Big Stories

Komatireddy Brothers : చేతిలో ముల్లు?.. కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోట్లు!

Komatireddy Brothers : ఏళ్లుగా రాజకీయ అందలం ఎక్కించిన కన్నతల్లిలాంటి పార్టీని వీడి విమర్శల పాలయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ్ముడిని కట్టడి చేయాల్సిన అన్న వెంకట్ రెడ్డి.. తెర వెనుక కుట్ర రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ లోనే ఉంటూ.. పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి మొదటినుంచీ కాంట్రవర్సీగానే కనిపిస్తోంది. అన్నాదమ్ముళ్ల రాజకీయ జూదం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారుతోంది.

- Advertisement -

గత అసెంబ్లీ ఎన్నికల్లో.. రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. నల్గొండలో హస్తం పార్టీకి ఉన్న పట్టు అలాంటిది మరి. గెలిచినప్పటి నుంచీ బీజేపీపైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. ఆయన పార్టీ మారుతారంటూ మొదటినుంచీ ప్రచారం జరిగింది. చివరాఖరికి ఇటీవల అఫీషియల్ గా కాషాయ కండువా కప్పుకున్నారు.

- Advertisement -

తమ్ముడు ఓపెన్ అయితే.. అన్న మాత్రం అండర్ కరెంట్ గా కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటినుంచి వెంకట్ రెడ్డిలో అసహనం తీవ్ర స్థాయికి చేరింది. తాను ఆశించిన పదవి రేవంత్ కు దక్కడాన్ని ఆయన తట్టుకోలేకపోయినట్టు ఉన్నారు. అందుకే, పోస్టు కొనుకున్నారని, తాను సహకరించనంటూ మొదట్లోనే ఎర్ర జెండా ఎగరేశారు. ఆ తర్వాత హైకమాండ్ మొట్టికాయలు వేయడం.. స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వడంతో కాస్త కూల్ అయ్యారు. అయినా తగ్గని వెంకట్ రెడ్డి.. అద్దంకి దయాకర్ ఇష్యూతో రచ్చ రచ్చ చేశారు. తాను జస్ట్ హోంగార్డ్ నంటూ మళ్లీ కలకలం రేపారు. ఇదే టైమ్ లో వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక వెంకట్ రెడ్డికి అగ్నిపరీక్ష పెట్టింది. పార్టీనా? ఫ్యామిలీనా? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.

కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి రాకుండా హ్యాండిచ్చి.. వెంకట్ రెడ్డి పార్టీకి తీరని ద్రోహం చేశారనే విమర్శ ఉంది. ఇష్టం లేకపోతే కామ్ గా ఇంట్లో కూర్చున్నా పర్వాలేదు. కానీ, వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయడం విమర్శల పాలవుతోంది. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలంటూ.. తానే పీసీసీ చీఫ్ అవుతానంటూ.. కాంగ్రెస్ నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ కావడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కుట్రలు చేయడాన్ని అంతా అసహ్యించుకుంటున్నారు. వెంకట్ రెడ్డి తీరుపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం సైతం ఆరా తీసింది. కోమటిరెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

ఓవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో అంతగా శ్రమిస్తుంటే.. స్టార్ క్యాంపెయినర్ అయిన వెంకట్ రెడ్డి ఇలా వెన్నుపోటు పాలిటిక్స్ చేస్తుండటం.. ఆ ఫోన్ కాల్ లీక్ కావడంతో ఇక కాంగ్రెస్ లో కోమటిరెడ్డికి కాలం చెల్లినట్టేననే చర్చ వినిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News