E-Paper
Advertisement

Rashmika Mandanna : ఆ వీడియో వైరల్.. రష్మిక రియాక్షన్ ..

Rashmika Mandanna :  ఆ వీడియో వైరల్.. రష్మిక రియాక్షన్ ..
Advertisement

Rashmika Mandanna : సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫేక్ వీడియో తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు స్పందించడంతోపాటు తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు ఇలాంటివి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమితాబచ్చన్ దగ్గర నుంచి కేంద్ర మంత్రి వరకు పోస్టులు పెట్టారు. ఎవరో ఆకతాయిలు కావాలని రష్మిక ఫేస్ పెట్టి టెక్నాలజీ ఉపయోగించి ఈ వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. 

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆకతాయిలు చేసే చేష్టలు శృతిమించుతున్నాయి. ఎవరో డీప్ ఫేక్ టెక్నాలజీ సహాయంతో రష్మిక మందన్న ఫోటోను మార్ఫింగ్ చేసి వీడియో తయారు చేశారు. ఇక ఈ ఫేక్ వీడియో వైరల్ కావడంతో రష్మిక అభిమానులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా వీడియో చేయడంపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి ఒక వ్యక్తి మానసిక స్థితిపై ఎంతో ప్రభావం చూపుతాయని.. అందుకే ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు తయారు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వైరల్ అయిన వీడియో చూసి అందరూ స్పందించారు తప్ప రష్మిక వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై మొదట్లో పలువురు తమ సందేహాలను వ్యక్తం చేశారు. అయితే రష్మిక ఈ సందేహాలకు తెరదించుతూ వైరల్ అవుతున్న తన వీడియో పట్ల స్పందించింది. టెక్నాలజీ అనేది మనిషి అభ్యుదయానికి ఉపయోగించాలి తప్ప ఇలాంటి వాటికి ఉపయోగించడం నిజంగా భయాన్ని కలిగిస్తోంది అంటూ ఆమె ఒక బహిరంగ లేఖ రాసింది.

“అసలు ఇలాంటి విషయం గురించి మాట్లాడాలి అంటే నాకు ఎంతో బాధగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నా డీప్ ఫేక్ వీడియో గురించి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు. నేనే కాదు.. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న ఈ కాలంలో ఎంతోమంది ఇలాంటి ఎదుర్కొంటున్నారు. ఈరోజు నేను ఒక నటిగా మాత్రమే కాదు మహిళగా కూడా మాట్లాడుతున్నాను. ఇటువంటి కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన నా కుటుంబం ,స్నేహితులు ,శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ఇదే విషయం నేను స్కూల్ లేక కాలేజీ సమయంలో ఉన్నప్పుడు జరిగే ఉంటే అసలు నేను దీన్ని ఎలా తట్టుకోగలను అనే విషయం ఊహించాలంటేనే భయంగా ఉంది. ఇలాంటి వాటి బారిన ఎక్కువమంది పడక ముందే ఇటువంటి సమస్యలను పరిష్కరించడం మంచిది”అని ఆమె తన పోస్టులో పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×