E-Paper
Advertisement

Budget Cars : బడ్జెట్ కార్లు పరిమితమే..

Budget Cars : బడ్జెట్ కార్లు పరిమితమే..
Advertisement

Budget Cars : గత కొంతకాలంగా కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. మధ్యతరగతికి అందనంతగా ధరలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇందుకు కారణాలెన్నో అని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సెమీకండక్టర్ల కొరత వల్ల సప్లై చెయిన్‌కు అవరోధాలు ఏర్పడ్డాయి. అలాగే ఇన్‌పుట్ వ్యయంలో పెరుగుదల, ప్రభుత్వ నిబంధనలు కఠినతరం కావడం వంటివి కూడా కార్ల ధరల పెరుగుదలకు దోహదం చేశాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ కార్లు అనేవి చాలా పరిమిత సంఖ్యలోనే ఉ న్నాయి. ఆరు లక్షల రూపాయల లోపు ఆన్‌రోడ్ రేట్ ఉన్న కార్లు దాదాపు కనుమరుగైనట్టే చెప్పొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బడ్జెట్ కార్లు ఏవో చూద్దామా..

అందరికీ అందుబాటులో ఉండే ధరలకు కార్లను అందిస్తున్న మారుతీ సుజుకి ఇండియా పేరొందింది. ఆల్టో 800 మోడల్ తయారీని నిలిపివేసినా.. ఎంట్రీలెవల్లో ఆల్టో కే10 మాత్రం అందుబాటులో ఉంది. దీని ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల(ఎక్స్-షోరూం) వరకు ఉంది. అయితే ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ లో టాప్ వేరియంట్ రూ.6 లక్షల్లోపు దొరకడం కష్టమే. బడ్జెట్ మరీ తక్కువగా ఉంటే దిగువ వేరియంట్ల నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మారుతి సుజుకి నుంచి సరసమైన ధరకు అందుబాటులో ఉన్నమరో మోడల్ ఎస్-ప్రెస్సో. దీని ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల(ఎక్స్-షోరూం) వరకు ఉంది. ఇందులోనూ పెట్రోల్, సీఎన్‌జీ టాప్ వేరియంట్లు రూ.6 లక్షలకుపైనే ఉంటుంది.

మధ్యతరగతికి అందుబాటులో ఉన్న మరో కారు రెనో క్విడ్. ఎక్స్-షోరూం ధర 4.69 లక్షల నుంచి 6.44 లక్షల వరకు ఉంది. గతంలో 0.8-లీటర్ పెటోల్ ఇంజన్ క్విడ్ మోడల్ అయితే అతి తక్కువ ధరకే లభ్యమయ్యేది. ప్రస్తుతం దాని ప్రొడక్షన్ ను నిలిపివేశారు.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×