Sonal Chauhan On Mumbai Indians: రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్ లో ఓడిపోవాలని తాను నిత్యం ప్రార్థనలు చేసే దాన్ని అంటూ బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ( Sonal Chauhan ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు అన్యాయం చేసిందని ముంబై ఇండియన్స్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోహిత్ కెప్టెన్సీ తొలగించి అందరి దృష్టిలో ముంబై ఇండియన్స్ విలన్ గా మారిందని సీరియస్ అయ్యారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేసినట్టు వార్త రాగానే తనకు పట్టరాని కోపం వచ్చిందని వ్యాఖ్యానించారు హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఒక లెజెండరీ క్రికెటర్ రోహిత్ శర్మను పక్కకు పెట్టి… హార్దిక్ పాండ్యాను తీసుకురావడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆమె నిలదీశారు. ఈ నేపథ్యంలోనే తాను ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్ ఓడిపోవాలని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీంతో ముంబై ఇండియన్స్ పైన బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ తీవ్ర అన్యాయం చేసిందని బాలీవుడ్ నటి సోనాల్ చౌహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మను పక్కకు పెట్టి గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ని తీసుకువచ్చారని నిప్పులు చెరిగారు. 100 కోట్లు పెట్టి హార్థిక్ పాండ్యాను నెత్తి మీద ఎక్కించుకున్నారని సీరియస్ అయ్యారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అయిన రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ సంకనాకి పోయిందని విమర్శలు చేశారు. తాను భగవంతుని ప్రార్థించాను కాబట్టే ఇలా జరిగింది కావచ్చు అంటూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ చాలా చక్కగా రాణించేదని గుర్తు చేశారు.
రోహిత్ శర్మ ను పక్కకు పెట్టడంతో ముంబై ఇండియన్స్ లో గ్రూప్ గొడవలు మొదలయ్యాయని షాకింగ్ ఆరోపణలు చేశారు. అసలు హార్దిక్ పాండ్యా మాట వినేవాడు ముంబై ఇండియన్స్ జట్టులో లేరని బాంబు పేల్చారు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ వరుసగా ఓడిపోతూ వస్తోందని గుర్తు చేశారు. ఇప్పటికైనా హార్దిక్ పాండ్యాను పక్కకు పెట్టి మళ్ళీ రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా హార్దిక్ పాండ్యానే కొనసాగిస్తే ముంబై ఇండియన్స్ మళ్లీ విఫలం కావడం గ్యారెంటీ అని ఆమె సవాల్ విసిరారు. దీంతో ముంబై ఇండియన్స్ పై బాలీవుడ్ నటి సోనాల్ చౌహన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రోహిత్ శర్మ అంటే బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ కు బాగా ఇష్టం. ఆమె ఫేవరెట్ క్రికెటర్ కూడా ఇతడే. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరఫున ఏ మ్యాచ్ ఆడినా కచ్చితంగా ఆమె గ్రౌండ్ కు వెళ్తుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసే వరకే మైదానంలో ఉండి, ఆ తర్వాత ఇంటికి వెళ్లి పోతూ ఉంటుంది. రోహిత్ శర్మని అంతలా అభిమానిస్తోంది ఈ బాలీవుడ్ హీరోయిన్ నటి సోనాల్ చౌహన్. అతనికి పెళ్లి కాకపోయింటే, వెంటనే చేసుకునేదాన్ని అంటూ అప్పట్లో కామెంట్స్ కూడా చేసింది.