E-Paper
Advertisement

Car Subscription : కారు సబ్‌స్క్రిప్షన్ .. లాభాలివే!

Car Subscription : కారు సబ్‌స్క్రిప్షన్ .. లాభాలివే!
Advertisement

Car Subscription : మీరు ఈ దీపావళికి కొత్త కారు కొంటున్నారా? రెండు మూడేళ్ల తర్వాత దీన్ని మార్చాలనే ఆలోచన కూడా ఉందా? అయితే మీరు కారు సబ్‌స్క్రిప్షన్ గురించి తెలుసుకోవాల్సిందే. కొత్త కారు కొనేవారిలో నూటికి 90 మంది డౌన్ పేమెంట్ కట్టి, ఆపై ఈఎంఐలు కడుతూ ఉంటారు. ఈలోపు మార్కెట్లోకి మరో మంచి మోడల్ రాగానే.. పాత కారు అమ్మి కొత్తది కొనాలనుకుంటారు. కానీ.. పాత కారు ధర.. సగానికి పైగా పడిపోతుంది. అదే మీరు కారు సబ్‌స్ర్కిప్షన్ తీసుకుంటే.. ఈ ఇబ్బందే ఉండదు.

ఇదీ సంగతి..
మీకు నచ్చిన కొత్త కారుకు నెలకు కొంత మొత్తం కట్టి.. దాన్ని వాడుకోవచ్చు. తీసుకునేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌, ఆదాయ రుజువు పత్రాలు కారు కంపెనీకి ఇవ్వాలి. ఏడాది నుంచి నాలుగేళ్ల వరకూ కారుని సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. రోడ్ ట్యాక్స్, సర్వీసింగ్‌, రిజిస్ట్రేషన్‌, వారంటీ, రిపేర్లు వంటివన్నీ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తే వాడే కారుని ఇచ్చి, కొత్తదానికి మారిపోవచ్చు.
సెలక్ట్ చేసుకున్న టైం పీరియడ్ వరకూ కారుకు మీరే ఓనర్లుగా ఉంటారు.

Advertisement

పరిమితులు..
ఈ కార్లకు సబ్‌స్క్రిప్షన్ ఛార్జీ కాస్త ఎక్కువే ఉంటుంది. అలాగే కిలోమీటర్ల లిమిట్ కూడా ఉంటుంది. లిమిట్ కంటే ఎక్కువ దూరం తిరిగితే అదనంగా చెల్లించాలి. కారుకి స్టికర్స్, డిజైనింగ్ మార్పుల వంటివి కుదరదు. కారు మోడల్‌ను బట్టి కొన్నిసార్లు.. ఈఎంఐ కంటే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్ ఛార్జి కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ప్రధాన కారు కంపెనీలన్నీ సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను అందిస్తున్నాయి. తరచూ కారును మార్చేవారికి ఇది మంచి ఛాయిస్. కానీ.. కారుని అవసరంగా భావించి, వీలున్నన్ని రోజులు దానినే వాడేవారికి మాత్రం ఈఎంఐ మీద సొంతకారు కొనుక్కోవడమే బెటర్.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×