E-Paper
Advertisement

ముఖేష్ ట్రాప్ లో పడ్డ త్రిగుణ్..మరీ ఇంత వెర్రోడా?

ముఖేష్ ట్రాప్ లో పడ్డ త్రిగుణ్..మరీ ఇంత వెర్రోడా?
Advertisement

Bigg Boss 10:ఇన్ని రోజులు త్రిగుణ్ టైటిల్ రేస్ లో నిలుస్తున్నాడని, త్రిగుణ్ లో టాలెంట్ ఎక్కువగా ఉందని, ముఖ్యంగా త్రిగుణ్ ఎలా చెబితే బిగ్ బాస్ అలా వింటాడు అంటూ 10 వారాలుగా త్రిగుణ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ 11వ వారంలో భాగంగా జరిగిన టాస్కులలో త్రిగుణ్ నిర్ణయాలు చూస్తూ ఉంటే.. మరీ ఇంత కొండెర్రిపప్పా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా జరిగిన టికెట్ టు ఫినాలే రేసులో డిక్టేటర్ గా ఉన్న ముఖేష్ మరో డిక్టేటర్ త్రిగుణ్ పై పోరాడి గెలిచి గ్రాండ్ ఫినాలే రేసులోకి టికెట్టు దక్కించుకున్నాడు.

ముఖేష్ ట్రాప్ లో త్రిగుణ్..

ఇకపోతే ఇప్పుడు 74వ రోజుకు సంబంధించి విడుదల చేసిన మూడవ ప్రోమోలో త్రిగుణ్, ముఖేష్ ఇద్దరు డిక్టేటర్స్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ తమ టీమ్లలో ఎవరు స్ట్రాంగ్, స్ట్రాంగెస్ట్, వీక్, వీకెస్ట్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలిపారు. ముందుగా ముఖేష్ మాట్లాడుతూ.. వీకెస్ట్ లో రామ్ అన్న. నిన్న టాస్క్ పరంగా కూడా కొంచెం వీక్ అయ్యారు. చాలా స్ట్రాంగ్ అని నేను నమ్మాను. ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఆడాల్సింది.. అంటూ తెలిపారు. వీక్ లో నరేష్ ను పెట్టాడు. మీలో ఉన్న ఆ స్ట్రాంగ్ నెస్ ను ఇంకా చూపించాలి. నువ్వు ఇంకా చూపించట్లేదు. అని తెలిపాడు. ఆ తర్వాత స్ట్రాంగ్ లో వర్షినినీ పెట్టాడు. ఆ తర్వాత స్ట్రాంగెస్ట్ లో అమన్ ను పెట్టాడు ముఖేష్.

ప్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందంటే?

Advertisement

ఆ తర్వాత త్రిగుణ్ మాట్లాడుతూ. స్ట్రాంగెస్ట్ లో నేను శివను పెడుతున్నాను. సంచాలక్ గా వ్యవహరించినప్పుడు.. తన పాయింట్ ను స్ట్రైట్ గా పెట్టాడు. తన పెట్టిన పాయింట్ కే తర్వాత టీం కాంప్రమైజ్ అయ్యేలా చేశాడు. అంటూ తెలిపారు. ఈ డిక్టేటర్స్ లో వీకెస్ట్ గా మిమ్మల్ని పెడుతున్నాను. అంటూ వంశీని వీకెస్ట్ లో పెట్టాడు. ఇటు స్ట్రాంగ్ లో దేబ్జాని , వీక్ లో నీతూ ను పెట్టాడు త్రిగుణ్. అయితే ఇందులో త్రిగుణ్ కి బిగ్ బాస్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. మీకు కావలసిన వారిని రీప్లేస్ చేసుకోమని సలహా ఇచ్చారు. త్రిగుణ్ మాట్లాడుతూ నా టీంలో నీతూ గారిని ముఖేష్ టీమ్ లో ఉన్న అమన్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు.

also read:రాహుల్ గాంధీ వ్యాఖ్యల వివాదం పై సోనాక్షి సిన్హా కౌంటర్!

వర్షిణి ఎప్పుడు స్ట్రాంగ్ అయింది?

Advertisement

ఇదంతా ముఖేష్ ప్లాన్ లాగే అనిపించినట్లు ప్లాష్ బ్యాక్ లో జరిగిన సన్నివేశాలను బిగ్ బాస్ ప్రోమోలో కట్ చేశారు. అందులో ముఖేష్ అమన్ తో మాట్లాడుతూ..”నువ్వు వూరికే పోయి అడుగు.. వంశీ ను వీక్, వీకెస్ట్ అంటాడా.. అక్కడ ఎవరు బకరాగాడు శివను పెడతాడా.. నేను మాత్రం నిన్నే స్ట్రాంగెస్ట్ లో పెడతాను. కానీ నిన్నే పిలిచినప్పుడు నువ్వు వెళ్ళు అంటూ చెప్పాడు. ఇక అన్నట్టుగానే ముఖేష్ అమన్ ను స్ట్రాంగెస్ట్ లో పెట్టగా.. త్రిగుణ్ ముఖేష్ ట్రాప్ లో చిక్కుకొని అమన్ ను నీతూతో రీ ప్లేస్ చేశారు. మొత్తానికైతే ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ మరీ ఇంత వెర్రోడా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. కట్ చేస్తే నరేష్ దేబ్ జానీ తో మాట్లాడుతూ.. ఇంత సడన్గా వర్షిణి ఎప్పుడు స్ట్రాంగ్ అయింది అంటూ వెటకారంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related News

నాగదుర్గ ఊచకోత డాన్స్.. నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తున్న‘లగరే సౌండ్ సాలా’!

నిర్ణయం తీసుకోలేని వారు విజేత ఎలా అవుతారు.. ముఖేష్, త్రిగుణ్ పై నెటిజన్స్ ఫైర్!

గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న టాప్ కంటెస్టెంట్.. ఎవరంటే?

హౌస్ నుండి రామకృష్ణ కిడ్నాప్.. అసలేం జరుగుతోంది?

Illu Illaalu Pillalu Vedavathi : సీరియల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. వేదవతి అవుట్..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య మీనా హ్యాపీ.. మందు కొట్టిన మగాళ్లు.. బాలు, మీనా గొడవ..

Podarillu Today Episode : మహా కోరికను తీరుస్తున్న చక్రీ.. ఊహించని ట్విస్ట్.. ఎమోషనల్ సీన్..

Big Stories

Advertisement
×