.. మొదటి రౌండులో త్రిగుణ్ గెలవగా.. ఆ తర్వాత ముఖేష్ అద్భుతంగా పుంజుకొని రెండవ, మూడవ రౌండ్లలో విజయం సాధించి విజేతగా నిలిచారు. తెల్లటి షర్టులపై ఎదుటివారికి ఎక్కువ రంగు పూయడం , తమ షర్టుపై తక్కువ రంగు ఉండేలా కాపాడుకోవడం అనే ఛాలెంజ్లో ముఖేష్ పై చేయి సాధించి తన జట్టును బలోపేతం చేసుకున్నారు.
also read:ఈ.ఎన్.ఈ రిపీట్’ మూవీ రివ్యూ.. తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ మళ్లీ మెప్పించారా?
ఈ విజయంతో ముఖేష్ నేరుగా టికెట్ టు ఫినాలే రేసులో ముందంజలో నిలిచి ఫైనల్ కు చేరువయ్యారు. ఇక హోస్ట్ నాగార్జున కూడా గతంలో ముఖేష్ ఆట తీరును ప్రస్తావిస్తూ ‘టూ జెంటిల్మెన్’ అంటూ ప్రశంసించిన విషయం తెలిసిందే . అటు సెలబ్రిటీ వీక్ లో అమర్దీప్ చౌదరి కూడా ముఖేష్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు. ఏకంగా టికెట్ రేసులో నిలవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి చివరిగా ముఖేష్ , త్రిగుణ్ ఇద్దరిలో ఎవరు టైటిల్ విజేతగా నిలుస్తారో చూడాలి.