E-Paper
Advertisement

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?

ఈ రొమాన్స్ ఏంటి బిగ్ బాస్?
Advertisement

Bigg boss 10: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 9 సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు 10వ సీజన్ లో 3 వారాలు పూర్తయ్యాయి. మొదటి వారం చైత్ర ఎలిమినేట్ కాగా, రెండవ వారం కృష్ణుడు ఎలిమినేట్ అయ్యి.. హౌస్ నుండి బయటకు వచ్చారు. ఇక మూడవ వారం వర్షిణి లేదా వంశీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా.. కెప్టెన్సీ ను త్యాగం చేసి ముఖేష్ వాళ్ళిద్దరినీ ఎలిమినేషన్ నుంచి తప్పించారు. అలా మూడవ వారం ఎలిమినేషన్ లేకుండా అందరూ సేఫ్ జోన్ లో ఉండిపోయారు.

హద్దులు దాటేసిన వర్షిణి, ముఖేష్..

ఇకపోతే బిగ్ బాస్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడంతో పాటు కంటెస్టెంట్స్ మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ కు మరింత ఆసక్తిని పెంచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ లవ్ ట్రాక్ మరింత హద్దులు మీరింది అనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లో అటు పక్క త్రిగుణ్, రోహిత్, షాలిని, అపూర్వ అందరూ గొడవ పడుతుంటే.. ఇటు వర్షిణి , ముఖేష్ మాత్రం రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన క్లిప్ ను సోషల్ మీడియాలో కొంతమంది అదే పనిగా షేర్ చేస్తూ.. వాళ్లేమో టాస్క్ కోసం గొడవ పడుతుంటే.. వీళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటున్నారు. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

బ్రహ్మానందం వాయిస్ తో వైరల్..

Advertisement

మరి కొంతమంది అయితే ఏకంగా వీళ్ళిద్దరి వీడియో క్లిప్ కి కరాటే కళ్యాణి, బ్రహ్మానందం వాయిస్ జోడించి మరీ షేర్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇదంతా కంటెంట్ కోసమే అని ఇద్దరికీ తెలిసే చేస్తున్నారు. కాకపోతే బయట పోర్ట్రైట్ మాత్రం ఇలా అవుతోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ముఖేష్ , వర్షిణిలు హద్దు దాటేశారు అని మరికొంతమంది కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కంటెంట్ ఇవ్వడానికే..

మరి కొంతమందేమో కంటెంట్ ఇవ్వడానికా లేక ఆమెతో రొమాన్స్ చేయడానికా.. ఆమెను ఎలిమినేషన్ నుంచి తప్పించావు.. బంగారం లాంటి కెప్టెన్సీ పవర్ ను వదులుకున్నావు అంటూ ముఖేష్ పై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా తాజా వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా మరొకవైపు పదిమంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ తో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభమయ్యింది. అందులో వైల్డ్ కార్డు ద్వారా అపూర్వ, మిథిలేష్ హౌస్ లోకి అడుగుపెట్టారు. చరణ్ కూడా మొదటివారం ఎలిమినేట్ అయ్యి మళ్లీ హౌస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మిథిలేష్ హౌస్ లోకి అడుగుపెట్టిన రెండు రోజుల్లోనే నాగార్జున ఇచ్చిన ఆఫర్ 15 లక్షలు తీసుకొని బయటకు వెళ్లిపోయి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇలా రోజుకో ట్విస్ట్ బిగ్ బాస్ లో ఆడియన్స్ కు మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.

Advertisement

 

Related News

మిథిలేష్ పరువు తీయాలనుకున్న బిగ్ బాస్.. కట్ చేస్తే?

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఆ రెండు మస్ట్ వాచ్..

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Big Stories

Advertisement
×