Big Stories

KCR Operation Akarsh : కమల కల్లోలం.. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీకి మైండ్ బ్లాంక్!..

KCR Operation Akarsh : కమలం రేకులు ఒక్కోటిగా రాలిపోతున్నాయి. తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లూ రేవంత్ రెడ్డికి పోటీగా కమలదళాన్ని రెచ్చగొట్టి.. బాగా ప్రమోట్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు రూటు మార్చారు. కాషాయం స్పీడ్ కు బ్రేకులు వేస్తున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీలోకి లాగేయడంతో.. గులాబీ బాస్ బాగా హర్ట్ అయినట్టున్నారు. తనకే ఝలక్ ఇస్తారా అనుకున్నారో ఏమో.. కమలం పార్టీపై ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. కేసీఆర్ విసిరిన వలకు చిన్నాపెద్ద చేపలు వరుసగా చిక్కుతున్నాయి. పల్లె రవికుమార్ గౌడ్, బూడిద బిక్షమయ్య గౌడ్ లతో పాటు ఇటీవలే బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ కుమార్ సైతం కాషాయ కండువా తీసేసి.. గులాబీ రంగు పులుముకున్నారు. ఇక, మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ సైతం మళ్లీ కారు ఎక్కేయడం బీజేపీకి ఊహించని షాక్. వరుసగా నేతలు పార్టీని వీడుతుండటంతో కమలంలో కల్లోలం మొదలైంది.

- Advertisement -

ఈటలను చేర్చుకున్నాం.. కొండా విశ్వేశ్వరరెడ్డిని కలిపేసుకున్నాం.. బూర నర్సయ్య గౌడ్ ను లాగేసుకున్నాం.. ఇక తెలంగాణలో మాదే హవా అనుకుంటున్న బీజేపీకి కేసీఆర్ తనదైన స్టైల్ షాక్ ఇచ్చారు. ఆపరేషన్ ఆకర్ష్ తో రోజుల వ్యవధిలోనే వరుసబెట్టి కాషాయ నేతలను కారు పార్టీలో కలిపేసుకుంటున్నారు. బూర నర్సయ్య గౌడ్ గులాబీ కండువ తీసేయగానే.. కేసీఆర్ అలర్ట్ అయ్యారు. అదే సామాజిక వర్గానికి, అదే ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలపై వల విసిరారు. మొదట ఎంపీపీ పల్లె రవి ఆ గాలినికి చిక్కారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడితో ఆగలేదు వలసలు. లేటెస్ట్ గా.. మంచి వాగ్దాటి ఉన్న స్పోక్ పర్సన్ దాసోజు శ్రవణ్ ను బీజేపీ నుంచి లాగేశారు. ఆ వెంటనే మరో బిగ్ ఫిష్ ను పట్టేశారు. ఉద్యమ నేత, మండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీ ఒక్క లీడర్ ను తీసుకుంటే.. నలుగురితో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కేసీఆర్. వరుస వలసలతో కమలం పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యిందంటున్నారు.

- Advertisement -

అయితే, లేటెస్ట్ గా బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారంతా ఒకప్పటి కారు పార్టీ నేతలే కావడం ఆసక్తికరం. బిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాగా.. దాసోజు శ్రవణ్ మొదట్లో గులాబీ దళ సభ్యుడే. పార్టీలు మారడంలో ఎక్స్ పర్ట్. ప్రజారాజ్యంతో ప్రస్థానం ప్రారంభించి.. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి.. హరీష్ రావుతో పడకపోవడంతో కారు దిగి కాంగ్రెస్ లో చేరిన దాసోజు.. చాలా కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే హస్తానికి హ్యాండిచ్చి కాషాయ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు అదీ తీసేసి.. మళ్లీ గులాబీ జెండా పట్టుకోవడం చూసి.. ఆయనంతేలే అంటున్నారు.

ఇక స్వామి గౌడ్ రాజకీయ అరంగేట్రం టీఆర్ఎస్ లోనే. ఆ పార్టీ తరఫునే ఎమ్మెల్సీ అయి, మండలి ఛైర్మన్ గా చేశారు. వేరు వేరు కారణాలతో వారంతా కారు దిగి కాషాయం కప్పుకోగా.. తాజాగా వారంతా కాషాయం వదిలేసి మళ్లీ కారు ఎక్కేయడం వెనుక ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. మునుగోడు ఉప ఎన్నిక వేళ.. బీజేపీ, టీఆర్ఎస్ జంపింగ్ జపాంగ్ పాలిటిక్స్ తో పొలిటికల్ హీట్ మరింత రాజేశాయి. మరోవైపు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అండర్ కరెంట్ గా మునుగోడులో విసృత ప్రచారంతో దూసుకుపోతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News