BigTV English

Ambati Rayudu : అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్.. వైసీపీలో చేరిక..

Ambati Rayudu : ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ రోజు సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

Ambati Rayudu : అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్.. వైసీపీలో చేరిక..
Ambati Rayudu

Ambati Rayudu : ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ రోజు సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం క్రికెటర్‌ అంబటి రాయుడు మాట్లాడుతూ..రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయముందన్నారు. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు రాయుడు పేర్కొన్నారు.

తన ప్రాంత ప్రజల అభివృద్ది కోసం పని చేస్తానని అంబటి రాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ గతంలో చాలా ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. సాద్యం కాని హామీలను ఎలా చెప్తారని రాయుడు ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×